-
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
వైద్యో నారాయణో హరిః అంటాం. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం.అలాగే రోగులకు సేవచేసే నర్సులని దైవదూతలుగా భావిస్తాం. నిస్సార్థంగా, కుటుంబ సభ్యులకంటే మిన్నగా వారు చేసే సపర్యలు రోగులకు ఎక్కడలేని ఊరటనిస్తాయి. కానీ ఒక నర్సుమాత్రం దీనికి పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. రాక్షసిలా మారి రోగులను పొట్టన బెట్టుకుంది. ఎక్కడ ఏంటి వివరాల కోసం ఈ కథనాన్ని చదవండి..!అమెరికాలోని పెన్సిల్వేనియాలో హీథర్ ప్రెస్డీ (41) అనే నర్సుకు ఏకంగా 760 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మూడు హత్య కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మూడు జీవిత కాలాలు అంటే 760 సంవత్సరాల జైలు శిక్షను విధించారు.మూడేళ్ల పాటు ప్రాణాంతకమైన ఇన్సులిన్ ను అధిక మోతాదులతో ఇవ్వడంతో 17 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టుప్రెస్డీపై ఆరోపణలు నమోదైనాయి. మూడు హత్యలు, 19 హత్యాయత్నాల్లో నేరాన్ని అంగీకరించింది. ఈ కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు.ప్రెస్డీ 22 మంది రోగులకు అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇచ్చినట్లు అభియోగాలు మోపారు. వీరిలో చాలా మంది రోగులు మోతాదు తీసుకున్న వెంటనే లేదా కొంత సమయం తరువాత మరణించారు. బాధితులు 43 నుండి 104 ఏళ్ల వయసు ఉంటుంది.ఇద్దరు రోగులను చంపినందుకు ఆమెపై తొలుత గత ఏడాది మేలో అభియోగాలు నమోదు కాగా, తర్వాత జరిగిన పోలీసు విచారణలో మరిన్ని విషయాలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక అభియోగాలు నమోదు చేసిన అనంతరం ఆమె నర్సింగ్ లైసెన్స్ రద్దు చేశారు. ‘‘ఆమెకు ఏ జబ్బూ లేదు. మతిస్థిమితమూ లేదు. ఆమెది దుష్ట వ్యక్తిత్వం. ఆమె నా తండ్రిని చంపిన రోజు ఉదయం ఆమె కూృరమైన ముఖంలోకి చూశాను'’ అంటూ బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు కోర్టుకు తెలిపారు.రోగులు, సహోద్యోగులు పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించేదని విచారణ అధికారులు గుర్తించారు. అంతేకాదు ప్రెస్డీ తన తల్లికి ఏప్రిల్ 2022 – మే 2023 మధ్య కాలంలో రోగుల పట్ల తన అసంతృప్తిని మెస్సేజ్‌లను పంపించిందట.ఇన్సులిన్ అధిక మోతాదు హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది, హృదయ స్పందనను పెంచుతుంది. గుండెపోటుకు కూడా దారితీస్తుంది. చివరికి ప్రాణాలను కూడా తీస్తుంది. -
ఖైదీల మధ్య ఘర్షణ.. ఇద్దరు మృతి!
పంజాబ్‌లోని సంగ్రూర్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం అర్థరాత్రి ఘర్షణ జరిగింది. ఈ నేపధ్యంలో తీవ్రంగా గాయపడిన నలుగురు ఖైదీలను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో ఇద్దరు ఖైదీల పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం వారిని పాటియాలా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్ కరణ్‌దీప్ కహెల్ మాట్లాడుతూ తీవ్రంగా గాయపడిన నలుగురు ఖైదీలను జైలు నుంచి ఇక్కడికి తీసుకు వచ్చారని, వారిలో ఇద్దరు మృతి చెందారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వారిని పటియాలాకు రిఫర్ చేశామని తెలిపారు. మరణించిన ఖైదీల పేర్లు హర్ష్, ధర్మేంద్ర అని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘర్షణలో గగన్‌దీప్ సింగ్, మహ్మద్ హరీష్, సిమ్రాన్ గాయపడ్డారు. ఖైదీలు నిద్రించడానికి తమ బ్యారక్లకు వెళుతుండగా సిమ్రంజీత్ తన సహచరుల సహాయంతో హర్ష్, ధర్మేంద్రలపై దాడి చేశాడు. నిందితులు ధర్మేంద్ర, హర్షలపై కట్టర్‌తో మెడ, ఛాతీ, నోటిపై దాడి చేశారు. సిమ్రంజీత్‌పై హత్యతో పాటు 18 కేసులు ఉన్నాయి. ఇతను ఆరేళ్లుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఘర్షణ తర్వాత జైలు అధికారులు ఈ రెండు గ్రూపుల ఖైదీలను వేర్వేరు బ్యారక్‌లలో ఉంచారు. -
మూడు మామిడి పండ్లే తిన్నా.. ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ వాదన
న్యూఢిల్లీ: జైలులో తాను తీసుకుంటున్న ఆహారాన్ని ఈడీ రాజకీయం చేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. డయాబెటిస్ బాధితుడినైన తనకు జైలులో ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ రౌస్అవెన్యూ కోర్టులో శుక్రవారం వాదనలు కొనసాగాయి. మెడికల్ బెయిల్ పొందడానికి లేదా చికిత్స పేరిట ఆసుపత్రిలో చేరడానికి వీలుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుకోవడానికి కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ గురువారం కోర్టు దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ వాదనపై కేజ్రీవాల్ శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జైలులో ఉన్న తనకు ఇప్పటిదాకా 48 సార్లు ఇంటి నుంచి భోజనం పంపగా, కేవలం మూడుసార్లు మాత్రమే మామిడిపండ్లు తిన్నానని కేజ్రీవాల్ తెలిపారు. కేవలం ఒకే ఒక్కసారి ఆలూ పూరీ తీసుకున్నానని, అది కూడా నవరాత్రి ప్రసాదంగా స్వీకరించానని కోర్టుకు తెలియజేశారు. వైట్ రైస్, బ్రౌన్ రైస్ కంటే మామిడి పండ్లలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. షుగర్ లేని స్వీట్లు ఆరుసార్లు తిన్నానని, షుగర్ లేకుండా టీ తాగుతున్నానని వెల్లడించారు. తనకు చికిత్స అందించే రెగ్యులర్ వైద్యుడు సూచించిన డైట్ చార్ట్ ప్రకారమే ఆహారం తీసుకుంటున్నానని వివరించారు. ప్రతిరోజూ 15 నిమిషాలపాటు డాక్టర్‌ను సంప్రదించడానికి అనుమతి ఇవ్వాలంటూ శుక్రవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇన్సులిన్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. -
‘కేజ్రీవాల్‌ను మూడోసారీ ఓడించలేకపోతే చంపేద్దాం.. ఇదీ వారి కుట్ర’
న్యూఢిల్లీ, సాక్షి: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను జైల్లో చంపే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నాయకురాలు, రాష్ట్ర మంత్రి అతిషి ఆరోపించారు. టైప్ 2 డయాబెటిస్ పేషెంట్ అయిన కేజ్రీవాల్ పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ ఆయనకు ఇన్సులిన్ ఇవ్వడం లేదని తెలిపారు. మద్యం పాలసీ స్కామ్ ఆరోపణలతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. తాజాగా కేజ్రీవాల్ తన రెగ్యులర్ డాక్టర్‌తో వీడియో సంప్రదింపుల కోసం చేసిన అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించిన అనంతరం ఆప్ నేతల నుంచి ఈ ఆరోపణలు వచ్చాయి. ‘అరవింద్ కేజ్రీవాల్‌ను మూడు ఎన్నికల్లో (మూడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు) బీజేపీ ఓడించలేకపోతే, ఆయన్ను జైల్లో ఉంచి చంపేందుకు పథకం పన్నుతోంది’ అని అతిషి అన్నారు. "అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహంతో బాధపడుతున్నారని అందరికీ తెలుసు. ఆయనకు గత 30 సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. తన చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటారు" అని ఆమె పేర్కొన్నారు. ‘ఇంత తీవ్రమైన మధుమేహం ఉన్న వ్యక్తి మాత్రమే అంత ఇన్సులిన్ తీసుకుంటాడు. కావాలంటే ఏ డాక్టర్నైనా అడగండి.. అందుకే అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి, డాక్టర్ సూచించిన ఆహారాన్ని తినడానికి కోర్టు అనుమతించింది’ అన్నారు. అయితే బీజేపీ తన అనుబంధ సంస్థ (ఈడీ) ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఈడీ పదే పదే అబద్ధాలు చెబుతోందని అని ఆమె కోర్టులో ఏజెన్సీ వాదనలను తిప్పికొట్టారు. తన వైద్యుడితో సంప్రదింపు కోసం చేసిన అభ్యర్థనను వ్యతిరేకిస్తూ, మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని మామిడిపండ్లు, స్వీట్లను కేజ్రీవాల్ తింటున్నారని, చక్కెర కలిగిన టీ తాగుతున్నారని ఈడీ వాదించింది. దీనికి కౌంటర్ ఇస్తూ ఇది పూర్తిగా అబద్ధమని, డాక్టర్ సూచించిన స్వీటెనర్ తోనే టీ, స్వీట్లను కేజ్రీవాల్ తీసుకున్నారని అతిషి చెప్పుకొచ్చారు. -
సౌదీ జైల్లో భారతీయుడు.. విడుదలకు రూ.34 కోట్ల నిధుల సేకరణ
కోజికోడ్: ప్రపంచంలో ఏమూల ఉన్నాసరే విపత్కర సమయాల్లో కేరళ ప్రజలంతా ఒక్కటవుతుంటారు. ఈ క్రమంలో సౌదీ అరేబియాలో మరణ శిక్ష పడిన ఓ వ్యక్తి కోసం ఇప్పుడూ వాళ్లంతా ఏకం అయ్యారు. ఓ హత్య కేసులో మరణశిక్ష పడ్డ వ్యక్తి జైల్లో మగ్గుతున్న ఆ వ్యక్తిని కాపాడటానికి ఏకంగా రూ. 34 కోట్లు నిధుల సేకరణకు ముందుకొచ్చారు. కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్.. 2006లో సౌదీలో ఓ బాలుడికి అబ్దుల్ రహీమ్ కేర్‌టేకర్‌గా చేరారు. అయితే ప్రమాదవశాత్తు ఆ బాలుడు రహీమ్ సంరక్షణలో మృతి చెందాడు. దీంతో ఈ కేసులో అక్కడి న్యాయస్థానం రహీమ్‌కు మరణశిక్ష విధించింది. సుమారు 18 ఏళ్ల నుంచి సౌదీ అరేబియాలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో రహీమ్‌కు క్షమాభిక్ష ప్రసాదించడానికి బాధిత కుటుంబం తొలుత నిరాకరించింది. అయితే.. బ్లడ్‌మనీ (నష్ట పరిహారం రూపంలో) చెల్లిస్తే క్షమించేందుకు ఎట్టకేలకు ఒప్పుకుంది. బ్లడ్ మనీ కింద రూ.34కోట్లు చెల్లించాలని ఆ బాలుడి కుటుంబం షరతు విధించింది. అయితే రహీం ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కదా!. ఈ క్రమంలో సౌదీలోని కేరళీయులు అంతా ఏకమై నిధలు సేకరించడానికి ఓ కమిటిగా ఏర్పడ్డారు. ముందుగా నిధులు సమీకణకు పెద్దగా స్పందన రాలేదు. కొన్ని రోజుల అనంతరం కేరళీయుల నుంచి భారీ విరాళాలు రావటం ప్రారంభమైందని నిధుల సేకరణ కమిటీ మీడియాకు వెల్లడించింది. రియాద్‌లోని సుమారు 75 సంస్థలు, కేరళకు వ్యాపారవేత్తలు, స్థానిక రాజకీయ సంస్థలు విరాళాలు అందిచినట్లు తెలుస్తోంది. విరాళాల్లో పారదర్శకత కోసం సదరు కమిటి ప్రత్యేక నిధులకు సేకరణకు యాప్‌ను కూడా తయారు చేసింది. ‘ఇంత పెద్ద భారీ నిధులు సేకరణ సాధ్యం అవుతుందని అస్సలు ఊహించలేదు. రూ. 34 కోట్లు సేకరిస్తామన్న నమ్మకం మొదట్లో లేదు. కానీ మెల్లగా విరాళాలు పెరగటంతో సాధ్యం అయింది’ అబ్దుల్ రహీం తల్లి సంతోషం వ్యక్తం చేసింది. త్వరలోనే రహీమ్ జైలు నుంచి విడుదల కానున్నాడని అతని కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్‌రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్‌కు సర్వం సిద్ధం
ప్రజ్వల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement