-
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
పెళ్లిళ్లకు సంబంధించి ఒక్కోదేశంలో ఒక్కో ఆచారం, సాంప్రదాయం పాటిస్తారు. వీటిల్లో కొన్ని మన భారతీయ సాంప్రదాయాలను పోలి ఉంటాయి. మరికొన్ని భిన్నంగా ఉంటాయి. భారతదేశంలో కొన్ని ఆచారాల ప్రకారం అత్తవారింట అడుగు పెట్టిన నవవధువు పాయసం చేసి అత్తింటి వారి నోటిని తీపి చేస్తుంది కదా. కానీ జాంబియాలో పెళ్లికి ముందే వధువు అత్తింటి వారిని మెప్పించాలి. అలాంటి ఇంట్రస్టింగ్ ఆచారాన్ని గురించి తెలుసుకుందాం. జాంబియాలోని బెంబా తెగలో ప్రీవెడ్డింగ్ వేడుకలో భాగంగా వధువు, వధువు తరపు కుటుంబం రకరకాల వంటలను తయారు చేస్తుంది వరుడు కుటంబం కోసం. దీన్నే ఇచిలంగా ములి (అగ్నిని చూపడం) అంటారు. పెళ్లికొడుకు గౌరవార్థం జరిగే సాంప్రదాయ ఆహార వేడుక. ఈ వేడుకలో వధువు కుటుంబం వరుడికి విందు భోజనం వడ్డిస్తుంది. ఇక్కడ వధువు తన పాక నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది. అలాగే భవిష్యత్తులో వధువు కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి వరుడికి బహిరంగ ఆహ్వానంగా కూడా భావిస్తారు.This is a tradition in Zambia. New Bride must cook different types of native meals for her in-laws and show them what their son will be eating before they can accept her. So what will the groom do?pic.twitter.com/2fy4f1Rco0— Figen (@TheFigen_) May 6, 2024న్షిమా: మొక్కజొన్న లేదా మొక్కజొన్నతో తయారు చేసి గంజి లాంటి ఆహారాన్ని తయారు చేసి, చికెన్, ఇతర కూరగాయలతో వడ్డిస్తారు. ఈ విందుకోసం సుమారు 40కి పైగా జాంబియన్ వంటకాలు సిద్దం చేస్తారట. ఇది జాంబియన్ సంస్కృతిలో ఆహారం, ఆతిథ్యం ప్రాముఖ్యతను వెల్లడిస్తుంది. అలాగే పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయిని చూడ్డానికి వెళ్లడం,మధ్య వర్తి రాయ‘బేరా’లు కూడా ఉంటాయి. అలాగే సంతానోత్పత్తికి ప్రతీకగా అమ్మాయి తరపు కుటుంబానికి ఒక గిఫ్ట్‌ను తీసుకొస్తారు. ముఖ్యంగా నిశ్చితార్థం సూచికగా అబ్బాయి, అమ్మాయికి పూసలు, డబ్బులు కానుకగా ఇస్తాడు. ఆ తరువాత ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుంటారు. -
'పుదీనా'తో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో? మీకు తెలుసా!
ప్రకృతి ప్రసాదించిన, తాజాదనాన్ని ఇచ్చే ఎన్నో ఆరోగ్య సుగుణాలు ఉన్న ఆకు పుదీనా. దీనిని నిత్యం ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవిలో పుదీనా వాడకం మరింత ప్రయోజనకరం.పుదీనా ఆకులలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి–6 లతోపాటు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్, ్రపోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండడంతో ఇది మన జీవక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ పుదీనా వాటర్ తీసుకుంటే చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. బరువు తగ్గడానికి, ముసలితనం త్వరగా రాకుండా ఉండడానికి పుదీనా ఎంతో ఉపయోగపడుతుంది.పుదీనా నీటిని తాగితే శరీరానికి శక్తి లభించడమే కాకుండా చర్మ సమస్య లు తగ్గుతాయి. కళ్ళ కింద నలుపు తగ్గటానికి పుదీనాతో తయారు చేసిన లేపనం ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలోని మలినాలను తొలగించి జీర్ణక్రియను సాఫీగా చేయడానికి, జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేయడానికి ఉపయోగపడుతుంది. çపుదీనాను మజ్జిగతో కలిపి తీసుకుంటే మన శరీరంలో వేడి తగ్గుతుంది.అందానికి కూడా!పుదీనా ఆకులను మెత్తగా నూరి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా ప్రకాశవంతంగా మారుతుంది. మన అందాన్ని పెంచటంలో కూడా పుదీనాది ప్రత్యేక స్థానం. చర్మ సమస్యలను నివారిస్తుంది. మొటిమలను, మచ్చలను తగ్గించడంలో పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది. దంత సమస్యలను, చిగుళ్ల సమస్యలను తగ్గిస్తుంది. నోటి దుర్వాసనకు చెక్ పెట్టి, దంతాలను తెల్లగా మెరిసేలా చేస్తుంది. ఉదయాన్నే నిమ్మరసం, తేనె, పుదీనా కలిపి తీసుకుంటే ఆరోగ్యాన్ని అది బాగు చేస్తుంది.పుదీనాతో ఉత్సాహం..వేసవిలో అధిక దాహం, అలసట సర్వ సాధారణం. అధిక దాహం సమస్యకు చెక్ పెట్టడానికి పుదీనా వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, అలసటగా ఉన్నప్పుడు పుదీనా వాటర్‌లో కాస్తంత నిమ్మరసం, పటికబెల్లం లేదా చిటికడు బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగితే అలసట ఇట్టే తీరుతుంది.ఇవి చదవండి: ఆరోగ్యం విషయంలో.. ఇలా ప్రవర్తిస్తున్నారా? జాగ్రత్త! -
‘భారత ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు..’
భారత బ్రాండ్లైన ఎవరెస్ట్, ఎండీహెచ్ ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్యాన్సర్ కారకం ఉందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఈఎఫ్ఎస్ఏ) గుర్తించింది. దాంతో హాంకాంగ్, సింగపూర్‌ల్లో వాటి ఉత్పత్తులపై నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే 2020 సెప్టెంబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్యకాలంలో ఇండియాలో తయారైన దాదాపు 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్‌కు దారితేసే కారకాలు ఉన్నట్లు రాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ (ఆర్‌ఏఎస్‌ఎఫ్‌ఎఫ్) డేటా ప్రకారం నిర్ధారణ అయినట్లు ఈఎఫ్ఎస్ఏ అధికారులు తెలిపారు.ఈ 527 ఉత్పత్తుల్లో ఇప్పటికే 87 సరుకులను ఇతర దేశాలు తిరస్కరించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే వీటిలో 332 ఉత్పత్తుల్లో భారత్‌లోనే తయారైన హానికర రసాయనాలను వినియోగించినల్లు తేలింది. కానీ మిగతావాటిలో వాడిన రసయనాలు ఎక్కడివో తెలియాల్సి ఉంది. ఇథిలీన్ ఆక్సైడ్ వాస్తవానికి వైద్య పరికరాలపై క్రిములను చంపడానికి, వాటిని శుభ్రం చేయడానికి వాడుతారు. పురుగుమందు, స్టెరిలైజింగ్ ఏజెంట్‌గా వినియోగిస్తారు. దీన్ని ఆహార ఉత్పత్తుల్లో వాడడంతో లింఫోమా, లుకేమియా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది.ఇదీ చదవండి: హార్లిక్స్ లేబుల్ తొలగింపు.. కారణం ఇదేనా..రామయ్య అడ్వాన్స్డ్ టెస్టింగ్ ల్యాబ్స్‌లోని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న జుబిన్ జార్జ్ జోసెఫ్ ఇథిలీన్ ఆక్సైడ్ ఉప ఉత్పత్తుల వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలిపారు. ఇథిలీన్ ఆక్సైడ్ ఉప ఉత్పత్తి అయిన ఇథిలీన్ గ్లైకాల్ చాలా ప్రమాదమని చెప్పారు. దీన్ని గతంలో దగ్గు సిరప్‌ల్లో వాడడం వల్ల ఆఫ్రికాలో మరణాలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికే ఇథిలీన్ ఆక్సైడ్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకున్న వారికి గామా కిరణాలతో చికిత్స అందించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థలు అధ్యయనాలు నిర్వహించాలని కోరారు. -
మూడు మామిడి పండ్లే తిన్నా.. ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ వాదన
న్యూఢిల్లీ: జైలులో తాను తీసుకుంటున్న ఆహారాన్ని ఈడీ రాజకీయం చేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. డయాబెటిస్ బాధితుడినైన తనకు జైలులో ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ రౌస్అవెన్యూ కోర్టులో శుక్రవారం వాదనలు కొనసాగాయి. మెడికల్ బెయిల్ పొందడానికి లేదా చికిత్స పేరిట ఆసుపత్రిలో చేరడానికి వీలుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుకోవడానికి కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ గురువారం కోర్టు దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ వాదనపై కేజ్రీవాల్ శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జైలులో ఉన్న తనకు ఇప్పటిదాకా 48 సార్లు ఇంటి నుంచి భోజనం పంపగా, కేవలం మూడుసార్లు మాత్రమే మామిడిపండ్లు తిన్నానని కేజ్రీవాల్ తెలిపారు. కేవలం ఒకే ఒక్కసారి ఆలూ పూరీ తీసుకున్నానని, అది కూడా నవరాత్రి ప్రసాదంగా స్వీకరించానని కోర్టుకు తెలియజేశారు. వైట్ రైస్, బ్రౌన్ రైస్ కంటే మామిడి పండ్లలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. షుగర్ లేని స్వీట్లు ఆరుసార్లు తిన్నానని, షుగర్ లేకుండా టీ తాగుతున్నానని వెల్లడించారు. తనకు చికిత్స అందించే రెగ్యులర్ వైద్యుడు సూచించిన డైట్ చార్ట్ ప్రకారమే ఆహారం తీసుకుంటున్నానని వివరించారు. ప్రతిరోజూ 15 నిమిషాలపాటు డాక్టర్‌ను సంప్రదించడానికి అనుమతి ఇవ్వాలంటూ శుక్రవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇన్సులిన్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. -
Burger Idli Video: బర్గర్ ఇడ్లీ ట్రై చేశారా? డెడ్లీ బ్రో..వీడియో వైరల్
దక్షిణ భారతదేశంలో బాగా పాపులర్ అయిన బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ. ఘీ ఇడ్లీ, కారం ఇడ్లీ, సాంబారు ఇడ్లీ ఇలా రక రకాలుగా ఆరంగించేస్తాం. అలాగే పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ, శెనగపిండి చట్నీ, కారొప్పొడి నెయ్యితో కొబ్బరి చట్నీ ఇలా ఏదో ఒక కాంబినేషన్‌తో ఇడ్లీతింటే ఆ రుచే వేరు కదా. అయితే బర్గర్ ఎపుడైనా టేస్ట్ చేశారా? ఓ వ్యక్తి బర్గర్లా ఇడ్లీని తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (జిమ్‌లో వర్కౌట్ : క్రేజీ హీరోయిన్ ఫన్నీ వీడియో వైరల్ ) ఈ వీడియోలో, పెద్ద ఇడ్లీనితయారుచేసి, దీన్ని రెండు భాగాలుగా అడ్డంగా కోశాడు. ఆ తర్వాత పెనం మీద నెయ్యిని చిలకరించి తరువాత కట్ చేసి పెట్టిన ఇడ్లీ భాగాలు రెండింటినీ పెట్టాడు. ఇందులో ఒకదానిపై స్కెజ్వాన్ సాస్, మయోన్నైస్ , టొమాటో గ్రీన్ చట్నీ,మసాలా దినుసులు ఒకదాని తరువాత ఒకటి వేశాడు. ఆ తరువాత బర్గర్ ఇడ్లీకి ఫిల్లింగ్‌గా ఉల్లిపాయలు, టమోటాలు, క్యాప్సికమ్, బీట్రూట్, తురిమిన చీజ్, క్యారెట్లు తురుము వేశాడు. మళ్లీ చీజ్ తురిమి, ఆ తరువాత రెండు ఇడ్లీని పైన అమర్చి, గ్రీన్ చట్నీ, కొబ్బరి చట్నీ , మయోనైస్ జోడించాడు. చివరికి ప్లేట్లో బర్గర్ ఇడ్లీని, వేడి సాంబార్ గిన్నెతో పాటు కొబ్బరి, టొమాటో, గ్రీన్ చట్నీని అందించాడు. దీంతో నెటిజన్లు నెగిటివ్‌గా స్పందించారు. ‘సర్వనాశనం’ అంటూ ఇడ్లీ ప్రేమికులు బాధపడగా, డేంజరస్ ఇంగ్రీడియంట్స్ ... డెడ్లీ డిష్ అంటూ కొంతమంది వ్యాఖ్యానించారు. అంతేకాదు అంతే చీజ్ వేస్తున్నాడు..ఉపా కేసుకింది అరెస్టు చేసి శిక్ష విధించాలి అంటూ ఫన్నీ కామెంట్ చేయడం గమనార్హం. (రద్దీ బస్సులో బికినీలో అమ్మడు : ఒక్కసారిగా షాకైన జనం) Idli Burger 😭😭😭 Idli ki MC BC 😭😭 Part 1 pic.twitter.com/a8H9lDwmBM — MG 🇮🇳 (Modi Ka Parivar) (@mgnayak5) March 29, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్‌టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్‌తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
తప్పక చదవండి
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement