-
#CSK: మా ఓటమికి కారణం అదే.. అతడు స్కోరు చేసి ఉంటే!
కెప్టెన్‌గా ఐపీఎల్-2024లో తొలి పరాజయాన్ని చవిచూశాడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్. ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ.. తదుపరి గుజరాత్ టైటాన్స్‌పై సీఎస్కే గెలుపొందిన విషయం తెలిసిందే.అయితే, ముచ్చటగా మూడో మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ కొడుతుందనుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైంది. విశాఖపట్నంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫలితంపై స్పందించిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. పవర్ ప్లేలో వైఫల్యమే తమ పరాజయానికి కారణమని పేర్కొన్నాడు.‘‘ఢిల్లీ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లేలో మా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చినా.. ఆ తర్వాత మెరుగ్గానే బౌలింగ్ చేశారు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన ప్రత్యర్థిని 191 రన్స్‌కు కట్టడి చేయగలిగారు.తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ బౌలర్లకు అంతగా అనుకూలించలేదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో సీమ్ కారణంగా బాల్ బౌన్స్ అయింది. నిజానికి ఈ మ్యాచ్‌లో రచిన్ భారీ ఇన్నింగ్స్ ఆడితే ఫలితం వేరేలా ఉండేది.తొలి మూడు ఓవర్లలో మేము అనుకున్నంతగా స్కోరు చేయలేకపోయాం. అప్పటి నుంచే మ్యాచ్ మా చేజారిపోయింది. ఒక్క ఓవర్లోనైనా భారీ స్కోరు చేసి ఉంటే రన్‌రేటు తగ్గి ఉండేది. అంతేకాదు.. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒకటీ.. రెండు బౌండరీలు ఆపినా బాగుండేది. అయినా.. ఇది మూడో మ్యాచ్ మాత్రమే. మేము తిరిగి పుంజుకుంటాం’’ అని రుతురాజ్ గైక్వాడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.కాగా ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది సీఎస్కే. ఈ క్రమంలో ఢిల్లీ 191 రన్స్ స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో 171 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(1), రచిన్ రవీంద్ర(2) పూర్తిగా నిరాశపరిచారు. -
మా ఓటమికి కారణం అదే.. అతడు స్కోరు చేసి ఉంటే: రుతు
కెప్టెన్‌గా ఐపీఎల్-2024లో తొలి పరాజయాన్ని చవిచూశాడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్. ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ.. తదుపరి గుజరాత్ టైటాన్స్‌పై సీఎస్కే గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ముచ్చటగా మూడో మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ కొడుతుందనుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైంది. విశాఖపట్నంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫలితంపై స్పందించిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. పవర్ ప్లేలో వైఫల్యమే తమ పరాజయానికి కారణమని పేర్కొన్నాడు. ‘‘ఢిల్లీ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లేలో మా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చినా.. ఆ తర్వాత మెరుగ్గానే బౌలింగ్ చేశారు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన ప్రత్యర్థిని 191 రన్స్‌కు కట్టడి చేయగలిగారు. తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ బౌలర్లకు అంతగా అనుకూలించలేదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో సీమ్ కారణంగా బాల్ బౌన్స్ అయింది. నిజానికి ఈ మ్యాచ్‌లో రచిన్ భారీ ఇన్నింగ్స్ ఆడితే ఫలితం వేరేలా ఉండేది. తొలి మూడు ఓవర్లలో మేము అనుకున్నంతగా స్కోరు చేయలేకపోయాం. అప్పటి నుంచే మ్యాచ్ మా చేజారిపోయింది. ఒక్క ఓవర్లోనైనా భారీ స్కోరు చేసి ఉంటే రన్‌రేటు తగ్గి ఉండేది. అంతేకాదు.. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒకటీ.. రెండు బౌండరీలు ఆపినా బాగుండేది. అయినా.. ఇది మూడో మ్యాచ్ మాత్రమే. మేము తిరిగి పుంజుకుంటాం’’ అని రుతురాజ్ గైక్వాడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది సీఎస్కే. ఈ క్రమంలో ఢిల్లీ 191 రన్స్ స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో 171 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(1), రచిన్ రవీంద్ర(2) పూర్తిగా నిరాశపరిచారు. Vintage Dhoni 👌#TATAIPL fans were treated to some strong hitting by MS Dhoni Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#DCvCSK | @ChennaiIPL pic.twitter.com/eF4JsOwmsa — IndianPremierLeague (@IPL) March 31, 2024 అజింక్య రహానే(45), డారిల్ మిచెల్(34).. ఆఖర్లో మహేంద్ర సింగ్ ధోని(37 నాటౌట్) మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయారు. ఈ మ్యాచ్‌లో అద్భుత స్పెల్(2/21) వేసిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: #Dhoni: స్ట్రైక్‌రేటు 231.25.. సీఎస్కే ఓడిందా?!.. అట్లుంటది మనతోని Season’s 1️⃣st Win 🙌@DelhiCapitals get off the mark in #TATAIPL 2024 with a collective team effort in Visakhapatnam 🙌 Scorecard ▶️ https://t.co/8ZttBSkfE8#DCvCSK pic.twitter.com/PB9tLAD13i — IndianPremierLeague (@IPL) March 31, 2024 These maximums 🤩 Some clean hitting tonight 👌 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvCSK | @ChennaiIPL pic.twitter.com/4ps9IcmCbl — IndianPremierLeague (@IPL) March 31, 2024 -
ధోని ముసలోడే కదా.. అందుకే అలా అన్నాను: సెహ్వాగ్
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఛలోక్తులు విసరడంలో దిట్ట అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిటైర్మెంట్ తర్వాత ఈ విధ్వంసకర ఓపెనర్ కామెంటేటర్, విశ్లేషకుడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్-2024 హర్యానా కామెంట్రీతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఉద్దేశించి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు సెహ్వాగ్. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే ఫీల్డింగ్‌ను ప్రశంసిస్తూ.. ‘‘క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు కదా. అజింక్య రహానే మంచి క్యాచ్ అందుకున్నాడు. రచిన్ రవీంద్ర కూడా అద్బుతంగా క్యాచ్ పట్టాడు. వయసు మీద పడ్డ ధోని కూడా ఓ క్యాచ్ అందుకున్నాడు’’ అని క్రిక్‌బజ్ షోలో వ్యాఖ్యానించాడు. ఇందుకు స్పందనగా అక్కడే ఉన్న మరో మాజీ క్రికెటర్ రోహన్ గావస్కర్.. ‘‘రహానే విషయంలో ఆ పదం(ముసలోడు అన్న అర్థంలో) ఎందుకు వాడలేదు’’ అని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘వాళ్లిద్దరి వయసు ఒకటి కాదు కదా! ధోని కంటే రహానే ఫిట్‌గా ఉన్నాడు. 35 ఏళ్ల వ్యక్తికి.. 41 ఏళ్లు పైబడిన వ్యక్తికి మధ్య కచ్చితంగా తేడా ఉంటుంది. ధోనికి వయసు మీద పడుతుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు కదా’’ అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. రహానే నూటికి నూరు శాతం ధోని కంటే ఎక్కువ ఫిట్‌గా ఉన్నాడు కాబట్టే అతడిని అలా అనలేదని పేర్కొన్నాడు. కాగా గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోని అద్బుత రీతిలో డైవ్ చేసి.. గుజరాత్ బ్యాటర్ విజయ్ శంకర్‌ను పెవిలియన్‌కు పంపాడు. 𝗩𝗶𝗻𝘁𝗮𝗴𝗲 𝗠𝗦𝗗 😎 An excellent diving grab behind the stumps and the home crowd erupts in joy💛 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #CSKvGT pic.twitter.com/n5AlXAw9Zg — IndianPremierLeague (@IPL) March 26, 2024 పాదరసంలా కదిలి శరీరాన్ని స్ట్రెచ్ చేసి బంతిని ఒడిసిపట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్(16 బంతుల్లో 21) ఇచ్చిన క్యాచ్‌ను అజింక్య రహానే, అజ్మతుల్లా ఇచ్చిన క్యాచ్‌ను రచిన్ రవీంద్ర సంచలన క్యాచ్‌లతో మెరిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. Give your hearts to Rahane! He’ll carry it safe! 🧲💛 pic.twitter.com/95k8QD94wz — Chennai Super Kings (@ChennaiIPL) March 26, 2024 ఈ విషయంపై స్పందిస్తూ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సైతం.. ధోని, రహానే, రచిన్లను కొనియాడాడు. ధోని, రహానేను చూస్తుంటే తమ జట్టులో అదనంగా ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్లు అనిపిస్తోందంటూ ప్రశంసలు కురిపించాడు. -
వాళ్లిద్దరూ అదరగొట్టారు.. ఫీల్డింగ్ కూడా అద్భుతం: రుతురాజ్
ఐపీఎల్-2024లో వరుసగా రెండో విజయం సాధించడం పట్ల చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టి కృషితో గుజరాత్ టైటాన్స్ వంటి పటిష్ట జట్టును ఓడించామని పేర్కొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ప్రతి ఒక్క సీఎస్కే ఆటగాడూ రాణించాడని ప్రశంసలు కురిపించాడు. కాగా క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీని ఓడించిన సీఎస్కే.. తాజాగా గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. సొంతమైదానం చెపాక్‌లో మంగళవారం నాటి మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో శుబ్‌మన్ గిల్ సేనపై జయభేరి మోగించింది. 2⃣ in 2⃣ for Chennai Super Kings 👏👏 That's some start to #TATAIPL 2024 for the men in yellow 💛 Scorecard ▶️ https://t.co/9KKISx5poZ#TATAIPL | #CSKvGT | @ChennaiIPL pic.twitter.com/njrS8SkqcM — IndianPremierLeague (@IPL) March 26, 2024 ఈ నేపథ్యంలో విజయానంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మ్యాచ్ పరిపూర్ణమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మా వాళ్లు అదరగొట్టారు. సాధారణంగా చెన్నైలో వికెట్ ఎలా ఉంటుందో కచ్చితంగా అంచనా వేయలేం. అందుకే తొలుత బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్ చేసినా రాణించడం మాత్రం ముఖ్యం. అయితే, వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడితే ఆఖర్లో మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఈరోజు రచిన్ పవర్ ప్లేలో అత్యద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ స్వరూపాన్ని మార్చి వేశాడు. అదే విధంగా.. దూబే.. అతడికి ఆత్మవిశ్వాసం మెండు. మేనేజ్మెంట్తో పాటు మహీ భాయ్ కూడా వ్యక్తిగతంగా అతడిని మెటివేట్ చేశాడు. జట్టులో తన పాత్ర ఏమిటో అతడికి బాగా తెలుసు. దూబే జట్టుతో ఉండటం మాకు అతిపెద్ద సానుకూలాంశం. ఇక ఈరోజు నేను మా వాళ్ల ఫీల్డింగ్‌కు కూడా ఫిదా అయ్యాను’’ అని పేర్కొన్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించడం వల్లే గెలుపు సాధ్యమైందని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ చేసింది. Jubilant Chepauk 🏟️ witnessed @ChennaiIPL's consecutive win as they beat @gujarat_titans by a resounding 63 runs 💪 Recap of the #CSKvGT clash 🎥 👇 #TATAIPL pic.twitter.com/reeLzs1IEh — IndianPremierLeague (@IPL) March 27, 2024 చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(36 బంతుల్లో 46), రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 46) రాణించగా.. నాలుగో స్థానంలో వచ్చిన శివం దూబే(23 బంతుల్లో 51) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరుపు అర్ధ శతకం సాధించాడు. డారిల్ మిచెల్(24- నాటౌట్) సైతం తన వంతు పరుగులు జతచేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి చెన్నై 206 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడ్డ గుజరాత్ 143 పరుగుల వద్దే నిలిచిపోవడంతో సీఎస్కే చేతిలో ఓటమి తప్పించుకోలేకపోయింది. చెన్నై బౌలర్లలో దీపక్ చహర్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తుషార్ దేశ్‌పాండే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. డారిల్ మిచెల్, మతీశ పతిరణ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: #WHAT A CATCH: వారెవ్వా ధోని.. 42 ఏళ్ల వయస్సులో కళ్లు చెదిరే క్యాచ్! వీడియో -
CSK Vs GT: చెన్నై ధనాధన్ గెలుపు
చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ ఆల్‌రౌండ్ షోకు నిరుటి రన్నరప్ గుజరాత్ టైటాన్స్ పోరాటం వదిలి చేతులెత్తేసింది. మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై 63 పరుగుల తేడాతో గుజరాత్‌పై ఘనవిజయం సాధించింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగుల భారీస్కోరు చేసింది. శివమ్ దూబే (23 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), రచిన్ రవీంద్ర (20 బంతుల్లో 46; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓడింది. సాయి సుదర్శన్ (31 బంతుల్లో 37; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పరుగుల తేడా పరంగా ఐపీఎల్లో గుజరాత్‌కిదే అతిపెద్ద ఓటమి. చెన్నై బౌలర్లు దీపక్ చహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తఫిజుర్ తలా 2 వికెట్లు తీశారు. ముందు రచిన్... తర్వాత దూబే... చెన్నై ఇన్నింగ్స్ తొలి 10 ఓవర్లు, తర్వాత 10 ఓవర్లు అన్నట్లుగా రెండు దశలూ ధనాధన్‌గా సాగింది. తొలి దశను ఓపెనర్ రచిన్ దూకుడుగా మొదలుపెట్టాడు. అతను క్రీజులో ఉన్నది కాసేపే అయినా... భారీ షాట్లతో విరుచుకుపడటంతో మెరుపు వేగంతో చెన్నై స్కోరు దూసుకెళ్లింది. ఆరో ఓవర్ రెండో బంతికి రషీద్ అతని జోరుకు కళ్లెం వేశాడు. ఓపెనింగ్ జోడీ 32 బంతుల్లో 62 పరుగులు జతచేయగా, ఇందులో 46 పరుగులు ఒక్క రచిన్వే కావడం విశేషం. తర్వాత రహానే (12), కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (36 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) చెన్నైను నడిపించారు. 10 ఓవర్లలో చెన్నై 104/1 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్ తొలి బంతికే రహానే అవుట్‌కాగా... శివమ్ దూబే రావడంతో రెండో దూకుడు కొత్తగా మొదలైంది. స్పిన్, పేస్ ఏ బౌలర్‌కు తలొగ్గకుండా దూబే బ్యాట్ దంచేసింది. మిచెల్ (20 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు) అండతో శివమెత్తడంతో... ఈ జోడీ కూడా 35 బంతుల్లో 57 పరుగులు జోడించింది. 22 బంతుల్లో దూబే అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే నిష్క్రమించాడు. సమీర్ రిజ్వీ (6 బంతుల్లో 14; 2 సిక్స్‌లు) మెరుపులతో చెన్నై స్కోరు 200 పైచిలుకు చేరింది. టైటాన్స్ వల్ల కాలేదు! కొండంత లక్ష్యం చూసే గుజరాత్ భీతిల్లినట్లుంది. ఓపెనర్లు మొదలు ఆఖరి వరుసదాకా అందరి బ్యాటర్లదీ అదే తీరు! ఛేదించాల్సిన లక్ష్యం కోసం ఆడాల్సిన తీరు ఏ ఒక్కరిలోనూ కనిపించలేదు. పవర్‌ప్లేలోనే కెపె్టన్ శుబ్‌మన్ గిల్ (8), సాహా (17 బంతుల్లో 21; 4 ఫోర్లు) పెవిలియన్‌కు వెళ్లిపోయారు. వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. కానీ మెరిపించలేదు... కాసేపైనా మురిపించ లేదు. హిట్టర్లు విజయ్ శంకర్ (12), మిల్లర్ (16 బంతుల్లో 21; 3 ఫోర్లు), రాహుల్ తెవాటియా (6) అంతా చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్‌కు వికెట్లు అప్పగించేశారు. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) సాహా (బి) జాన్సన్ 46; రచిన్ (స్టంప్డ్) సాహా (బి) రషీద్ ఖాన్ 46; రహానే (స్టంప్డ్) సాహా (బి) సాయికిషోర్ 12; దూబే (సి) శంకర్ (బి) రషీద్ ఖాన్ 51; మిచెల్ (నాటౌట్) 24; సమీర్ రిజ్వీ (సి) మిల్లర్ (బి) మోహిత్ 14; జడేజా (రనౌట్) 7; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–62, 2–104, 3–127, 4–184, 5–199, 6–206. బౌలింగ్: అజ్మతుల్లా 3–0–30–0, ఉమేశ్ 2–0–27–0, రషీద్ ఖాన్ 4–0–49–2, సాయికిషోర్ 3–0–28–1, జాన్సన్ 4–0–35–1, మోహిత్ శర్మ 4–0–36–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) తుషార్ (బి) దీపక్ 21; గిల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీపక్ 8; సాయి సుదర్శన్ (సి) సమీర్ (బి) పతిరణ 37; విజయ్ శంకర్ (సి) ధోని (బి) మిచెల్ 12; మిల్లర్ (సి) రహానే (బి) తుషార్ 21; అజ్మతుల్లా (సి) రచిన్ (బి) తుషార్ 11; తెవాటియా (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 6; రషీద్ ఖాన్ (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 1; ఉమేశ్ (నాటౌట్) 10; జాన్సన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–28, 2–34, 3–55, 4–96, 5–114, 6–118, 7–121, 8–129. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–28–2, ముస్తఫిజుర్ 4–0–30–2, తుషార్ దేశ్‌పాండే 4–0–21–2, జడేజా 2–0–15–0, మిచెల్ 2–0–18–1, పతిరణ 4–0–29–1. ఐపీఎల్లో నేడు హైదరాబాద్ X ముంబై వేదిక: హైదరాబాద్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement