-
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ ఆరాటం.. గుజరాత్ ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Lok sabha elections 2024: వావ్! గెనీబెన్!!
గెనీబెన్ నాగాజీ ఠాకోర్. ఉత్తర గుజరాత్లో కాంగ్రెస్ ప్రముఖ నేతల్లో ఒకరు. అసెంబ్లీలో పారీ్టకి బలమైన గొంతుక. సభలో ధాటైన ప్రసంగాలతో ఆకట్టుకుంటారు. క్షేత్రస్థాయిలో బలమైన పునాది కలిగిన ప్రజాప్రతినిధి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా నడుమ కూడా వావ్ స్థానం నుంచి విజయం సాధించారు. తన నియోజకవర్గంలో అందరినీ పేరుపేరునా పలకరించే నాయకురాలు. ఎవరింట్లో ఎలాంటి కార్యక్రమమైనా తప్పనిసరిగా హాజరవుతారు. బనస్కాంత లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగి బీజేపీకి గట్టి సవాలే విసురుతున్నారు... పంచాయతీ నుంచి... 2017 అసెంబ్లీ ఎన్నికలు గెనీబెన్ రాజకీయ జీవితంలో కీలక మలుపు. వావ్ నుంచి బీజేపీ సీనియర్ నేత, మంత్రి శంకర్ చౌదరీని ఓడించడంతో ఆమె పేరు రాష్ట్రమంతటా మారుమోగిపోయింది. ఆమెకు కేవలం రెండో ఎన్నికలవి. జైన్ విశ్వభారతి ఇన్స్టిట్యూట్ నుంచి పొలిటికల్ సైన్స్ చదువుతూ గ్రాడ్యుయేషన్ మధ్యలోనే వదిలేశారు. పంచాయతీ సభ్యురాలిగా చేశారు. 2012లో కాంగ్రెస్ వావ్ నుంచి టికెటిచి్చంది. అప్పుడు 12వేల ఓట్లతో ఓడినా 2017లో విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ముగ్గురు మహిళల్లో ఒకరు.క్రౌడ్ ఫండింగ్‌తో నిధుల సేకరణ... బనస్కాంత జిల్లాలో అన్ని సామాజికవర్గాల వారూ తనను సోదరిగా భావిస్తారంటారు గెనీబెన్. ఎన్నికల ఖర్చు కోసం నియోజకవర్గంలో క్యూ ఆర్ కోడ్‌ను క్రియేట్ చేసి మరీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరిస్తున్నారు. ‘‘బీజేపీకి బలమైన ఆర్థిక వనరులున్నాయి. నాకున్నది విలువలు, సామాజిక సూత్రాలే. అయినా బలమైన సిద్ధాంతంతో పోరాడేవారిని ఎవరూ ఓడించలేరు. కనుక దేశంలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఫరిడవిల్లడానికి తోచిన సాయం చేయండి’’ అని ప్రజలను కోరుతున్నారు. రాజస్తాన్, పాకిస్తాన్‌తో సరిహద్దులో ఉన్న లోక్‌సభ స్థానం బనస్కాంత. ‘సీమ దర్శన్’ పేరుతో ఇక్కడ సరిహద్దు పర్యాటక స్థలం కూడా ఉంది. ఇక్కడ ఠాకోర్ ఓటర్లు 18 శాతం, చౌదరి ఓటర్లు 13 శాతం ఉన్నారు.వివాదాస్పద వ్యాఖ్యలు... కులాంతర, మతాంత వివాహాలను నిషేధిస్తు ఠాకోర్ సామాజికవర్గం తీసుకున్న నిర్ణయాన్ని గెనీబెన్ సమరి్థంచడం వివాదం రేపింది. యువతులకు మొబైల్ఫోన్లను నిషేధించడాన్ని కూడా ఆమె సమరి్థంచారు. ‘‘బాలికలకు మొబైల్ఫోన్లను నిషేధించడంలో తప్పు లేదు. మొబైల్స్‌కు దూరంగా ఉండి బాగా చదువుకోవాలి’’ అని సూచించడంపై చాలా విమర్శలే వచ్చాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ. 600 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది అరెస్ట్
గుజరాత్‌లోని అరేబియా సముద్ర తీరంలో భారీస్థాయి మాదకద్రవ్యాల రాకెట్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఛేదించింది. భారత్‌లోకి అక్రమంగా మాదకద్రవ్యాలు చేరవేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రను భగ్నం చేసింది. ఎన్సీబీ, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), ఇండియన్ కోస్ట్‌గార్డ్ శనివారం రాత్రి సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రూ.600 కోట్ల విలువైన 86 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోరుబందర్ సమీప తీరంలోని నౌక నుంచి వాటిని సీజ్ చేసి, పాకిస్థాన్‌కు చెందిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్‌లో భాగంగా పాక్ నౌకని నిలువరించేందుకు కోస్ట్‌గార్డ్ నౌకలు, విమానాలను మోహరించింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న కీలక నౌకల్లో కోస్ట్ గార్డ్ షిప్ రాజ్‌రతన్‌లో ఎన్సీబీ,ఏటీఎస్ అధికారులు దాడులు చేశారు. Anti #Narco #Operations @IndiaCoastGuard Ship Rajratan with #ATS #Gujarat & #NCB @narcoticsbureau in an overnight sea - air coordinated joint ops apprehends #Pakistani boat in Arabian Sea, West of #Porbandar with 14 Pak crew & @86 Kg contraband worth approx ₹ 600Cr in… pic.twitter.com/N49LfrYLzz— Indian Coast Guard (@IndiaCoastGuard) April 28, 2024 -
పానీ పూరీ: ఈ అనిల్ భాయ్ లెక్కే వేరు: వైరల్ వీడియో
పానీ పూరీ అంటే ప్రాణం లేచి వస్తుంది చాలామందికి. అయితే పానీ పూరి బండి నడిపే 71 ఏళ్ల వృద్ధుడితో సెల్ఫీల కోసం జనం ఎగబడుతున్నారు. ఆయన పేరే గుజరాత్‌కు చెందిన అనిల్ భాయ ఠక్కర్. ఈ పానీ పూరీ వాలా ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాడు. స్టోరీ ఏంటంటే.. మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారట. అది ఎంతవరకు నిజమోగానీ, గుజరాత్‌కు చెందిన అనిల్ భాయ్ ఠక్కర్ మాత్రం తన సైడ్ ప్రొఫైల్, హెయిర్‌స్టైల్, తెల్లటి గడ్డం, ఆఖరికి డ్రెస్సింగ్ స్టయిల్ కూడా అచ్చం ప్రధాన మంత్రి మోదీ పోలికలతో కస్టమర్లను కట్టిపడేస్తున్నాడు. ఈయన గుజరాత్‌లోని ఆనంద్‌లో ‘తులసి పానీ పూరీ సెంటర్’ను నడుపుతున్నాడు. అచ్చం మోదీలా ఉన్న అనిల్ భాయ్నును స్థానికులంతా పీఎం మోదీ అని పిలుచుకుంటారు. ప్రధాని మోదీతో ఉన్న పోలిక కారణంగా స్థానికులు, పర్యాటకుల నుండి తనకు చాలా ప్రేమ, గౌరవం లభిస్తోంది అంటాడు ఆనందంగా అనిల్ భాయ్. అంతేకాదు ప్రధాని తనకు ఎంతో స్ఫూర్తి పొందానని, పరిశుభ్రతకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో, అలాగే తన స్టాల్‌ను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారని అనిల్ భాయ్ చెప్పుకొచ్చాడు. అనిల్ భాయ్ వాస్తవానికి జునాగఢ్‌కు చెందినవాడు. తన తాత ప్రారంభించిన 'తులసి పానీ పూరీ సెంటర్'ను 18 ఏళ్ల వయస్సునుంచే నడిపిస్తున్నాడు. కాగా ముంబైలోని మలాడ్‌కు చెందిన వికాస్ మహంతే కూడా ప్రధాని పోలికలతో ఇటీవల వార్తల్లో నిలిచాడు. గర్భా వాయిస్తున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
అమెరికాలో ఘోర ప్రమాదం : ముగ్గురు గుజరాతీ మహిళలు దుర్మరణం
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గుజరాత్‌కు చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందారు. సౌత్ కరోలినాలోని గ్రీన్విల్లే కౌంటీలోని వీరు ప్రయాణిస్తున్న కారు హైవేమీదనుంచి, వంతెనపైకి దూసుకెళ్లడంతో అక్కడిక్కడే మరణించారు. చనిపోయిన వారిని గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా నివాసితులైన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్ , మనీషాబెన్ పటేల్‌గా గుర్తించారు. మితిమీరిన వేగంతో గ్రీన్విల్లే కౌంటీ కరోనర్స్ ఆఫీస్ I-85లో ఉత్తరం వైపు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి 20 అడుగులు గాల్లోకి లేచి, అనంతరంఅదే ఎత్తులో ఉన్న చెట్లను ఢీకొట్టింది. అధిక వేగమే ప్రమాదానికి కారణమని చీఫ్ డిప్యూటీ కరోనర్ మైక్ ఎల్లిస్ మీడియాకు వెల్లడించారు. కారు ముక్కలైన తీరు చెట్టుపై కారు ఇరుక్కున్న వైనం వేగానికి అద్దం పడుతోందని తెలిపారు. కారులోని క్రాష్ డిటెక్షన్ సిస్టమ్ ఇతర కుటుంబ సభ్యులకు అలర్ట్ పంపింది. దీంతో వారు సౌత్ కరోలినాలోని స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. సౌత్ కరోలినా హైవే పెట్రోల్, గాంట్ ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలు, దితర అత్యవసర ప్రతిస్పందన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
బాబు కుట్రలు..పెన్షన్ కష్టాలు
T20 WC జట్టులో నో ఛాన్స్.. రింకూతో రోహిత్ సీరియస్ డిస్కషన్
అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్
వాళ్లే కావాలని ఎఫైర్స్ అంటగట్టేవారు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
భయపడకు.. పారిపోకు: రాహుల్‌పై ప్రధాని మోదీ సెటైర్లు
తప్పక చదవండి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్‌పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
- ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
- SRH: వాళ్లిద్దరు అద్భుతం.. నితీశ్‌రెడ్డి సూపర్: కమిన్స్
- టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్‌గా మారా: స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ
- దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
Advertisement