-
లండన్ మేయర్‌గా మూడోసారి సాదిక్ ఖాన్
లండన్: పాక్ సంతతికి చెందిన లేబర్ పార్టీ నేత సాదిక్ ఖాన్(53) లండన్ మేయర్‌గా భారీ మెజారిటీతో వరుసగా మూడోసారి గెలుపొందారు. మొత్తం ఓట్లలో 43.8 శాతం అంటే 10,88,225 ఓట్లు సాదిక్ ఖాన్‌కు పడగా కన్జర్వేటివ్ పారీ్టకి చెందిన ప్రధాన ప్రత్యర్ధి సుసాన్ హిల్‌కు 8,11,518 ఓట్లు పడ్డాయి. స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగిన ఢిల్లీలో జన్మించిన వ్యాపారవేత్త తరుణ్ గులాటి ఓట్ల వేటలో విఫలమయ్యారు. మేయర్ పదవికి మొత్తం 13 మంది పోటీ పడ్డారు. లండన్ మేయర్ 89 లక్షల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తారు. 2000వ సంవత్సరంలో పదవి ఏర్పాటయ్యాక వరుసగా మూడు పర్యాయాలు మేయర్‌గా ఎన్నికైన నేతగా సాదిక్ ఖాన్ రికార్డు సృష్టించారు. నాలుగేళ్ల పదవీ కాలానికిగాను 2016, 2020 ఎన్నికల్లో ఆయన మేయర్‌గా ఎన్నికయ్యారు. -
రాఘవ్ చద్దా కంటి అపరేషన్: విట్రెక్టమీ అంటే ఏమిటి? అంత ప్రమాదమా?
పంజాబ్‌కు చెందిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అత్యవసర కంటి శస్త్రచికిత్సకోసం లండన్‌లో ఉన్నారు. రెటీనాకు రంధ్రం కారణంగా విట్రెక్టమీ సర్జరీకోసం లండన్‌కు వెళ్లినట్టు ఢిల్లీ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. అసలు విట్రెక్టమీ అంటే ఏమిటి? కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందా? ఆ వివరాలు ఒకసారి చూద్దాం.రాఘవ్ చద్దాం రెటీనాలో రంధ్ర కారణంగా కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అందుకే అత్యవసరంగా ఆయనకు ఆపరేషన్ చేశారు. ఇది ప్రమాదకరమే అయినప్పటికీ, శస్త్రచికిత్స బాగానే జరిగిందని ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలుస్తోంది. బయటికి వెళ్లకుండా, ఎండతగలకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్యులుఘసూచించారనీ, పరీక్షలు, చెకప్ కోసం వారానికి రెండుసార్లు వైద్యుడిని సందర్శించాల్సిఉంటుందనీ ఈ నేపథ్యంలో డాక్టర్లు అనుమతి ఇచ్చినప్పుడే అతను ఇండియా వచ్చే అవకాశం ఉందని బంధువుల సమాచారం.విట్రెక్టమీ అంటే ఏమిటి?జాన్ హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం, కంటి లోపల రెటీనా వెనుక ఏర్పడిన జెల్ లాంటి పదార్థాన్ని (విట్రస్ జెల్)ని బయటకు తీసివేసేందుకు నిర్వహించే సర్జరీనే విట్రెక్టమీ అంటారు. రెటీనా వెనుక పేరుకున్న పదార్థాన్ని తొలగించి, సెలైన్ ద్రావణంతోగానీ, గ్యాస్ బబుల్‌తో గానీ ఆ ప్రదేశాన్ని భర్తీ చేస్తారు.మధుమేహం కారణంగావచ్చే డయాబెటిక్ రెటినోపతి, రెటీనా డిటాచ్మెంట్, విట్రస్ హెమరేజ్ లేదా తీవ్రమైన కంటి గాయాలు, కంటి ఇన్ఫెక్షన్లు, కంటిశుక్లం శస్త్రచికిత్స తర్వాత సమస్యలు, ఇతర కంటి సమస్యల కారణంగా విట్రెక్టమీ అవసరం కావచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేసినా, చికిత్స చేయకుండా వదిలివేసినా, అంధత్వానికి దారితీయవచ్చు.కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా కాంతిని సంగ్రహించి, మెదడుకు దృశ్య సంకేతాలను ప్రసారం చేస్తుంది. క్లియర్ విట్రస్ జెల్ కాంతిని రెటీనాకు చేరవేస్తుంది. తద్వారా మనకు దృశ్యాలు కనిపిస్తాయి. అయితే అక్కడ రక్తం గడ్డకట్టడం, గడ్డలు లాంటివి ఈ కాంతిని అడ్డు పడతాయి. ఫలితంగా దృష్టి లోపం ఏర్పడుతుంది. రెటీనాకు ప్రాప్యతను మెరుగుపరచడానికి దానిపై ఒత్తిడిని తగ్గించడానికి విట్రెక్టోమీ చేస్తారు.తద్వారా కంటిచూపు మెరుగవుతుంది. కొన్నిసందర్భాల్లో, కోల్పోయిన దృష్టిని పునరుద్ధరించడంలో సహాయ పడుతుంది.విట్రెక్టమీ: ప్రమాదమా?విట్రెక్టమీ అనేది డయాబెటిక్ ఐ డిసీజ్ (డయాబెటిక్ రెటినోపతి), రెటీనా డిటాచ్మెంట్లు, మాక్యులర్ హోల్స్, మాక్యులర్ పుకర్, విట్రస్ హెమరేజ్‌తో సహా కొన్ని వ్యాధి పరిస్థితులలో కంటి కేంద్ర కుహరం నుండి విట్రస్ను తొలగించే శస్త్రచికిత్సా ప్రక్రియ. ప్రత్యేకంగా రూపొందించిన సాధనాలు, సాంకేతికతలను ఉపయోగించి రెటీనా సర్జన్ చేస్తారు. లోకల్ అనస్థీషియాలో నిర్వహించే డే కేర్ ప్రక్రియ. సాధారణంగా, విట్రెక్టోమీకి సుమారు రెండు గంటలు పడుతుంది, కొన్నిసార్లు,క్లిష్టమైన కేసులకు ఎక్కువ సమయం పడుతుంది. విట్రెక్టమీని ప్రస్తుతం ఆధునిక పద్దతుల్లో 23 గేజ్ ట్రోకార్- కాన్యులా సిస్టమ్ (మైక్రోఇన్సిషన్ సర్జరీ) ద్వారా కుట్లు లేకుండా, వేగంగా చేస్తున్నారు.విట్రెక్టోమీ సాధారణంగా సురక్షితమైనది.కంటిచూపును కాపాడటం కోసం చేసే సర్జరీ. కానీ ఇతర ఆపరేషన్ల మాదిరిగానే రోగి వయస్సు, ఆరోగ్యం , కంటి సమస్య తీవ్రతను బట్టి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ఇన్ఫెక్షన్ రావచ్చుఅధిక రక్తస్రావం అయ్యే ప్రమాదంకంటి లోపల ఒత్తిడి పెరగుతుంది.శస్త్రచికిత్స కారణంగా కొత్త రెటీనా డిటాచ్మెంట్ సమస్యకంటి లెన్స్ దెబ్బతినడంకంటిశుక్లం ఏర్పడే అవకాశంశస్త్రచికిత్స అనంతర కంటి కదలికలో ఇబ్బందులువక్రీభవన లోపంలో మార్పులు (అద్దాలు, లెన్స్ అవసరం)ఈ శస్త్రచికిత్స అసలు సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోవచ్చు కూడా. దీనికి మరో శస్త్రచికిత్స అవసరం కావచ్చు. కాగా హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ చద్దా గత ఏడాది సెప్టెంబర్‌లో ఉదయపూర్‌లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పరిణీతి తన లేటెస్ట్ మూవీ అమర్ సింగ్ చమ్కిలా ప్రమోషన్లో బిజీగా ఉంది. -
లండన్‌లో బీజేపీ మద్దతుదారుల పాదయాత్ర
ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీకి అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా బ్రిటన్‌లోని ప్రవాస భారతీయులు, బీజేపీ మద్దతుదారులు లండన్‌లో రన్ ఫర్ మోదీ ఈవెంట్‌ను నిర్వహించారు. దీనిలో పెద్ద సంఖ్యలో ఎన్నారైలు పాల్గొని బీజేపీపై, ప్రధాని మోదీపై తమకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు.2019 ఎన్నికల సమయంలోనూ రన్ ఫర్ మోదీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ యూకే ఓవర్సీస్ ఫ్రెండ్స్ ప్రధాన కార్యదర్శి సురేష్ మంగళగిరి తెలిపారు. నాడు కూడా ప్రజలు బీజేపీపై తమ అభిమానాన్ని ఇదే రీతిలో వ్యక్తం చేశారన్నారు. బీజేపీపై, ప్రధాని మోదీపై ఎన్నారైలకు అమితమైన ప్రేమ ఉన్నదన్నారు.అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 తొలగింపు తదితర మంచి పనులను బీజేపీ చేపట్టిందని సురేష్ పేర్కొన్నారు. లండన్‌లో నిర్వహించిన రన్ ఫర్ మోదీ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ మద్దతుదారులు ఆ పార్టీ జెండాలను చేత పట్టుకుని ‘భారత్ మాతా కీ జై’ ‘వందేమాతరం’ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో 400కు పైగా ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. -
చోరీ డెబిట్ కార్డుతో లాటరీ.. రూ. 41 కోట్లు గెలిచి..
యూకేలో ఓ వింత ఉదంతం వెలుగు చూసింది. ఈ దేశానికి చెందిన ఇద్దరు దొంగలు లాటరీలో నాలుగు మిలియన్ పౌండ్లు గెలుచుకున్నాడు. భారత కరెన్సీతో పోల్చిచూస్తే ఈ మొత్తం రూ.41 కోట్ల 66 లక్షలు. ఇంత భారీ ప్రైజ్ మనీ గెలుచుకున్నాక కూడా వారు చిక్కుల్లో పడ్డాడు. బోల్టన్‌కు చెందిన జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్‌రామ్‌లు తాము చోరీ చేసిన డెబిట్ కార్డుతో లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశారు. ఆ లాటరీ ఫలితాలు రాగానే వారు ఆనందంతో గెంతేశారు. తాము నాలుగు మిలియన్ పౌండ్లు అందుకోబోతున్నామంటూ ఉబ్బితబ్బిబయ్యారు. అయితే వారి ఆనందం కొద్దిసేపటికే ఆవిరయ్యింది. లాటరీలో వచ్చిన మొత్తాన్ని అందుకునేందుకు వారు లాటరీ నిర్వాహకులను సంప్రదించారు. వారు బ్యాంకు ఖాతా గురించి అడగగా, గుడ్‌రామ్ తనకు బ్యాంకు ఖాతా లేదని తెలిపాడు. దీంతోవారు అనుమానంతో అతనిని పలు విధాలుగా విచారించారు. ఈ నేపధ్యంలో గుడ్‌రామ్ ఆ కార్డు తన స్నేహితుడు జాన్‌దని తెలిపాడు. దీంతో వారు జాన్‌ను కూడా విచారించారు. అది అతనిది కూడా కాదని తేలింది. లాటరీ నిర్వాహకుల విచారణలో ఆ డెబిట్ కార్డు జోషువా అనే వ్యక్తికి చెందినదని తేలింది. దీంతో జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్‌రామ్‌లు ఆ కార్డును దొంగిలించారని వారు గుర్తించారు. విషయం పోలీసుల వరకూ చేరింది. కోర్టు విచారణలో జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్‌రామ్‌లకు 18 నెలల చొప్పున జైలు శిక్ష పడింది. డెబిట్ కార్డు యజమాని జోషువా ఆ లాటరీ మొత్తాన్ని అందుకునేందుకు అర్హుడయ్యాడు. ఈ విషయం తెలిసినవారంతా అదృష్టమంటే ఇదేనేమో అని అంటున్నారు. -
ఫుడ్ ఫోటోగ్రాఫర్ అవార్డుల పోటీ : ఈ అద్భుతమైన ఫోటోలు చూశారా?
ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాల్లో ఫొటోగ్రఫీ పోటీలు జరుగుతుంటాయి. అలాగే ఫుడ్‌కు సంబంధించి కూడా పోటీ ఉంది. ఫుడ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2024 పోటీలో ఫుడ్ ఫోటోగ్రఫీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఔత్సాహిక , ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లకు బహుమతులను ప్రదానం చేస్తుంది. ఫుడ్ ఫర్ సేల్, ఫుడ్ ఫర్ ఫ్యామిలీ,ఫుడ్ ఇన్ యాక్షన్ ఇలా పలు కేటగిరీల్లో బహుతులను అందిస్తుంది. పింక్ లేడీ మూమెంట్స్‌తో పాటు మహిళా ఫోటోగ్రాఫర్లకు ప్రత్యేక అవార్డులు కూడా ఉన్నాయి. ఇథియోపియాలోని ఒక గ్రామంలో కరో తెగకు మహిళలు స్టోన్ గ్రైండర్లతో బియ్యం ముద్ద తయారు చేస్తున్న చిత్రం. తీసింది ఇండియాకు చెందిన సంఘ మిత్ర సర్కార్. ఇది షార్ట్ లిస్ట్ అయింది. ఫుడ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పేరుతో ఉత్తమ అవార్డును ఇస్తుంది. ఈ క్రమంలో వెజిటబుల్ మ్యాన్ చిత్రాన్ని బ్రిటన్‌కు చెందిన కేరొలీన్ తీసిన ఫోటో విశేషంగా నిలుస్తోంది. ఈ చిత్రం ఫుడ్ ఫొటోగ్రఫీ పోటీలో ఫైనలిస్టుల్లో ఒకటిగా నిలిచింది. వెజిటబుల్ మ్యాన్ 13వ ఎడిషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా 65 కంటే ఎక్కువ దేశాల నుండి వేలాది ఫోటోలు పోటీ పడుతున్నాయి. ఫైనలిస్టుల ఫోటోలను లండన్‌లోని ది మాల్ గ్యాలరీస్‌లో ప్రదర్శిస్తారు. జూన్ 4న లండన్‌లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో విజేతలను ప్రకటిస్తారు. విజేత 5వేల యూరోలను బహుమతి గెల్చుకోవచ్చు. ఫుడ్ ఫర్ సేల్ కేటగిరీ టిప్ ట్రీ కేక్, వైన్ ఫోటోగ్రఫీ 👉 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement