-
పానీ పూరీ: ఈ అనిల్ భాయ్ లెక్కే వేరు: వైరల్ వీడియో
పానీ పూరీ అంటే ప్రాణం లేచి వస్తుంది చాలామందికి. అయితే పానీ పూరి బండి నడిపే 71 ఏళ్ల వృద్ధుడితో సెల్ఫీల కోసం జనం ఎగబడుతున్నారు. ఆయన పేరే గుజరాత్‌కు చెందిన అనిల్ భాయ ఠక్కర్. ఈ పానీ పూరీ వాలా ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాడు. స్టోరీ ఏంటంటే.. మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారట. అది ఎంతవరకు నిజమోగానీ, గుజరాత్‌కు చెందిన అనిల్ భాయ్ ఠక్కర్ మాత్రం తన సైడ్ ప్రొఫైల్, హెయిర్‌స్టైల్, తెల్లటి గడ్డం, ఆఖరికి డ్రెస్సింగ్ స్టయిల్ కూడా అచ్చం ప్రధాన మంత్రి మోదీ పోలికలతో కస్టమర్లను కట్టిపడేస్తున్నాడు. ఈయన గుజరాత్‌లోని ఆనంద్‌లో ‘తులసి పానీ పూరీ సెంటర్’ను నడుపుతున్నాడు. అచ్చం మోదీలా ఉన్న అనిల్ భాయ్నును స్థానికులంతా పీఎం మోదీ అని పిలుచుకుంటారు. ప్రధాని మోదీతో ఉన్న పోలిక కారణంగా స్థానికులు, పర్యాటకుల నుండి తనకు చాలా ప్రేమ, గౌరవం లభిస్తోంది అంటాడు ఆనందంగా అనిల్ భాయ్. అంతేకాదు ప్రధాని తనకు ఎంతో స్ఫూర్తి పొందానని, పరిశుభ్రతకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో, అలాగే తన స్టాల్‌ను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారని అనిల్ భాయ్ చెప్పుకొచ్చాడు. అనిల్ భాయ్ వాస్తవానికి జునాగఢ్‌కు చెందినవాడు. తన తాత ప్రారంభించిన 'తులసి పానీ పూరీ సెంటర్'ను 18 ఏళ్ల వయస్సునుంచే నడిపిస్తున్నాడు. కాగా ముంబైలోని మలాడ్‌కు చెందిన వికాస్ మహంతే కూడా ప్రధాని పోలికలతో ఇటీవల వార్తల్లో నిలిచాడు. గర్భా వాయిస్తున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
ఓటు వేయకుంటే రూ. 350 జరిమానా? నిజమెంత?
దేశంలో ఒకవైపు లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతుండగా, మరోవైపు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. రాబోయే ఎన్నికల్లో ఓటు వేయని వారికి రూ. 350 జరిమానా ఉంటుందని, ఈ మెత్తం సదరు ఓటరు బ్యాంకు ఖాతా నుంచి కట్ అవుతుందని ఆ పోస్టులో తెలిపారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బు లేని ఓటర్లు.. వారు మొబైల్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు వారి నగదు జరిమానా కింద కట్ అవుతుందని కూడా ఆ పోస్ట్‌లో తెలియజేస్తున్నారు. ఈ ఉదంతంపై ఎన్నికల సంఘం స్పందించింది. ఇది పూర్తిగా అవాస్తవమని, కమిషన్ అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. భారత ప్రభుత్వ ప్రెస్ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కూడా ఈ ప్రచారం అబద్ధమని పేర్కొంది. ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలను షేర్ చేయవద్దని పీఐబీ ప్రజలను కోరింది. 𝗙𝗮𝗹𝘀𝗲 𝗰𝗹𝗮𝗶𝗺 : नहीं दिया वोट तो बैंक अकाउंट से कटेंगे 350 रुपएः आयोग 𝗥𝗲𝗮𝗹𝗶𝘁𝘆 : यह दावा फर्जी है, चुनाव आयोग द्वारा ऐसा कोई निर्णय नहीं लिया गया है।#FakeNews #ECI #VerifyBeforeYouAmplify pic.twitter.com/yqnzWwrw6E — Election Commission of India (@ECISVEEP) April 2, 2024 -
కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? ఈ వీడియో చూడండి!
సమ్మర్ వచ్చేసింది...ఎండలు మండిపోతున్నాయని కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. కల్తీ కోకా కోలా డ్రింక్ బాటిల్స్ వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. (ఎనిమిదేళ్లకే పెళ్లి..బడి గుమ్మం తొక్కలేదు : అయితేనేం ఆమె ఒక లెజెండ్!) ఈ వీడియో ప్రకారం కోకా కోలా లేబుల్స్ వేసిన ప్లాస్టిక్ బాటిల్స్‌లో ఒక వ్యక్తి డ్రింక్‌ను నింపుతున్న దృశ్యాలను ఇందులో చూడొచ్చు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేందిరా ఇది.. ఎపుడు చూడలే అంటూ ఒకింత ఆందోళనగా కమెంట్స్ చేస్తున్నారు. (వేసవిలో చల్ల చల్లగా : గోండ్ కటీరా జ్యూస్.. ఒక్కసారి తాగితే..!) ఈ కోకాకోలా ఫ్యాక్టరీలో తయారైనా ఒకటే, బాత్ రూంలో తయారైనా ఒకటి పెద్దగా తేడా ఏముంది అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. మరికొంతమంది దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కోకాకోలాను ట్యాగ్‌ను గమనార్హం. అయితే ఈ వీడియో ఎక్కడిది? ఏ ప్రదేశానికి చెందినది అనే వివరాలు అందుబాటులో లేవు. మరి ఈ వీడియోపై కోకా కోలా కంపెనీ ఎలా స్పందిస్తుందో చూడాలి. (లగ్జరీ బంగ్లాను విక్రయించిన ఇషా అంబానీ? ఎవరు కొన్నారు? ) A forward doing the rounds. Things get ...... With @CocaCola pic.twitter.com/vAhxcDhb1F — R. Balakrishnan (@BalakrishnanR) March 29, 2024 -
Holi 2024 యాంకర్ సుమ వీడియో: చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండేదట!
యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకరింగ్, యాక్టింగ్, స్టేజ్ షోలు,సినిమాలు.. ఇలా ప్రతీ అంశంలోనూ నా స్టయిలే వేరు అన్నట్టు దూసుకుపోవడం సుమకు వెన్నతో పెట్టిన విద్య. దాదాపు ప్రతీ పండుగకు ఒక సందేశంతో ప్రాంక్ వీడియోలను చేయడం అలవాటు. ఫన్నీగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం ఆమె స్టయిల్. తాజాగా హోలీ సందర్భంగా కూడా ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) ముఖ్యంగా నీటిని వేస్ట్ చేయొద్దు అనే సందేశంలో ఈ వీడియోను షేర్ చేయడం విశేషం. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. మీకు తప్ప ఎవరికి ఇలాంటి ఐడియాస్ రావు సుమ గారు ఒకరు కామెంట్ చేయగా, ఇలాంటి వీడియోలు చేయడం మీకే సాధ్యం మేడమ్.. హ్యాపీ హోలీ శుభాకాంక్షలు అందించారు ఇంకొందరు. అయితే చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండు మరొకరు ఫన్నీగా కామెంట్ చేయడం గమనార్హం. -
విదేశాల్లో చదువు : ఫన్ అన్నారు, అంట్లు కడిగితే తప్పేంటి?
విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవడం ఒకప్పుడు కాస్ట్లీ వ్యవహారంగా ఉండేది.అది గొప్పోళ్లకే సొంతం అన్నట్టు ఉండేది. కానీ చాలామంది బ్యాంకు లోన్లు తీసుకొని మరీ చదువు కోవడానికి అమెరికా, ఇంగ్లాండ్, కెనడా ఇలా పలుదేశాలకి ఎగిరిపోతున్నారు. తీరా అక్కడికెళ్లాక చాలామంది విద్యార్థులు కల్చర్ పరంగా, ఆర్థికంగా ఇలా రక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రధానంగా స్వతంత్రంగా, భద్రంగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అన్ని నిబంధనలూ, క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఒక పక్క చదువుకుంటూనే ఏదో ఒక జాబ్ చేస్తూ కష్టపడాలి. మల్టీ టాస్కింగ్ చేయాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. కానీ అపుడు మాత్రమే, అక్కడి ఖర్చులు లోన్లు రెండిటినీ బ్యాలెన్స్ చేయగలుగుతారు విద్యార్థులు. కొందరు చదువుతున్న కాలేజీల్లోనే అసిస్టెంట్లుగా పనిచేస్తారు. పనికొందరు మాత్రం వంట చేయడం, గిన్నెలు కడగటం, పిల్లల సంరక్షణా కేంద్రాలు, మొదలు పెట్రోలు బంక్, ఇతర దుకాణాల్లో పనిచేస్తారు. తాజాగా భారతీయ విద్యార్థి ఒకరు ఇలా అంట్లు కడుగుతున్న వీడియో నొక దాన్ని ఒకరు షేర్ చేశారు. విద్యార్థి నాన్-స్టిక్ పాన్‌ను కడుగుతున్న ఫోటోను ఎక్స్ (ట్విటర్) లో పోస్ట్ చేశాడు. ‘‘విదేశాలకి స్టడీకోసంవెళ్లండి, సరదాగా ఉంటుంది అన్నారు." క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. కొందరు యూజర్లు ఈ పోస్ట్‌ను సానుకూలంగా అర్థం చేసుకోగా, మరికొందరు మాత్రం అంట్లు కడిగితే తప్పేంటి, చిన్న చిన్న పనులైనా నేర్చుకుని ఉండాలి అంటూ మండి పడ్డారు. విదేశాల్లో అయినా ఇండియాలో అయినా ఎవరో ఒకరు అంట్లు కడగాల్సిందే.. వాటంతట అవి శుభ్రపడవు. కాకపోతే నువ్వు ఇంటికొచ్చాక ఇంకొకరు చేస్తారు. లేదా పెళ్లి అయ్యాక నీకోసం ఆ పనులు మరొకరు చేయాలని భావిస్తావ్.. అంతే తేడా. దీన్ని ఫన్‌గా అనుకోకుండా, జీవితమంతా ప్రతిరోజూ మీకోసం మీరు పనులు చేసుకోవాలని అర్థం చేసుకోండి అని కమెంట్ చేయడం గమనార్హం. go study abroad it’ll be fun they said pic.twitter.com/3yoj19uKyC — Dew (@itmedew) March 19, 2024
Pagination
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
- అమరజీవికి అవమానం
- క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
- మే నెలలోనూ పింఛన్‌దారులకు కష్టాలే!
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్‌లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
Advertisement