-
గుండె ఘోష విన్నారు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాల్లో 32.4 శాతం గుండె సంబంధిత వ్యాధుల కారణంగానే ఉంటున్నాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)లో గుండె జబ్బులదే అగ్రస్థానం. ఈ క్రమంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ మునుపెన్నడూలేని రీతిలో ఎన్సీడీ నిర్వహణపై పక్కా ప్రణాళికతో అడుగులు వేశారు. ఇందులో భాగంగా.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో ప్రభుత్వాస్పత్రుల ఆధునీకరణ సహా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా గుండె జబ్బులు, క్యాన్సర్ తదితర పెద్ద జబ్బులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. కార్డియాలజీ, కార్డియో వాసు్క్యలర్ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేస్తూ ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్ (ఈసీసీ) కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించి బాధితుల ప్రాణాలను కాపాడింది. నగరాలకు దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు గుండెపోటు బారినపడితే తొలి 40 నిమిషాల్లోనే ఈ కార్యక్రమం ద్వారా ప్రాథమిక వైద్య సేవలు లభించేలా చర్యలు తీసుకున్నారు. హబ్ అండ్ స్పోక్ విధానంలో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు. సామాన్యులకూ అందుబాటులోకి హార్ట్‌కేర్ సర్వీసులు.. తిరుపతి రుయా ఆస్పత్రిలో 2022 జనవరి నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఈ ఈసీసీ నడుస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం జీజీహెచ్‌లను హబ్‌లుగా తీర్చిదిద్ది కార్యక్రమాన్ని విస్తరించారు. నాలుగు చోట్ల కార్డియాలజిస్ట్ వైద్యులతో పాటు, క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం ఉంది. హబ్‌లకు ఆయా జిల్లాల పరిధిలోని 69 స్పోక్స్ (సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఆస్పత్రులు)ను అనుసంధానంచేసి హార్ట్‌కేర్ సర్వీసులను సామాన్యులు, గ్రామీణులకు అందుబాటులోకి తెచ్చారు. అనంతరం అన్ని జీజీహెచ్‌లను హబ్‌లుగా, సెకండరీ హెల్త్ ఆస్పత్రులను స్పోక్స్‌గా తీర్చిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చారు. స్పోక్స్‌గా వ్యవహరించే ఆస్పత్రుల్లో ఛాతినొప్పి, ఇతర గుండెపోటు లక్షణాలతో వచ్చిన వ్యక్తులకు వెంటనే ఈసీజీ తీస్తున్నారు. ఆ ఫలితాన్ని హబ్‌లో ఉన్న కార్డియాలజిస్ట్‌కు పంపుతున్నారు. కార్డియాలజిస్ట్‌లు సంబంధిత కేసు గుండెపోటుదా కాదా అని నిర్ధారించి గుండె రక్తనాళం ఎంత శాతం పూడుకుపోయిందో పరిశీలించి థ్రాబోలైసిస్ థెరపీని సూచిస్తున్నారు. ఇలా సూచించిన కేసుల్లో రూ.40 వేల విలువ చేసే థ్రాంబోలైసిస్ ఇంజక్షన్‌ను బాధితులకు ఉచితంగా ఇస్తున్నారు. గతేడాది సెప్టెంబరు 29 నుంచి ఇప్పటివరకూ 3 వేల మందికి పైగా ఛాతినొప్పితో స్పోక్స్‌కు రాగా వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో గుండె రక్తనాళం 100 శాతం పూడిపోవడంతో వచ్చే ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియాల్ ఇన్ఫార్క్షన్ (స్టెమీ) సమస్యతో బాధపడుతున్న 489 మందికి వెంటనే థ్రాంబోలైసిస్ నిర్వహించారు. వీరిలో 424 మంది క్షేమంగా ఉన్నారు. సకాలంలో వైద్యసాయం అందకపోయినట్లయితే వీరందరూ కూడా మృత్యువాత పడేవారని వైద్యులు చెబుతున్నారు. భవిష్యత్‌లోనూ మరింత రక్షణ.. మరోవైపు.. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా బీపీ, షుగర్, ఇతర ఎన్సీడీ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షించారు. గుండె జబ్బులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఐదేళ్లలో 3.67 లక్షల గుండెపోటు బాధితులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేశారు. ఇందుకు రూ.2,300 కోట్లకు పైగా వెచ్చించారు. మరింత సమర్థవంతంగా గుండెపోటు మరణాలను నియంత్రించడానికి ఈసీసీను అమలులోకి తెచ్చారు. ఇక వచ్చే ప్రభుత్వంలో గుండె సంబంధిత వైద్యసేవల కోసం విశాఖ, కర్నూలు, గుంటూరుల్లో హబ్‌లు ఏర్పాటుచేస్తామని వైఎస్సార్సీపీ 2024 మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. -
నటుడు శ్రేయాస్ తల్పాడేకి గుండెపోటు..ఆ వ్యాక్సినే కారణమా..?
బాలీవుడ్, మళయాళీ నటుడు, నిర్మాత, దర్శక్షుడు అయిన శ్రేయాస్ తల్పాడే గతేడాది గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. నాటి దురదృష్టకర ఘటనను గుర్తు తెచ్చుకుంటూ తాను ధూమపానం సేవించనే, మందు తాగాను అయినా తాను ఈ గుండెపోటు బారిని పడ్డానని బాధగా అన్నారు. తనకు కొలస్ట్రాల్ ఎక్కువగా ఉందన్న విషయం తెలుసనిన్నారు. అందుకోసం మందులు వాడుతున్నట్లు చెప్పారు. ఇక తనకు మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలి వ్యాధులు లేవనిన్నారు. అలాంటప్పుడు తాను ఈ గుండె జబ్బు బారిన ఎలా పడ్డానని ఆవేదనగా అన్నారు. బహుశా ఇది కోవిడ్ వ్యాక్సిన్ వల్లే అయ్యి ఉండొచ్చని అనుమానాన్ని వ్యక్తం చేశారు. నిజానికి ఆ మహమ్మారి సమయంలో బయటపడేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్‌లు చేపట్టింది. మనం కూడా సేఫ్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో వారి చెప్పిన డోస్‌లు తీసుకున్నాం. అయితే నిజానికి మనకు శరీరంలో ఏం తీసుకుంటున్నామనేది తెలియదు. ఎలాంటి కంపెనీలను విశ్వసించాలో కూడా తెలియని స్థితి అది. ప్రస్తుతం కోవిషీల్డ్ తీసుకోవడం వల్ల ముగ్గురు చనిపోయారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే శ్రేయాస్ ఇలా తన అనుమానాన్ని బాధగా వెలిబుచ్చారు. ఇక బాధితులు పోస్ట్‌మార్టంలో కూడా వ్యాక్సిన్ రియాక్షన్ కారణంగానే మరణించినట్లు వెల్లడవ్వడంతో ఒక్కసారిగా అందరిలో తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తాయి. కాగా, నటుడు గతేడాది డిసెంబర్లో శ్రేయాస్ తల్పాడే తనకు గుండెపోటు వచ్చిన విధానాన్ని గూర్తి వివరిస్తూ.."అహ్మద్ ఖాన్ వెల్కమ్ టు ది జంగిల్ కోసం ముంబైలో జోగేశ్వరికి దగ్గరగా ఉన్న ఎస్ఆర్పీఎఫ్ గ్రౌండ్స్‌లో షూటింగ్ చేస్తున్నాం. ఆర్మీ శిక్షణా సన్నివేశాలు చిత్రికరిస్తుండగా..సడెన్‌గా ఒక షాట్లో ఊపిరి పీల్చుకోలేకపోడం, ఎడమ ఛాతీలో తీవ్ర నొప్పి రాడం జరిగింది. దీంతో కనీసం ఆ షూట్ తర్వాత నేను నా వానిటీ వ్యాన్‌కి వెళ్లి బట్టలు కూడా మార్చుకోలేకపోయాను. ఈ విధమైన అలసటను తానెప్పుడూ ఫేస్ చేయలేదని చెప్పుకొచ్చాడు శ్రేయాస్ తల్పాడే. అంతేగాదు తాను కోలుకుని బయటపడాతనని కూడా అనుకోలేదని చెప్పారు. ఇది తనకు భగవంతుడు ఇచ్చిన రెండో అవకామని అన్నారు. నిజంగా కోవిషీల్డ్ ప్రమాదకరమైనదా..?భారతదేశంలో కోవిషీల్డ్ 175 కోట్ల డోస్‌లు ఇచ్చారు. భారతదేశంలో ప్రజలకు అత్యంత విస్తృతంగా అందించిన టీకా. అయితే ఇటీవల ఈ ఆస్ట్రాజెనెకాకు చెందిన కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్ దుష్ఫ్రభావాలు గురించి ప్రజల్లో తీవ్ర ఆందోళలను మొదలయ్యాయి. కానీ ఆస్ట్రాజెనెకా చట్టపరమైన సమర్పణలో టీకా గురించి సవివరంగా వెల్లడించింది. అందులో ఈ టీకా కారణంగా థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్)తో థ్రాంబోసిస్కు దారితీస్తుందని అంగీకరించింది. ఈ పరిస్థితి కారణంగా రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్లెట్ కౌంట్‌కి పడిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ దుష్ప్రభావాలు గురించి క్లియర్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నిజానికి మనదేశంలో ఈ టీకా వేసిన తర్వాత పరిమిత సంఖ్యలో ఈ టీటీఎస్ కేసులు నమోదయ్యాయి. టీకా-ప్రేరిత రోగనిరోధక థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనియా (VITT)తో సహా థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రాంబోసిస్ అనేది చాలా అరుదైన దుష్ప్రభావం. ఎక్కువగా ప్రాథమిక టీకా తర్వాత కనిపిస్తుంది. అలాగే ఈ వ్యాక్సిన్‌ని తీసుకున్న ప్రతిఒక్కరు దీని బారిన పడరని ఆస్ట్రాజెనెకా కంపెనీ చట్టపరమైన పత్రాల్లో స్పష్టం చేసింది. చాలావరకు టీకా తీసుకున్న మొదటి 21 రోజుల్లోనే ఈ దుష్ప్రభావం సంభవిస్తుంది. అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఈ టీకా తీసుకున్నవాళ్లు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే టీకా వేసిన కొన్ని వారాల్లోనే ఇలాంటీ టీటీఎస్ సమస్యలు వస్తాయని తేల్చి చెప్పారు.(చదవండి: ఆజానబాహుడిలా ఉండే జాన్ అబ్రహం ఫిట్నెస్ రహస్యం ఇదే! అందుకే..!) -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. సింగం నటుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కోలీవుడ్ నటుడు అరుల్మణి(65) కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా.. అరుల్మణి ప్రస్తుతం అన్నాడీఎంకే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఆయన మృతికి ఎన్నికల ప్రచారమే కారణమని తెలుస్తోంది. గత పది రోజులుగా పలు నగరాల్లో ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. గురువారం చెన్నైకి వచ్చిన ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. కాగా.. అరుల్మణి ప్రముఖంగా సింగం, సింగం- 2, సామాన్యన్, స్లీప్‌లెస్ ఐస్, థెండ్రాల్, తాండవకొనే, రజినీకాంత్ లింగతో సహా పలు తమిళ చిత్రాలలో ఆయన నటించారు. కాగా.. అరుల్మణి తమిళ సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించారు. 'అళగి' సినిమా అరుల్ మణి కెరీర్‌ను మలుపు తిప్పింది. కోలీవుడ్‌లో ఇప్పటి వరకు అళగి, తెనారల్, పొన్నుమణి, ధర్మశీలన్, కరుపు రోజా, వేల్, మరుదమలై, కత్తు తమిళ్, వన యుద్ధం సహా 90 చిత్రాల్లో నటించారు. దాదాపు అందరు ప్రముఖ హీరోలతో ఆయన నటించారు. ఆయనకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఆయన అన్నాడీఎంకే స్టార్ కంపెయినర్‌గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
బీఎస్పీ అభ్యర్థికి గుండెపోటు
బహుజన్ సమాజ్ పార్టీ అలీగఢ్ అభ్యర్థి గుఫ్రాన్ నూర్ గుండెపోటుకు గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. విషయం తెలిసిన వెంటనే బీఎస్పీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకున్నారు. తన తండ్రి ఇప్పటికే హార్ట్ పేషెంట్ అని, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో చేర్చినట్లు గుఫ్రాన్ నూర్ కుమారుడు ఆదిల్ తెలిపారు. బీఎస్పీ రెండు రోజుల క్రితం గుఫ్రాన్ నూర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ బాబు ముంకద్ అలీ.. గుఫ్రాన్ నూర్ అభ్యర్థిత్వాన్ని వెల్లడించారు. కాగా బీఎస్పీ అలీగఢ్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ మాత్రం ఇంకా దీన్ని ధ్రువీకరించలేదు. 2012లో గుఫ్రాన్ నూర్ బరౌలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి క్వామీ ఏక్తా దళ్ టిక్కెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 2023లో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీ చేశారు. -
డేనియల్ బాలాజీ హఠాన్మారణం: గుండెపోటు వస్తే అంతేనా..?
కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (48) చిన్న వయసులోనే అకాల మరణం పొందారు. కుటుంభ సభ్యుల సమాచారం ప్రకారం..శుక్రవారం అర్థరాత్రి ఒక్కసారిగా తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారని, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయారని వెల్లడించారు. 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన చిన్నవయసులోనే కానరాని లోకాలకు వెళ్లిపోవడ బాధకరం. అస్సలు గుండెపోటు వస్తే ఇక అంతేనా?..ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? బయటపడలేమా అంటే.. చాలా ఘటనల్లో గుండెపోటు రావడం ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపు చనిపోవడం జరగుతుంది. కానీ ఇలా గుండెపోటు వచ్చే ముందు కొన్ని సంకేతాలు వస్తాయట. వాటిని పట్టించుకోకపోవడంతోనే సమస్య తీవ్రమై ఆస్పత్రికి తరలించే వ్యవధి సరిపోక చనిపోవడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎలాంటి వారికి వస్తుందంటే.. మధుమేహం, ఊబకాయం, ఒత్తిడి, రక్తపోటు వంటి సమ్యలున్న వారికి గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. అలాగే కుటుంబ చరిత్రలో గుండె పోటు సంకేతాలు ఉంటే వారికి కూడా గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. ముందుగా వచ్చే సంకేతాలు.. ఛాతి నొప్పి శ్వాస ఆడకపోవడం కుడి లేదా ఎడమ చేయి లాగడం ఛాతీ అసౌకర్యం ఆ నొప్పి 20 నిమిషాలకు పైనే ఉన్నా.. వికారం కష్టపడు, చేమాటోర్చు గుండెల్లో మంట అజీర్ణం లేదా కడుపు నొప్పి అలసట మరియు వాపు మైకము ఆ టైంలో ఏం చేయాలంటే.. ఈ సంకేతాలు కనిపించిన వెంటనే సార్బిట్రేట్(5 ఎంజీ నుంచి 10 ఎంజీ) ట్యాబ్లెట్‌ను నాలుక కింద పెట్టుకుని చప్పరించాలి. అయినా నొప్పి తగ్గకపోతే దాన్ని గుండె పోటుగా పరిగణించి వెంటనే వైద్య సాయం పొందడానికి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సమయంలో ఆస్పిరిన్ (300 ఎంజీ), క్లోపిడోగ్రిల్ (300 ఎంజీ), అటోర్వాస్టాటిన్( 80 ఎంజీ ) ట్యాబ్లెట్ తీసుకోవాలి. అప్పుడు ఈసీజీ కోసం ఆస్పత్రికి వెళ్లాలి. అయితే వీటిని పరిస్థితి క్రిటికల్ అనిపించినప్పుడే ఇవి వేసుకోవాలి. అలాగే వైద్యుని వెంటనే సంప్రదించి తాను ఏ ట్యాబ్లెట్ వేసుకున్నామో? వివరించాలి. ఇక్కడ ఇలాంటి లక్షణాలు కనిపించిన.. 30 నిమిషాలలోపు ఆస్పిరిన్ నమలడం వల్ల ప్లేట్లెట్ అభివృద్ధిని నిరోధిస్తుంది, అలాగే రక్తం గడ్డకట్టడాని ఆలస్యం చేస్తుంది. కొంతమంది రోగులు గుండె సంబంధిత సంఘటన కంటే రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం వల్ల విపరీతమైన చెమట, మైకం వచ్చిందని చెబుతారు. అలాంటప్పుడూ రోగికి సార్బిట్రేట్ ట్యాబెలెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఎందుకంటే..? ఇది బీపీను మరింత తగ్గిస్తుంది. ఈ విషయంపై పూర్తి అవగాహన ఉండి.. అవతలి వ్యక్తి పరిస్థితిని క్షణ్ణంగా తెలుసుకున్నాక ఇలాంటి ప్రథమ చికిత్సలను చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ట్యాబ్లెట్లు వేసుకున్నాం కదా!.. గుండె నొప్పి తగ్గిందని వైద్యుని వద్దకు వెళ్లకుండా నిర్లక్ష్యంగా అస్సలు వ్యవహరించొద్దు. ఇది కేవలం అంబులెన్స్ లేదా ఆస్పత్రికి వెళ్లే సమయం వరకూ ప్రాణాలను కాపాడుకోవడానికే అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. గోల్డెన్ అవర్‌లోపు తరలించాలి.. అంతేగాదు మెజారిటీ గుండెపోటు మరణాలు సమయానికి ఆస్పత్రికి చేరుకోకపోవడం వల్లనే జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు వచ్చిన మొదటి గంటలోనే పేషెంట్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తే ప్రాణాలతో బయట పడే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. చాలా కేసులలో బాధితులకు ఛాతిలో నొప్పి వచ్చిన కొన్ని గంటల తర్వాత ఆస్పత్రిలో చేరుతున్నారని.. అయితే అప్పటికే జరుగాల్సిన నష్టం జరుగుతుందని అంటున్నారు. ఎవరికైనా గుండెపోటు వచ్చిన గంటసేపటి వరకు కూడా శరీరానికి రక్తసరఫరా జరుగుతుందని.. ఇందులో మొదటి గంట తర్వాతనే రక్త ప్రసరణ ఆగిపోతుందని వైద్యులు అంటున్నారు. అందుకే గుండెపోటు వచ్చిన మొదటి గంటను గోల్డెన్ అవర్ లేదా గోల్డెన్ టైమ్ అని అంటారని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ గంట సమయంలోగా ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు. (చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫాలో అయ్యే డైట్ ఇదే!)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బైకుల చోరీ కేసులో ఐదుగురికి జైలు
ఉండాల్సింది ధైర్యం మాత్రమే!
వ్యక్తిపై అకారణంగా ఎస్ఐ దాడి
వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి
వైభవంగా శ్రీనివాసుడి కల్యాణోత్సవం
సీఎం జగన్‌తోనే బడుగుల అభ్యున్నతి
ముమ్మరంగా పోస్టల్ బ్యాలెట్
No Headline
నా మంచితనాన్ని.. చేతగానితనంగా తీసుకోవద్దు
టీడీపీ ప్రచారంలో యానిమేటర్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement