బాలీవుడ్ సీనియర్ నటి సాధన కన్నుమూత

బాలీవుడ్ సీనియర్ నటి సాధన కన్నుమూత


ముంబై: బాలీవుడ్ సీనియర్ నటి సాధన(74) కన్నుమూశారు. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాధన శుక్రవారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారని ఆమె స్నేహితురాలు, బీజేపీ ముంబై అధికార ప్రతినిధి షైనా ఎన్ సీ తెలిపారు. సాధనకు పెంపుడు కుమార్తె ఉన్నారు.1941, సెప్టెంబర్ 2న కరాచీలోని సింధ్ కుటుంబంలో ఆమె జన్మించారు. 1959లో వచ్చిన 'లవ్ ఇన్ సిమ్లా' సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమయ్యారు. 1960 దశకంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందారు. పరాఖ్, హమ్ దోనో, ప్రేమ్ పత్రా, అసలీ-నకిలీ, ఏక్ ముసాఫిర్ ఏక్ హసినా, దుల్హా దుల్హన్, మేరీ మెహబూబ్, దిల్ దౌలత్ దునియా, ఛోటే సర్కార్ తదితర సినిమాల్లో నటించారు.అప్పట్లో 'సాధనా కట్' పేరుతో ఆమె కేశాలంకరణ(హెయిర్ స్టైల్) బాగా పాపులర్ అయింది. ముంగురులను నుదుటిపై అడ్డంగా దువ్విన తలకట్టు మహిళా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సాధన మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top