-
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేసిన జేడీఎస్
బెంగళూరు: కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. లైంగిక ఆరోపణల నేపథ్యంలోనే పార్టీ ఈ చర్యలు తీసుకుంది. ఇటీవల ఆయనపై లైంగిక ఆరోపణలు రాగా, కన్నడనాట రాజకీయంగా పెను దుమారం రేగింది. మరోవైపు ఈ వ్యవహారంలో ఆయనపై కేసు కూడా నమోదైంది. మంగళవారం జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో జేడీఎస్.. ఎంపీ ప్రజ్వల్‌పై సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజ్వల్ సస్పెన్షన్ ముందు ఆయన బాబాయ్, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ వివాదం వెనక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హస్తం ఉందని ఆరోపణలు చేశారు. వెంటనే డిప్యూటీ సీఎం పదవి నుంచి డీకే శివకుమర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. అసభ్యకరమైన వీడియోల్లో ప్రజ్వల్ ముఖం కనిపిస్తోందా? అందులో ఉన్నది అతడేననే ఆధారం ఏంటి?. అయినా సరే తాము నైతికత ఆధారంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇక.. ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారంలో దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ప్రజ్వల్ భారత్ వదిలి జర్మనీ వెళ్లారు. దీంతో ఈ కేసుపై సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది.లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయంగా ఈ వ్యవహారం దుమారం రేగటంతో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై కోర్ కమిటీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని సోమవారం జేడీఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
17 ఎంపీ సీట్లకు 893 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అ సెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో నామినేషన్ల దాఖలుకు గడువు గురువారంతో ముగిసింది. ఈ నెల నుంచి 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, చివరి రోజు గురువారం నాటికి 17 లోక్‌సభ స్థానాల పరిధిలో మొత్తం 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 24 మంది అభ్యర్థులు మొత్తం 50 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. శుక్రవా రం నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు 29తో ముగియనుంది. మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణతో సహా దేశంలోని 543 లోక్‌సభ స్థానాల్లో పోలైన ఓట్లను జూన్ 4న లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అత్యధికంగా మల్కాజ్‌గిరిలో.. అత్యధికంగా మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలో 114 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఆ తర్వాత చేవెళ్లలో 66 మంది, పెద్దపల్లిలో 63 మంది, భువనగిరిలో 61 మంది, సికింద్రాబాద్, హైదరాబాద్‌లలో చెరో 57 మంది, నల్లగొండలో 56 మంది, మెదక్‌లో 54 మంది, కరీంనగర్లో 53 మంది, వరంగల్‌లో 58 మంది, ఖమ్మంలో 45 మంది, మహబూబ్ నగర్లో 42 మంది, నిజామాబాద్‌లో 42 మంది జహీరాబాద్‌లో 40 మంది నాగర్ కర్నూల్లో 34 మంది, మహబూబాబాద్‌లో 30 మంది, ఆదిలాబాద్‌లో 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
బీజేపీ ఎంపీ మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ బీజేపీ ఎంపీ రాజ్వీర్ డైలర్ బుధవారం(ఏప్రిల్24)గుండె పోటుతో మరణించారు. డైలర్కు ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇవ్వలేదు.2017లో ఎమ్మెల్యేగా గెలిచిన డైలర్ తర్వాత 2019లో ఎంపీగా గెలిచి పార్లమెంట్‌కు వెళ్లారు. డైలర్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. -
స్వామీ బ్రహ్మానంద్ ఎవరు? ఎంపీ స్థాయికి ఎలా చేరారు?
దేశంలో 18వ లోక్‌సభకు ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు (80) కలిగిన ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశ రాజకీయాల్లో సాధువుల ప్రవేశం 90వ దశకంలో రామమందిర ఉద్యమం నుంచి ప్రారంభమైంది. ఇది నేటికీ కొనసాగుతోంది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైన స్వామి బ్రహ్మానంద్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్వామి బ్రహ్మానంద్ గోసంరక్షణ కోసం పాటుపడ్డారు. పార్లమెంటులో కూడా ఈ అంశంపై చర్చించారు. స్వాతంత్య్రానంతరం 1951-52లో తొలి సాధారణ ఎన్నికలు జరిగాయి. గోరఖ్‌నాథ్ పీఠానికి చెందిన మహంత్ దిగ్విజయ్నాథ్ 1952,1957 ఎన్నికలలో హిందూ మహాసభ నుండి పోటీ చేసినప్పటికీ, కాంగ్రెస్ ముందు సత్తా చాటలేకపోయారు. 1966లో స్వామి బ్రహ్మానంద్ స్వామి కర్పాత్రి మహారాజ్‌తో కలిసి లక్షలాది సాధువులతో కలసి గోహత్యను నిషేధించాలనే ఉద్యమాన్ని చేపట్టారు. దీనిపై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ ఉద్యమ నేపధ్యంలో అప్పటి ప్రభుత్వం స్వామి బ్రహ్మానంద్‌ను అరెస్టు చేసి, జైలుకు తరలించింది. జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాల్లోకి రావాలని ఆయనను పలువురు కోరారు. దీంతో ఆయన జన్ సంఘ్‌లో చేరడం ద్వారా రాజకీయాల్లోకి కాలుమోపారు. 1967లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ లోక్‌సభ స్థానం నుండి స్వామి బ్రహ్మానంద్ పోటీ చేసి విజయం సాధించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక సాధు సన్యాసి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికవడం అదే తొలిసారి. తరువాతి కాలంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ 1967లో బ్యాంకుల జాతీయకరణ అంశాన్ని లేవనెత్తినప్పుడు, స్వామి బ్రహ్మానంద్ అందుకు మద్దతుగా నిలిచారు. దీంతో జన్సంఫ్కు, స్వామి స్వామి బ్రహ్మానంద్కు మధ్య దూరం పెరిగింది. 1971 లోక్‌సభ ఎన్నికల్లో హమీర్పూర్ నుండి స్వామి బ్రహ్మానంద్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఈ విధంగా ఆయన రెండోసారి ఎంపీ అయ్యారు. -
BRS: వరంగల్ ఎంపీ అభ్యర్థి.. ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్
సాక్షి,హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా హన్మకొండ జెడ్పీ చైర్మన్ మారేపల్లి సుధీర్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ శుక్రవారం( ఏప్రిల్ 12)అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. వరంగల్ అభ్యర్థిని నిర్ణయించేందుకు జిల్లా నేతలతో కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీకి ఇటీవలే పార్టీని వీడిన స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కూడా పిలుపు అందడంతో వరంగల్ నుంచి ఆయన పోటీ చేస్తారన్న ప్రచారం ఒక దశలో ఊపందుకుంది. చివరకు సుధీర్‌కుమార్‌ను బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ నుంచి ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియ్యం కావ్య కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో బీఆర్ఎస్ తాజాగా మళ్లీ అభ్యర్థిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్కు ప్రత్యర్థులుగా ఉన్న రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులిద్దరూ బీఆర్ఎస్ను ఇటీవల వీడి టికెట్ తీసుకున్న వారే కావడం గమనార్హం. దీంతో బీఆర్ఎస్కు తమ పార్టీ నుంచి వెళ్లిన వారిపైనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బీజేపీ నుంచి వర్థన్నపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కాంగ్రెస్ నుంచి స్టేషన్ ఘన్పూర్ కడియం కావ్య బరిలో ఉన్నారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్లో డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. కడియం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
Advertisement