-
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి మృతి..
సాక్షి, ముంబై: ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి విద్యాసిన్హా(71) గురువారం ముంబైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. హృదయ, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆమె కొంతకాలంగా వెంటిలేటర్‌పైనే ఉన్నారు. గతంలో అనారోగ్య కారణాలతో బుల్లితెరలో ప్రసారమయ్యే ‘కుల్ఫీ కుమార్ బజేవాలా షో’ నుంచి విద్యాసిన్హా తప్పుకున్నారు. అయితే ఆరోగ్యం కుదుటపడిందని భావించి కొన్ని వారాల క్రితం షోలో తిరిగి ఎంట్రీ ఇవ్వగా మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. కాగా విద్యాసిన్హా మరణానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. విద్యాసిన్హా 27 ఏళ్ల వయస్సులో బాలీవుడ్లో హీరోయిన్గా కెరీర్‌ను ప్రారంభించి అనతికాలంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చోటీసీ బాత్, రజనీ గంధ, పతి పత్ని ఔర్వో అనే చిత్రాలు ఆమె కెరీర్లో బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. సినిమాల్లోనే కాకుండా బుల్లితెరలో ప్రసారమయ్యే కార్యక్రమాల్లోనూ ప్రత్యక్షమై ప్రేక్షకులను మెప్పించారు. కుల్ఫీ కుమార్ బజేవాలా, కుబూల్ హై, కావ్యాంజలి, భాబీ వంటి పలు షోలలో విద్యాసిన్హా నటించింది. బాలీవుడ్ ఒక మంచి నటిని కోల్పోయిందని ప్రముఖ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ప్రముఖ బాలీవుడ్ నటి ఆరోగ్యం ఆందోళనకరం
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాసిన్హా(71) అనారోగ్యం పాలవడంతో ముంబైలోని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గుండె, ఊపిరితిత్తులు సంబంధిత వ్యాదులతో ఆమె గత కొంతకాలంగా బాధపడుతున్నారు. శనివారం పల్స్రేట్ పడిపోవడంతో ముంబైలోని క్రిటికేర్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాగా, విద్యాసిన్హా బాలీవుడ్లో 27 ఏళ్లకు హీరోయిన్గా కెరీర్‌ను ప్రారంభించినా అనతికాలంలోనే మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చోటీసీ బాత్, రజనీ గంధ, పతి పత్ని ఔర్వో అనే చిత్రాలు ఆమె కెరీర్లో బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్న 'రజనీగంధ'లో విద్యాసిన్హా నటనకు వ్రశంసలు లభించాయి. సినిమాలో అవకాశాలు తగ్గాక ఆమె కెరీర్‌ను బుల్లితెరవైపుకు మరల్చారు. ప్రస్తుతం స్టార్ ప్లస్ టెలివిజన్‌లో ప్రసారమయ్యే 'కుల్ఫీ కుమార్ భాజేవాలా' అనే షోలో గ్రాండ్ మదర్ పాత్ర చేస్తున్నారు. ఈమె నటించిన హిట్ చిత్రం 'పతి పత్నీ ఔర్ వో'ను ప్రస్తుతం బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. -
బాలీవుడ్ సీనియర్ నటి సాధన కన్నుమూత
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటి సాధన(74) కన్నుమూశారు. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాధన శుక్రవారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారని ఆమె స్నేహితురాలు, బీజేపీ ముంబై అధికార ప్రతినిధి షైనా ఎన్ సీ తెలిపారు. సాధనకు పెంపుడు కుమార్తె ఉన్నారు. 1941, సెప్టెంబర్ 2న కరాచీలోని సింధ్ కుటుంబంలో ఆమె జన్మించారు. 1959లో వచ్చిన 'లవ్ ఇన్ సిమ్లా' సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమయ్యారు. 1960 దశకంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందారు. పరాఖ్, హమ్ దోనో, ప్రేమ్ పత్రా, అసలీ-నకిలీ, ఏక్ ముసాఫిర్ ఏక్ హసినా, దుల్హా దుల్హన్, మేరీ మెహబూబ్, దిల్ దౌలత్ దునియా, ఛోటే సర్కార్ తదితర సినిమాల్లో నటించారు. అప్పట్లో 'సాధనా కట్' పేరుతో ఆమె కేశాలంకరణ(హెయిర్ స్టైల్) బాగా పాపులర్ అయింది. ముంగురులను నుదుటిపై అడ్డంగా దువ్విన తలకట్టు మహిళా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సాధన మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement