-
ఫుడ్ డెలివరీ బాయ్ టాలెంట్‌కు మెచ్చి సాయం చేసిన రాహుల్ సిప్లిగంజ్
మధురమైన గాత్రాలను వెలికి తీసుకువచ్చే ప్రయత్నమే సింగింగ్ షో. ఇలాంటి సింగింగ్ షోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలను పరిచయం చేసిన "సూపర్ సింగర్" స్టార్ మాలో మళ్ళీ ప్రారంభం ప్రారంభమైంది. టాలెంట్ ఉంటే చాలు ఎవరైనా అనుకున్న స్థానానికి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదు.. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్‌లతో వడపోసిన స్వరాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా, కేరళ నుంచి కూడా వచ్చి ఈ పోటీలలో పాల్గొన్నారు. సంగీతం మీద ఆసక్తితో, తమను తాము నిరూపించుకోవాలన్న ఆకాంక్షతో సుమారు 20 మంది కంటెస్టెంట్స్ ఈ పోటీలో పాల్గొన్నారు. యాంకర్ శ్రీముఖి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా గాయని శ్వేతా మోహన్, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, గేయ రచయిత అనంత శ్రీరామ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్లో వెంకటేష్ అనే ఓ కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్ను మెప్పించాడు. కృష్ణార్జున యుద్దం సినిమాలోని 'దారి చూడు మామ దుమ్ము చూడు మామ' అనే పాటతో అక్కడ జడ్జీలను మెప్పించాడు. ఆ పాట పాడిన వెంకటేష్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే మ్యూజిక్ నేర్చుకుంటున్నట్లు స్టేజీ మీద తన కష్టాలను చెప్పుకున్నాడు. దీంతో రాహుల్ సిప్లిగంజ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఆ యువకుడి కష్టాన్ని మెచ్చుకున్నాడు. గతంలో తాను కూడా ఒక బార్బర్ షాప్‌లో పని చేస్తూనే పాటలు పాడటం నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నాడు.కష్టాలు ఉన్నప్పుడు కూడా వాటిని తట్టుకుని ఇలా ముందుకు రావడం అంత సులభం కాదని రాహుల్ చెప్పాడు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ సంగీతం కోసం కష్టపడుతున్న వెంకటేష్‌కు లక్ష రూపాయలు సాయం చేశాడు రాహుల్.వాస్తవంగా ఆ యువకుడిలో కూడ మంచి టాలెంట్ ఉంది.అతను పాడిన పాట కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. View this post on Instagram A post shared by STAR MAA (@starmaa) -
శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా 'రామ్' చిత్రం నుంచి పాట విడుదల
యదార్థ ఘటనల ఆధారంగా రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం రాబోతోంది. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందకు రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం సిద్దంగా ఉంది. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఓఎస్ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రాన్ని రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం కాబోతున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్గా రాహుల్ సిప్లిగంజ్ పాడిన దేశ భక్తి గీతం అందరిలోనూ ఉత్తేజాన్ని నింపింది. ఇక ఇప్పుడు కాస్త రొమాంటిక్ టచ్ ఉన్న పాటను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ పాటను రిలీజ్ చేస్తూ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. 'మనతోని కాదురా భై' అంటూ సాగే ఈ పాటకు.. రాము కుమార్ ఏఎస్కే సాహిత్యం, ధనుంజయ్ గాత్రం, ఆశ్రిత్ అయ్యంగార్ బాణీ ఇలా అన్నీ కలిసి వినసొంపుగా మార్చాయి. కమర్షియల్, యాక్షన్, పేట్రియాటిక్ జానర్లో రాబోతోన్న ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తుండగా.. ధారణ్ సుక్రి డిఎసి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు. -
సూపర్ సింగర్.. ఆరోజే ప్రారంభం!
మధురమైన గాత్రాలను వెలికి తీసుకువచ్చే ప్రయత్నమే సింగింగ్ షో. ఇలాంటి సింగింగ్ షోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలను పరిచయం చేసిన "సూపర్ సింగర్" ఇప్పుడు స్టార్ మాలో మరింత వినూత్నంగా మళ్ళీ ప్రారంభం కాబోతోంది. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్‌లతో సర్వం సిద్ధం చేసుకుంది. షో కోసం ఆడిషన్స్ నిర్వహించి.. వాటి నుంచి వడపోసిన స్వరాలు ప్రేక్షకులు ఆస్వాదించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా, కేరళ నుంచి వచ్చి పాటల మీద, సంగీతం మీద ఆసక్తితో, తమను తాము నిరూపించుకోవాలన్న ఆకాంక్షతో కంటెస్టెంట్స్ పాల్గొనేందుకు రావడం ఈ షో ప్రత్యేకత. ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా నలుగురు ప్రతిభావంతులు న్యాయమూర్తులుగా కంటెస్టెంట్స్‌ని తీర్చిదిద్దడంతో పాటు పోటీని మరింత రసవత్తరంగా నడిపించబోతున్నారు. ఇంతకీ ఆ నలుగురు మరెవరో కాదు.. గాయని శ్వేతా మోహన్, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, గేయ రచయిత అనంత శ్రీరామ్. వీరే ఈ సారి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. 20 మంది కంటెస్టెంట్లతో ప్రారంభం కాబోతున్న ఈ షోలో 16 మందితో అసలైన పోటీ మొదలవుతుంది. ఈ నెల 23 నుంచి.. ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు "సూపర్ సింగర్" సంగీతాభిమానుల్నే కాదు.. ప్రతి “స్టార్ మా” ప్రేక్షకుల్ని అలరించనుంది. షో నిర్వహణలో ఈ సారి స్టార్ మా ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. కంటెస్టెంట్స్, వాళ్ళని తీర్చిదిద్దే జడ్జెస్, మార్కులు.. ఇవి మాత్రమే కాకుండా షో ని ఇంకా ఆసక్తిగా మలచబోతున్న ఆ విషయం ఏంటో తెలుసుకోవాలంటే 'స్టార్ మా'లో సూపర్ సింగర్ చూడాల్సిందే. చదవండి: నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత!: రైతుబిడ్డ -
'మెమొరీస్' సాంగ్.. హీరో సుధాకర్.. మరి హీరోయిన్?
నారాయణ అండ్ కో చిత్రం తర్వాత ప్రముఖ నటుడు సుధాకర్ కోమాకుల 'మెమొరీస్' అనే బహుభాషా మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ పాటను సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మించారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్‌తో కలిపి చిత్రీకరించారు. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నివ్రితి వైబ్స్ వారు ఫ్యాన్సీ రేటుకు ఈ సాంగ్ రైట్స్ సొంతం చేసుకోవడం విశేషం. 'మెమొరీస్' వీడియో సాంగ్‌ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నివ్రితి వైబ్స్ యూట్యూబ్ వేదికపై హీరో అడివి శేష్ రిలీజ్ చేశారు. అన్వేష్ భాష్యం దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది. గతంలో అన్వేష్.. సైమా అవార్డ్స్‌లో నామినేట్ అయిన 'చోటు' అనే షార్ట్ ఫిలింకి కాన్సెప్ట్ రైటర్‌గా, సోని మ్యూజిక్‌లో విడుదలైన మరో షార్ట్ ఫిలిం 'మనోహరం'కి రైటర్‌గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ఇప్పుడు మెమొరీస్ సాంగ్ వరుణ్ అనే యువకుడి కథని తెలియజేసే విధంగా ఉంటుంది. మెమొరీస్ సాంగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అని తెలుసుకునే వాడిగా ఎలా మారాడనేదే ఈ సాంగ్. ఈ పాటని అరుణ్ చంద్రశేఖరన్ కంపోజ్ చేశారు. తెలుగులో ఈ పాటకి రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా.. కన్నడలో వాసుకి వైభవ్ పాడారు. ఈ వీడియో సాంగ్ దృశ్యం పరంగా ఆకట్టుకుంటూ సింపుల్ హుక్ స్టెప్ కూడా కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేయాలనిపించే విధంగా ఆ స్టెప్ ఉంటుంది. సుధాకర్ కోమాకుల నేతృత్వంలో నిర్మించబడిన ఈ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసేలా ఉంది. చదవండి: శివాజీ ప్రవర్తన వల్ల బాధపడ్డా.. ఆ నొప్పితో బాధపడుతున్న అమర్.. అందుకే టాస్క్‌లు.. -
రతికతో బ్రేకప్‌పై రాహుల్ సిప్లిగంజ్ ఫస్ట్ రియాక్షన్
రతిక రోజ్.. బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రారంభంలో అందరినీ ఆకట్టుకుంది. సూటిగా, ధైర్యంగా.. తెలంగాణ యాసలో మాట్లాడుతూ బిగ్‌బాస్ ప్రియులకు బాగా కనెక్ట్ అయింది. తర్వాత ప్రశాంత్‌తో పులిహోర కలపడం.. అందరిముందు మాత్రం మొత్తం నువ్వే చేశావ్ అంటూ అతడిని దోషిగా నిలబెట్టడం.. తనను చులకన చేసి మాట్లాడటం.. పదేపదే తన మాజీ ప్రియుడి ప్రస్తావన తేవడం.. ముందు ఒకలా, వెనక ఒకలా ప్రవర్తించడం.. ఇలా వరుస తప్పులు చేస్తూ పోవడంతో తన గ్రాఫ్ అమాంతం పాతాళంలోకి పడిపోయింది. ఫలితంగా షో నుంచి ఎలిమినేట్ అయింది. కానీ బిగ్‌బాస్ టీమ్ ఆమెకు రీఎంట్రీ ఛాన్స్ ఇచ్చింది. దాన్ని కూడా సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతోంది రతిక. రతిక గురించి తొలిసారి మీడియాతో.. ఇక ఆమె హౌస్‌లో ఉండగా రతిక తన మాజీ బాయ్‌ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్‌తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో లీకవగా పెద్ద దుమారమే చెలరేగింది. దీనిపై రాహుల్ సైతం పరోక్షంగా రతికను ఉద్దేశిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ప్రోగ్రామ్‌కు హాజరైన రాహుల్.. రతికతో బ్రేకప్‌పై తొలిసారి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'ప్రతి ఒక్కరికీ గతం, వర్తమానం అనేవి రెండూ ఉంటాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. రతికకు ఆల్‌ద బెస్ట్ చెప్పిన రాహుల్ ఆమెతో పాటు హౌస్‌లో ఉన్న ప్రతి కంటెస్టెంట్‌కు నేను ఆల్‌ద బెస్ట్ చెప్తున్నాను. బాగా ఆడి కప్పుతో బయటకు రావాలని కోరుకుంటున్నాను. విన్నర్ ఎవరనేది ఇప్పుడే మనం నిర్ణయించలేము. ప్రస్తుతానికైతే భోలె షావళి మంచి వినోదాన్ని అందిస్తున్నారు. శివాజీ ఇంట్లో పెద్ద వ్యక్తిలా ఉన్నారు. పల్లెటూరు నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్ ఒకప్పుడు బిగ్‌బాస్ షోను ప్రేక్షకుడిలా చూశాడు. ఇప్పుడు ప్రేక్షకులు ఆయనను బిగ్‌బాస్ హౌస్‌లో చూస్తున్నారు' అని మాట్లాడాడు రాహుల్ సిప్లిగంజ్. చదవండి: 10 ఏళ్లకే ఫుల్ క్రేజ్.. 17 ఏళ్లకే తల్లయిన స్టార్ హీరోయిన్.. అర్ధాంతరంగా ముగిసిన కెరీర్..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్‌కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement