-
నేను గట్టిగా ప్రయత్నించి ఉంటే IPS అయ్యేదాన్ని: స్టార్ హీరోయిన్ (ఫొటోలు)
-
'యూ, యూ, యూ, లైక్ ఇట్స్'.. ఈ మాగ్నటిక్ సాంగ్‌ను విన్నారా!?
కొరియన్–పాప్ సెన్సేషన్ ‘ఇలిట్’ మ్యూజిక్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. డెబ్యూ–సింగిల్ ‘మాగ్నెటిక్’ బిల్బోర్డ్ చార్ట్ ‘హాట్ 100’లో చోటు సాధించడం ద్వారా ‘ఇలిట్’ గ్లోబల్ స్టేజీపై గ్రౌండ్ బ్రేకింగ్ విజయాన్ని సొంతం చేసుకుంది. యునహ్, మింజుచ, మోకా, వోన్హీ, ఇరోహ అనే అయిదుగురు అమ్మాయిల బృందంతో ‘ఇలిట్’ మ్యూజిక్ బ్యాండ్ గత నెల ప్రారంభమైంది. తొలి అడుగుల్లోనే స్పాటిఫై ‘డైలీ టాప్ సాంగ్ గ్లోబల్’ చార్ట్‌లో చోటు సంపాదించింది. యూకే ‘అఫిషియల్ సింగిల్స్ టాప్ 100’లో మెరిసింది. ‘మాగ్నెటిక్’ సాంగ్‌ను ‘ఇలిట్’ సభ్యుల ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందించారు. ఈ గ్రూప్ డెబ్యూ ఆల్బమ్... సూపర్ రియల్ మీ. ‘మై వరల్డ్’, ‘మాగ్నటిక్’, ‘మిడ్నైట్ ఫిక్షన్’, ‘లక్కీ గర్ల్ సిండ్రోమ్’ అనే నాలుగు ట్రాక్‌లు ఈ ఆల్బమ్‌లో ఉంటాయి. తొలి వారంలోనే ‘సూపర్ రియల్ మీ’ అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది. ‘యూ, యూ, యూ, లైక్ ఇట్స్ మాగ్నటిక్/ యూ, యూ, యూ, సూపర్’ అంటూ ‘మాగ్నటిక్’ను పాడాలనుకుంటే ఇప్పుడే వినండి మరి! ఇవి చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..! -
ఇలాంటి తల్లులు కూడా ఉంటారా?..మాటలు కూడా రాని ఆ చిన్నారిని..
కొన్ని ఘటనలు చూస్తే ఇలాంటి తల్లులు కూడా ఉంటారా? అన్నంత బాధగా ఉంటుంది. అలాంటి వాళ్లను చూస్తే..అస్సలు తల్లి అన్న పదానికి ఉన్న గొప్ప అర్థం కూడా విలువలేనిదిగా అయిపోతుంది. తల్లి మనసు బహు సున్నితంగా ఉంటుంది. తన బిడ్డకు ఏమైనా అయితే అంత ఎత్తున కోపంతో లేగిసిపోతుంది. అలాంటిది ఈ తల్లి చేసిన ఘోరం వింటే మనసు చివుక్కుమంటుంది. అస్సలు ఈమె తల్లేనా..ఇలాంటి ఆమెకు దేవుడు పిల్లల్ని ఎందుకిచ్చాడు అన్నంత బాధకలుగుతుంది. వివరాల్లోకెళ్తే..అమెరికాలోని ల్యాండ్ ప్రాంతానికి చెందిన క్రిస్టల్ కాంటే లారియో (32).. సంపన్న కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు ఆగర్భ శ్రీమంతులు. క్రిస్టల్ కు 16 నెలల జైలిన్ అనే పాప ఉంది. డబ్బు బాగా ఉండటంతో క్రిస్టల్ విలాసావంత జీవితానికి అలవాటు పడింది. అయితే ఆమెకు భర్త ఉన్నాడో లేక ఆమె విలాసాలను చూసి తట్టుకోలేక వదిలేశాడో తెలియదు గాని..క్రిస్టల్ మాత్రం తన కూతురితో క్లీవ్ ల్యాండ్ ప్రాంతంలో ఉంటుంది. గత ఏడాది జూన్ నెలలలో తన 16 నెలల కూతుర్ని ఉయ్యాలలో పడుకోబెట్టి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. ఈ తర్వాత మరో నగరానికి చక్కర్లు కొట్టింది. అయ్యే ఇంట్లో పాపం ఏమవుతుందన్న బాధ ఇసుమంత కూడా లేకుండా నిసిగ్గుగా ఎంజాయ్ చేసింది. ఇలా దాదాపు పదిరోజులు ఇంటి పట్టున లేకుండా పోయింది. ఆ తర్వాత తీరిగ్గా ఇంటికి వచ్చి చూడగా.. పాప ఉయ్యాలలో నిర్జీవంగా కనిపించింది. వెంటనే క్రిస్టల్ ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పింది. దీంతో వారు ఆమెను అదుపులోకి తీసుకుని,విచారణ నిమిత్త కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టులో క్రిస్టల్ చేసిన ఘనకార్యాన్ని విని నిర్ఘాంతపోయారు. ఈ కేసును సుమారు 9 నెలలపాటు క్షుణ్ణంగా విచారించారు. అనంతరం కనివిని ఎరుగని స్థాయిలో తీర్పు ఇచ్చారు. "ఇది మానవజాతి తలదించుకునే సంఘటన. ఒక తల్లి తన బిడ్డను ఇలా వదిలేసి వెళ్లడం బహుశా చరిత్రలోనే తొలిసారి కావొచ్చు. ఇలాంటి తప్పు భవిష్యత్తులో మరే ఏ తల్లి చేయకుండా ఉండేలా కఠిన తీర్పు ఇస్తున్నాను. ఈమెకు బెయిల్ అనేది లేకుండా యావ జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తున్నానని" జడ్జి తీర్పు చెప్పారు. దీంతో ఆమె తరపు న్యాయవాదులు.. సరికొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. క్రిస్టల్ మానసిక పరిస్థితి బాగోలేదని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వ వైద్యులు ఆమెను పరీక్షించి అలాంటి మానసిక వ్యాధులు ఆమెకు లేవని తేల్చారు. దీంతో జడ్జి ఇచ్చిన తీర్పు ప్రకారం ఆమె జైలు శిక్ష అనుభవిస్తోంది. ఇక క్రిస్టల్ వ్యవహారం విని అమెరికా మాత్రమే కాదు యావత్ ప్రపంచం దిగ్బాంతికి గురయ్యింది. ఇలాంటి పాషణ హృదయంతో ఉండే తల్లులు కూడా ఉన్నారా..? అని విస్తుపోయింది . (చదవండి: డైట్లో ఈ వంటకాన్ని చేరిస్తే..మెరిసే గ్లాస్ స్కిన్ మీ సొంతం!) -
జీవితాన్ని మార్చేసే కొన్ని మానసిక వాస్తవాలు..!
మనసు ఒక మిస్టరీ. దాని గురించి తెలిసింది గోరంతైతే, తెలియంది కొండంత. తెలుసుకోవాలనే ప్రయత్నం చేసేవారు రవ్వంత. అందువల్లనే కొందరు ఆందోళనతో తల్లడిల్లి పోతుంటే, మరికొందరు మనోవేదనతో పోరాడుతుంటారు. కొందరు ఉన్నదాంట్లో సంతోషంగా జీవిస్తుంటే, మరికొందరు లేనిదానికోసం ఆరాటపడుతూ నిత్యం బాధపడుతుంటారు. ఒకే రకమైన పరిస్థితులున్నా కొందరు అవకాశాలను అందిపుచ్చుకుని విజయం సాధిస్తే, మరికొందరు అవకాశాలు లేవంటూ తిట్టుకుంటూ పరాజితులుగా మిగిలిపోతారు. అన్నీ మనసు చేసే మాయే. అందుకే మీరు ఏర్పరచుకునే ఆలోచనలు, నమ్మకాల నుంచి మీ చర్యలు.. ఎంపికల వరకు జీవితం గురించిన కొన్ని మానసిక వాస్తవాలను, చిట్కాలను ఈ వారం తెలుసుకుందాం. ఇవి జీవితం గురించి మీ అవగాహననే మార్చేయగలవు. బాల్యంలో మీ తల్లితో మీ సంబంధం జీవితకాల ప్రభావాన్ని చూపుతుంది. ఇతరులతో సాన్నిహిత్యం మొదలుకొని సవాళ్లను, ఒత్తిడిని మీరు ఎలా ఎదుర్కొంటారనే వరకు ప్రతి అంశాన్నీ ప్రభావితం చేస్తుంది. పిల్లలు పుట్టినప్పటి నుంచి యాసను గుర్తించగలరని, అర్థం చేసుకోగలరని నిరూపితమైంది. ఐదు నెలల వయస్సులో పిల్లలు తమ తల్లి యాసను వింటారు, ఇష్టపడతారు, స్వీకరిస్తారు. యుక్తవయస్సు ప్రారంభంలో జరిగే సంఘటనలు సంవత్సరాలుగా మీతో ఉంటాయి. కొన్ని మార్పులకు కారణమైన సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవడానికి మీ మెదడు ఇష్టపడుతుంది, గుర్తు చేసుకుంటుంది. మీరు నేర్చుకున్నదానితో సంతృప్తిపడే వారైనప్పటికీ, మీ అన్కాన్షస్ మైండ్ జీవితాంతం కొత్త సమాచారం కోసం అన్వేషిస్తూనే ఉంటుంది. మీ మెదడులోని మిమ్మల్ని కొత్త సమాచారాన్ని కోరుకునేలా చేస్తూనే ఉంటుంది. కొత్త భాషలు నేర్చుకుంటే మీ నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఒకే భాషకు పరిమితం కాకుండా రెండు భాషలు నేర్చుకునేవారు హేతుబద్ధమైన, తక్కువ భావోద్వేగ నిర్ణయాలు తీసుకుంటారని షికాగో విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడైంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనే మాట మీరు వినే ఉంటారు. అది నిజం కూడా. ఎవరినైనా మొదటిసారి కలసినప్పుడు మీకు ఏర్పడిన అభిప్రాయం మనసులో అలా ఉండిపోతుంది. మళ్లీ కొన్నేళ్ల తర్వాత కలసినా.. ఆ మొదటి అభిప్రాయం ఆధారంగానే సంభాషణ ఉంటుంది. అందువల్ల ఎవరినైనా మొదటిసారి కలసేటప్పుడు బెస్ట్ ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. మీరు జీవితాన్ని ఎంత ఆనందిస్తున్నారనే దానిపై కృతజ్ఞత ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సంతోషానికి కృతజ్ఞతతో ఉండటం చాలా కీలకమైన అంశం. మీరు రోజూ కృతజ్ఞత వ్యక్తీకరించినప్పుడు, మీ మొత్తం భావోద్వేగ స్థితి, జీవన నాణ్యత పెరుగుతాయి. డోపమైన్, సెరటోనిన్ లాంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. మీ ఆయుష్షు పెరుగుతుంది. అందుకే రోజూ గ్రాటిట్యూడ్ జర్నల్ రాయాలి. మీరు ఎక్కువ కాలం జీవించాలనుకుంటే, మరింత మందికి సహాయం చేయండి. డిప్రెషన్ ప్రభావాన్ని తగ్గించడానికి ఇది ఒక ప్రభావవంతమైన మార్గం. స్వచ్ఛందసేవ వల్ల మరణాల రేటును 22శాతం తగ్గించే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. అందుకే అవకాశమున్నప్పుడల్లా స్వచ్ఛంద సేవ చేయాలి. జీవితంలో ఆనందం అనేది డబ్బు వల్లనో, పేరు ప్రఖ్యాతుల వల్లనో రాదు. మీరు చేసే పనిలో సూపర్ ఫోకస్ ఉన్నప్పుడు వస్తుంది. దీన్నే ఫ్లో స్టేట్ లేదా ప్రవాహ స్థితి అంటారు. అందుకే మీకు బాగా నచ్చిన పని చేయాలి.. ఎక్కువ ఆనందంగా జీవించాలి. ప్లాసిబో ఎఫెక్ట్ గురించి మీరు వినే ఉంటారు. అంటే నిజమైన ట్యాబ్లెట్లా కనిపించే పిండి ట్యాబ్లెట్లు ఇచ్చినా అదే రకమైన ఫలితాలు రావడం. ఇది మందుల విషయంలోనే కాదు, జీవితంలో అనేక అంశాల్లో జరుగుతుందని సైకాలజిస్టులు వెల్లడించారు. రోజూ జిమ్ వీడియోలు చూడటం కూడా ఒత్తిళ్లను నివారించడానికి సహాయపడుతుందట. అలాగని వాటితో శాశ్వత పరిష్కారం దొరకదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సంతృప్తి (gratification)ని ఆలస్యం చేయగలిగితే మీకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. అంటే దీర్ఘకాలిక ప్రయోజనం కోసం తక్షణ ఆనందాన్ని నిరోధించాలి. అది లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సిన ప్రేరణను అందిస్తుంది. లాభం పొందే శక్తి కంటే నష్ట భయం చాలా ముఖ్యమట. అంటే లాభం పొందాలనే కోరికకంటే, నష్టపోతామేమోననే భయమే మనల్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com ఇవి చదవండి: ఇచట డిజిటల్ ఆమ్లెట్ డిజిటల్ పరోటా వేయబడును -
అంతరించిన పక్షికి మళ్లీ ప్రాణం..!
భూమ్మీద పుట్టిన జీవరాశుల్లో అనేక జీవులు అంతరించిపోయాయి. ఇప్పటికే అంతరించిపోయిన జీవులను తిరిగి పుట్టించడం సాధ్యంకాదనే ఇంతవరకు అనుకుంటూ వచ్చారు. అయితే, అది సాధ్యమేనని రుజువు చేయడానికి శాస్త్రవేత్తలు నడుంబిగించారు. నాలుగు శతాబ్దాల కిందట అంతరించిపోయిన ‘డోడో’ పక్షులను తిరిగి పుట్టించడానికి అమెరికన్ బయోసైన్సెస్–జెనెటిక్ ఇంజినీరింగ్ కంపెనీ ‘కలోసల్ బయోసైన్సెస్’ శాస్త్రవేత్తలు ప్రయత్నాలను ప్రారంభించారు. డోడో పక్షులు భారీగా ఉండేవి. ఇవి ఎగరగలిగేవి కాదు. ఒకప్పుడు మారిషస్‌లో విరివిగా తిరిగేవి. ఈ జాతిలోని చివరి పక్షి 1681లో చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ పక్షులకు చెందిన పురాతన డీఎన్ఏ నమూనాలను సేకరించామని, వాటి ఆధారంగా మారిషన్ వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ సహకారంతో డోడో పక్షులకు పునర్జీవం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కలోసల్ బయోసైన్సెస్ వ్యవస్థాపకుడు బెన్ లామ్ వెల్లడించారు. డోడో తరహాలోనే ఇప్పటికే అంతరించిన గులాబి పావురానికి కూడా పునర్జీవం కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇవి చదవండి: ‘హషిమా’ దీవి.. ఈ చీకటి చరిత్రను తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్‌లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement