జోలాపుట్టు స్పిల్‌వే వద్ద టెలీమెట్రీ ఏర్పాటు

జోలాపుట్టు స్పిల్‌వే జలాశయం వద్ద టెలీమెట్రీని ఏర్పాటు చేస్తున్న సిబ్బంది - Sakshi

ముంచంగిపుట్టు: మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి నీరు అందించే జోలాపుట్టు జలాశయం స్పిల్‌ వే వద్ద అధికారులు టెలీమెట్రీ సెన్సార్‌ ఆటోమేటిక్‌ వాటర్‌ లెవెల్‌ ట్రాన్స్‌మిషన్‌ను ఏర్పాటుచేస్తున్నారు. దీని వల్ల జలాశయంలో నీటి స్థాయిని ప్రతి 30 నిమిషాలకు ఆటోమెటిక్‌ సెన్సార్‌ తెలియజేస్తుందని ప్రాజెక్ట్‌ అధికారవర్గాలు తెలిపాయి. దీనివల్ల జలాశయ సిబ్బందితోపాటు భువనేశ్వర్‌లోని ప్రాజెక్ట్‌ ఉన్నతాధికారులు కూడా నీటి నిల్వలు తెలుసుకోవచ్చు. నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరినప్పుడు హెచ్చరికను టెలీమెట్రీ సూచిస్తుంది. విద్యుత్‌తోపాటు సోలార్‌ విధానంలో కూడా పనిచేస్తుంది.

Election 2024



 

Read also in:
Back to Top