ఈ రాశివారికి ఉద్యోగాలలో పురోభివృద్ధి | Sakshi
Sakshi News home page

ఈ రాశివారికి ఉద్యోగాలలో పురోభివృద్ధి

Published Tue, Apr 13 2021 6:23 AM

Daily Horoscope In Telugu 13-04-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి శు.పాడ్యమి ఉ.8.44 వరకు, తదుపరి విదియ నక్షత్రం అశ్వని ప.12.57 వరకు, తదుపరి భరణి, వర్జ్యం ఉ.8.34 నుండి 10.21 వరకు, దుర్ముహూర్తం ఉ.8.17 నుండి 9.07 వరకు తదుపరి రా.10.51 నుండి 11.35 వరకు, అమృతఘడియలు... ఉ.5.02 నుంచి 6.49 వరకు, శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది.

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం    :  6.11
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: పనులు చకచకా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సందేశం. నిర్ణయాలు మార్చుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

వృషభం: సన్నిహితులతో కొంత సఖ్యత. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మిథునం: నూతన ఉద్యోగయత్నాలు. పనుల్లో విజయం. ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. ఆకస్మిక ధనలబ్ది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోటీపరీక్షల్లో విజయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. సోదరులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

కన్య: రుణయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు వాయిదా. మిత్రులతో చర్చలు. విద్యార్థులకు అనుకూల సందేశం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. బంధువుల నుంచి పిలుపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

ధనుస్సు: చేపట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వ్యవహారాలలో అనుకూలత. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మకరం: కొత్త విషయాలు తెలుస్తాయి. ముఖ్య వ్యవహారాలు శ్రమానంతరం పూర్తి. దూరప్రయాణాలు. బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం కొంత తొలగుతుంది.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మీనం: సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ధనప్రాప్తి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.
 

Advertisement
Advertisement