Sakshi News home page

నూతన వంగడాలపై దృష్టి సారించండి

Published Fri, Mar 29 2024 1:45 AM

-

అనంతపురం సెంట్రల్‌: నూతన వంగడాల సృష్టిపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమా మహేశ్వరమ్మ అన్నారు. గురువారం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఏడీఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆమె మాట్లాడుతూ వేరుశనగ కే6 రకాన్ని దాదాపు 10 సంవత్సరాలుగా జిల్లా రైతులు సాగు చేస్తున్నారన్నారు. దీంతో దిగుబడులు తగ్గిపోతున్నాయన్నారు. వర్షాభావాన్ని తట్టుకొని, జిల్లా రైతాంగానికి మేలు చేసే రకాల ఉత్పత్తికి కృషి చేయాలని శాస్త్రవేత్తలను కోరారు. పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడులనిచ్చే కదిరి–9, లేపాక్షి–1812, టీసీజీఎస్‌ 1694(వశిష్ట) రకాలను రైతులకు సరఫరా చేయాలని సూచించారు. కంది పంటలో ఎల్‌ఆర్‌జీ–41 రకానికి బదులు పీఆర్‌జీ–176 రకాలను, కొర్రపంటలో సూర్యనంది, గరుడ రకాలను అందించాలన్నారు. కార్యక్రమంలో రేకుల కుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సహదేవరెడ్డి తదితరులున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement