-
చేవెళ్ల రణక్షేత్రం..సంపన్నుల సమరం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అందరి దృష్టి చేవెళ్లపైనే ఉంది. పల్లె, పట్టణాల కలబోతతో కూడిన ఈ లోక్‌సభ స్థానంలో మూడు ప్రధాన పార్టీలే కాదు.. ముగ్గురు సంపన్నులు పోటీ పడుతుండటమే ఇందుకు కారణం.గులాబీ కోటలో కమలం పువ్వును వికసింపజేయాలని బీజేపీ.. హస్తం హవా కొనసాగించాలని కాంగ్రెస్ భాస్తోంది. 2009లో మినహా ఇప్పటివరకు ఇక్కడ ఏ ఎన్నిక వచ్చినా కారుదే హవా. ఈసారి ఎలాగైనా కారు స్పీడ్‌కు బ్రేకులు వేయాలని బీజేపీ, కాంగ్రెస్ భావిస్తున్నాయి. బలమైన అభ్యర్థులను బరిలోకి దించాయి. అయితే ఒకసారి గెలిచిన వారు రెండోసారి విజయం సాధించిన చరిత్ర లేకపోవడంతో ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అంచనాలకు అందవు.. వ్యూహాలకు చిక్కరు అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, అనుబంధ పరిశ్రమలకు నెలవైన చేవెళ్ల లోక్‌సభ స్థానంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓటర్లే కాదు.. ఉత్తరాది ఓటర్లు కూడా ఉన్నారు. వారిలో ముస్లింలు 15 శాతం, ముదిరాజ్‌లు 15 శాతం, మాదిగలు 15.71 శాతం, గౌడ్లు 9.50 శాతం, మాలలు 7.86 శాతం, యాదవులు 7.86 శాతం, లంబాడీలు 6.57 శాతం, రెడ్లు 5 శాతం, కమ్మలు 3.43 శాతం, లింగాయత్‌లు 3.36 శాతం, మున్నూరుకాపులు 3 శాతం ఓటర్లు ఉన్నట్లు అంచనా.అభ్యర్థుల గెలుపోటములను ముస్లింలు, ముదిరాజ్‌లే డిసైడ్ చేయనున్నారు. అయితే ఓటర్ల తీరు అంచనాలకు అందడం లేదు. రాజకీయ వ్యూహాలకు కూడా చిక్కడం లేదు. 2009 నుంచి ఇప్పటివరకు జరిగిన ఈ మూడు ఎన్నికల్లో ఇదే అంశం స్పష్టమైంది. 2009లో కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి ఇక్కడ గెలవగా ఆ తర్వాత ఆయన మళ్లీ ఈ స్థానం నుంచి పోటీ చేయలేదు. 2014లో బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ మధ్య ఉత్కంఠ పోరు నెలకొనగా కాంగ్రెస్ అభ్యర్థి ఎస్. జైపాల్‌రెడ్డి 18,532 ఓట్ల ఆధిక్యంతో జితేందర్‌రెడ్డిపై విజయం సాధించారు. ఇక్కడ 64.5 శాతం పోలింగ్ నమోదైంది. ఇద్దరి అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 1.7 శాతమే కావడం గమనార్హం. మొత్తం ఓట్లు: 16,81,664 పోలైన ఓట్లు: 10,83,490 అభ్యర్థి పార్టీ వచ్చిన ఓట్లు శాతం ఎస్.జైపాల్‌రెడ్డి కాంగ్రెస్ 4,20,807 38.80 ఏపీ జితేందర్‌రెడ్డి టీడీపీ 4,02,275 37.102014 ఎన్నికల్లో 60.20 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో నోటాకు 10,018 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 73,023 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి పటోళ్ల కార్తీక్‌రెడ్డిపై గెలిచారు. మొత్తం ఓట్లు: 23,02,163 పోలైన ఓట్లు: 13,00,194 అభ్యర్థి పార్టీ వచ్చిన ఓట్లు శాతం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్ఎస్ 4,35,077 33.10 పి.కార్తీక్‌రెడ్డి కాంగ్రెస్ 3,62,054 27.50 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గెలుపు దోబూచులాడింది. చివరికి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి 1.1 శాతం ఓట్ల తేడాతో విజయం సాధించారు. నోటాకు 9,244 ఓట్లు పోలయ్యాయి.మొత్తం ఓట్లు: 21,85,179 పోలైన ఓట్లు: 13,15,862 అభ్యర్థి పార్టీ వచ్చిన ఓట్లు శాతం జి.రంజిత్‌రెడ్డి టీఆర్ఎస్ 5,28,148 40.60 కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ 5,13,831 39.05 ముగ్గురూ కోటీశ్వరులే.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (బీజేపీ) రూ.4,490 కోట్లు గడ్డం రంజిత్‌రెడ్డి (కాంగ్రెస్) రూ.869.77 కోట్లుకాసాని జ్ఞానేశ్వర్ (బీఆర్ఎస్) రూ. 520.70 కోట్లు అభ్యర్థులు వారే.. పార్టీలే వేరు ప్రస్తుతం బరిలో నిలిచిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గతంలో వేర్వేరు పార్టీల నుంచి తలపడిన వారే. ప్రస్తుతం వారు మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన సంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకుతోపాటు రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవెళ్ల, శేరిలింగంపల్లి, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముస్లిం ఓటర్లపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు హామీని ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రధాని మోదీపైనే భారం వేశారు. మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి వంటి అర్బన్ ఏరియాల్లో ఉన్న బీజేపీ కేడర్, మోదీ అభిమానులను ఆయన టార్గెట్‌గా ఎంచుకున్నారు. చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరులో వ్యక్తిగత పరిచయాలను నమ్ముకున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, శాసనమండలి సభ్యుడు కాసాని జ్ఞానేశ్వర్ పోటీ పూర్తిగా బీసీ ఓటర్లనే నమ్ముకున్నారు. లోక్‌సభ స్థానంలో 16.50 లక్షల బీసీలు ఉంటారని, వారే తనను గెలిపించనున్నారనే ధీమాతో ఉన్నారు. -
షాద్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నందిగామ మండల కేంద్రంలోని అల్విన్ ఫార్మసీ కంపెనీలో ప్రమదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడటంతో.. కంపెనీ మొత్తానికి మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో కంపెనీలో సుమారు 100కుపైగా కార్మికులు ఉండగా.. ప్రాణ భయంతో చాలా మంది బయటకు పరుగులు తీశారు. అయితే.. దట్టమైన పొగ అలుముకోవటంతో.. ఎటువెళ్లలేక సుమారు 50 మంది వరకు లోపలే చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయిదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పరిశ్రమను ఆనుకుని నూతనంగా నిర్మిస్తున్న షెడ్డులో వెల్డింగ్ పనులు జరుగుతుండగా.. మంటలు అంటుకున్నాయని కార్మికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. కొందరు కార్మికులను కిటికీల్లోంచి నిచ్చెనల సాయంతో బయటకు తీసుకొచ్చారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియాల్సి ఉంది.బాలుడి సాహసంఅగ్ని ప్రమాద సమయంలో ఓ బాలుడు ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. ప్రమాదాన్ని ముందుగా గుర్తించిన బాలుడు సాయిచరణ్.. కంపెనీ మంటల్లో చిక్కుకున్న బాధితులను కాపాడాడు. అగ్నిప్రమాద తీవ్రతను పసిగట్టిన బాలుడు.. భవనం పైకి ఎక్కి తాడు కట్టాడు. కిటీకి ద్వారా కార్మికులు కిందకు దిగేందుకు సాయచరణ్ సాయం చేశాడు. మొత్తం 50 మందిని కార్మికులను కాపాడాడు. -
బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నాడు వ్యాపారం ముసుగులో బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ వాళ్లు దేశాన్ని ఆక్రమించుకునేందుకు సూరత్ నుంచి బయలుదేరి వచ్చారని.. నేడు అదే సూరత్ నుంచి మోదీ, అమిత్‌షా బయలుదేరారని టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని.. ఇక్కడ బ్రిటిష్ వాళ్లలా ఆక్రమణ ఎజెండాను అమలు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు చేస్తోందని.. మళ్లీ అధికారంలోకి వస్తే దళితుల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల సెగ్మెంట్ పరిధిలోని రాజేంద్రనగర్‌లో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ రోడ్ షోలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నారు. వారికి ఏ ఒక్కరోజు కూడా ప్రజలు గుర్తుకురాలేదు. బీజేపీని 400 సీట్లలో గెలి పించాలని మోదీ అంటున్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశంలో రిజర్వేషన్లను ఎత్తివేయడం ఖాయం. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్తకాదు. 70 ఏళ్లు ఈ దేశాన్ని పాలించింది. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించింది. ఆ రిజర్వేషన్లను మోదీ ప్రభుత్వం రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోంది. రూ.లక్ష కోట్లతో మూసీ అభివృద్ధి..: వికారాబాద్‌లో మొదలైన మూసీ నది నల్లగొండ దాకా కలుషితంగా మారిపోయింది. ఈ మూసీని ప్రక్షాళన చేసి, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లను అభివృద్ధి చేయాలన్నా.. వికారాబాద్‌ను పర్యాటక ప్రదేశంగా మార్చాలన్నా చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్రెడ్డిను గెలిపించాలి. గతంలో కాంగ్రెస్ పాలనలో వికారాబాద్ శాటిలైట్ సిటీ, ఎంఎంటీఎస్ రైలును మంజూరు చేస్తే.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేసింది. రూ.లక్ష కోట్లతో మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తాం. కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు భూముల ధరలు పెంచే బాధ్యత నాది. మతవాదులకు బుద్ధి చెప్పాలి: దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. బీజేపీ వాళ్లు ఇప్పుడే శ్రీరామనవమి, హనుమాన్ జయంతిని కనిపెట్టినట్టు చెప్తున్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మతతత్వ వాదులకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కుటుంబానికి మంచి చరిత్ర ఉంది. కానీ ఆయన బీజేపీలో చేరి కలుషితమయ్యారు. చేవెళ్లలో రంజిత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి. బిడ్డకు బెయిల్ కోసం బలహీన అభ్యర్థి: కేసీఆర్ సీఎంగా పదేళ్లు కొనసాగారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. బీఆర్ఎస్ కారు పనైపోయింది. ఇది తెలిసే కేసీఆర్ బస్సు వేసుకుని బయలు దేరారు. ఆయన ఎంత మొసలి కన్నీరు కార్చినా ప్రజలు నమ్మడం లేదు. బిడ్డకు బెయిల్ కోసమే చేవెళ్లలో బలహీనమైన అభ్యర్థిని బరిలో నిలిపారు..’’అని పేర్కొన్నారు. సంక్షేమానికి పెద్ద పీట వేసేది కాంగ్రెసే..: రంజిత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను అమలు చేసి మాట నిలబెట్టు కుందని ఆ పార్టీ చేవెళ్ల అభ్యర్థి రంజిత్‌రెడ్డి చెప్పారు. రాజేంద్రనగర్ రోడ్ షోలో ఆయన మాట్లాడారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పెద్ద పీట వేస్తుందన్నారు. ప్రస్తుతం సెక్యులర్ కాంగ్రెస్ పార్టీ, మతతత్వ బీజేపీ మధ్య పోరు జరుగుతోందని వ్యాఖ్యానించారు. కంటోన్మెంట్ సమస్యలు తీరుస్తాం..: రేవంత్ రసూల్‌పురా (హైదరాబాద్): సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీరుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గురువారం మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని బాలంరాయి కమాన్ నుంచి అన్నానగర్ వరకు నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్లు మూసేసి ప్రజలను ఇబ్బందులు పెట్టిందని ఆరోపించారు. ఇక్కడ రిజి్రస్టేషన్ల విషయంలో, తాగునీటి విషయంలో సమస్యలు ఉన్నాయన్నారు. ‘‘కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న నాకు మంచి మిత్రుడు. ఆయన ఎమ్మెల్యే పదవిలో ఉండగా మరణించారు. అయినా కేసీఆర్ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయించలేదు. అదే సినిమా వాళ్లు చనిపోతే మాత్రం ఏడు రౌండ్లు గాల్లోకి పోలీసు కాల్పులతో అధికార లాంఛనాలు చేయించారు..’’అని మండిపడ్డారు. కాంగ్రెస్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డిని, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీగణేశ్లను గెలిపించాలని పిలుపునిచ్చారు. -
డోర్ నంబర్లూ డొల్లే !
ఒకే కుటుంబం.. కేంద్రాలు అనేకం!సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లున్న చిత్రాలు తెలుసు. ఇది ఎలా సాధ్యం ? అంటే ఇష్టానుసారం డోర్ నంబర్లతో ఓటరు జాబితాలో పేరు చేరిపోవడం ఒక కారణం. ఒక ప్రాంతంలోని వారందరూ ఓటరుగా నమోదయ్యేటప్పుడు తమ సమీపంలోని వారు ఇచ్చిన డోర్ నంబర్‌తోనే తమ పేర్లు కూడా నమోదు చేసుకున్న వారున్నారు. ఒక పెద్ద భవనంలోని అద్దెదారులందరూ కూడా ఒకే డోర్నంబర్తో ఓటర్లుగా నమోదైన వారున్నారు. అంతే కాదు ఇంకొందరైతే జీహెచ్ఎంసీ కేటాయించిన ఇంటినెంబరు కాకుండా తమ ఇష్టానుసారం డోర్ నంబర్లను వేసిన వారున్నారు. ఒక ఇంటినంబరుకే అదనంగా చివరన ఎ,బి,సిలు చేర్చడమో లేక బై నంబర్లు వేయడమో చేసి ఆ ఇంటి నంబరుతోనే ఓటరుగా నమోదయ్యారు. సంబంధిత అధికార యంత్రాంగం సైతం ఆన్లైన్లోనమోదు చేసుకున్నప్పటికీ, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం కూడా ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన యంత్రాంగం గత రెండేళ్లుగా 2022 మార్చి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు 1,81,405 మంది ఓటర్లు ఇలాంటి ఇంటినంబర్లతో ఓటర్లుగా ఉన్నట్లు గుర్తించారు.వారిని స్టాండర్డ్ ఇంటినంబర్లలో లేనివారుగా పేర్కొంటున్నారు. అలాంటి వారిని గుర్తించి సరిచేసినట్లు పేర్కొన్నారు. సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ కుటుంబంలో భార్యాభర్తలతో పాటు వారిద్దరి పిల్లలకు ఓటు హక్కు ఉంది. అందరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు అందరూ కలిసి వెళ్లవచ్చులే అనుకున్నారు.అందరూ ఒకేసారి వెళ్లి, రావచ్చుననుకున్నారు. అందుకు ఒక ఆటోలో వెళ్తే సరిపోతుంది అనుకుంది ఆ మధ్య తరగతి కుటుంబం. ఇంటింటికి వచ్చి ఇచ్చిన పోల్ స్లిప్ చూస్తే కుటుంబంలోని భర్తకు ఒక పోలింగ్ కేంద్రం, భార్యకు మరో పోలింగ్ కేంద్రంలో ఓటు ఉన్నట్లు గుర్తించారు. పిల్లలిద్దరికీ ఒకే లొకేషన్ రావడం కొంతలో కొంత నయం. లొకేషన్ ఒకటే అయినా వారి పోలింగ్ కేంద్రాలు కూడా వేరే. దీంతో పిల్లలిద్దరు మాత్రం పోలింగ్ బూత్‌దాకా వెళ్లి ఓటేసినా.. భార్యాభర్తలకు చెరో చోట రావడంతో వారు వెళ్లలేదు.ఒక్కొక్కరు ఒక్కో వాహనం సమకూర్చుకోలేకపోవడంతోపాటు కలిసి వెళ్లలేక పోతున్నామనే తలంపుతోనూ వారు ఓటేసేందుకు ఉత్సాహం చూపలేదు. ఇది ఒక్క నియోజకవర్గంలోని ఒక్క కుటుంబం పరిస్థితి మాత్రమే కాదు. ఇలా ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు ఉంటోంది. నగరంలో పోలింగ్ శాతం తగ్గడానికి ఇదీ ఓ కారణం. ఇలా ఎందుకవుతుందో అంతుపట్టలేదు. పోలింగ్ శాతం తగ్గేందుకు ఇదీ ఓ కారణంగా గుర్తించిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మే నుంచి నవంబర్ మధ్య ఇలా ఒకే కుటుంబానికి చెందినప్పటికీ వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న 3,60,849 మంది ఓటర్లను కుటుంబమంతటికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లుండే చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైతం ఈ ప్రక్రియను కొనసాగించింది. 2024 మార్చి నెలాఖరు వరకు అలా 17,864 మంది ఒకే కుటుంబ ఓటర్లకు ఒకే పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంది. వెరసి మొత్తం 3,78,713 మంది ఓటర్లకు ఒక కుటుంబంలోని వారు ఒకే చోట ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. నగర ఓటరు జాబితాలో వింతలెన్నో రెండేళ్లుగా సరిదిద్దుతున్న యంత్రాంగం నగరంలో వింత పరిస్థితి పోలింగ్ శాతం తగ్గుదలకు ఇదీ ఓ కారణం -
ఎన్నికలకుసై
నేడే లోక్‌సభ ఎలక్షన్ నోటిఫికేషన్ ● ఆ వెంటనే నామినషన్ల స్వీకరణ ● 18, 19, 24 తేదీల్లో శుభ ముహూర్తాలు ● నామినేషన్ల దాఖలుకు అభ్యర్థుల ఏర్పాట్లు సాక్షి, రంగారెడ్డిజిల్లా: సార్వత్రిక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. అధికార యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లలో తలమునకలైంది. ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీ వంటి అంశాలపై గట్టి నిఘా తదితర చర్యలు చేపట్టింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తుంది. యువత, మహిళలు, వృద్ధులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తుంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రిటర్నింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కోసం మంచి ముహూర్తాలను అన్వేశిస్తున్నారు. ఇప్పటికే పంతుళ్లను ఆశ్రయించి, ఏ రోజు నామినేషన్ వేయాలనే అంశంపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. శుభ ముహూర్తాలు ● 18వ తేదీ గురువారం దశమి, మగ నక్షత్రం మంచి రోజు కావడంతో అభ్యర్థులు సాదాసీదాగా వెళ్లి నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ● 19న శుక్రవారం, ఏకాదశి, ముఖ నక్షత్రం మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజే నామినేషన్లు వేసేందుకు మెజార్టీ అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. ● 24న బుధవారం చైత్ర బహుళ పాడ్యమితో పాటు స్వాతి నక్షత్రం, చాలా బాగుంది. ఈ రోజు నామినేషన్లు సమర్పిస్తే.. అంతా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. ● 22 సోమవారం చతుర్థశి, అష్టానక్షత్రం. నామినేషన్ల దాఖలుకు మంచి రోజు. ● 21న ఆదివారం త్రయోదశి, ఉత్తర నక్షత్రం.. పై ముహూర్తాల కంటే ఇది యోగ్యమైనది. కానీ ఆరోజు సెలవు కావడంతో అభ్యర్థులు ముందు రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి వస్తుంది. ● గతంలో నామినేషన్ల కార్యక్రమం చాలా అట్టహాసంగా చేసే వారు. భారీగా జనాన్ని సమీకరించి, ర్యాలీగా వెళ్లి నామినేషన్లు వేసే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎండలు భగ్గున మండుతుండటంతో పార్టీ శ్రేణులు సైతం బయటికి వెళ్లేందుకు జంకుతున్నాయి. ఈ నేపథ్యంలో సాదాసీదాగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలు ఇలా ● అభ్యర్థులు నామినేషన్ ఫారం–2ఎను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా పొందవచ్చు. ● ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ● అభ్యర్థి వెంట మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతి. ● జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఒక ఓటరు నామినేషన్‌ను ప్రతిపాదించాలి. ● అదే రిజిస్ట్రర్ రాజకీయ పార్టీలు/ స్వతంత్ర అభ్యర్థులకు పది మంది ఓటర్లు నామినేషన్‌ను ప్రతిపాదించాల్సి ఉంది. ● అభ్యర్థులు మూడు నెలల లోపు దిగిన ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో అఫిడవిట్‌పై అతికించాలి. ● నామినేషన్ పత్రంపై స్టాంప్ సైజు ఫొటో పెట్టాలి. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేరే పార్లమెంట్ సెగ్మెంట్‌కు చెందిన వారైతే విధిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్ వీఆర్ఓ నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. ● రిజస్టర్/ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ ఫారంలోని పార్ట్–3లో సి కాలం ఎదుట ఎన్నికల సంఘం నిర్ధేశించిన గుర్తుల్లో ఏదైనా మూడు గుర్తులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసి, ఆ వివరాలను పొందుపరచాలి. ● పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ● అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షలు ఖర్చు చేసేందుకు అనుమతి. ● ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీల నిర్వహణ పక్కాగా నిర్వహించాలి. నామినేషన్ల స్వీకరణ కోసం రాజేంద్రనగర్ తహహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు, భద్రత కోసం చేవెళ్లలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీని ఎంపిక చేశారు. మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో మొత్తం 29,28,186 మంది ఓటర్లు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. మొత్తం 2,877 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణకు 13,443 పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయనున్న తేదీ బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 19 బీజేపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 22 కాంగ్రెస్ గడ్డం రంజిత్‌రెడ్డి 25షెడ్యూల్ ఇలా.. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏప్రిల్ 18న నోటిఫికేషన్ ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల స్వీకరణ సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా విడుదల మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జూన్ 6తో ఎన్నికల ప్రక్రియ ముగింపు
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్‌రైజర్స్ ఘోర ఓటమి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్‌షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్‌దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
Advertisement