-
కొత్త ఎక్సీడ్ లగ్జరీ స్పోర్ట్స్‌కారు.. అదిరిపోయే ఫొటోలు
-
మస్క్‌కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
తన సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల మ్యాపింగ్, నావిగేషన్ ఫంక్షన్ల కోసం చైనా అతిపెద్ద సెర్చింజిన్ బైదూతో ప్రముఖ ఈవీ దిగ్గజం టెస్లా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో చైనాలో టెస్లా లేటెస్ట్ డ్రైవింగ్ ఫీచర్లను పరిచయం చేయడానికి కీలకమైన అడ్డంకిని తొలగించుకోబోతుందని తెలుస్తోంది. ఫలితంగా టెస్లా స్టాక్ ధర 10 శాతానికి పైగా పెరిగింది.బైదూ అందించే టాప్ లేన్ లెవల్ నావిగేషన్, మ్యాపింగ్ ఆధారంగా టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల సేవలను అందుబాటులోకి తెచ్చే సౌలభ్యం కలగనుందని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కాగా, టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థ ఇప్పటి వరకు చైనాలో అందుబాటులో లేదు. దీన్ని అక్కడ ప్రవేశపెట్టేలా చైనా ప్రభుత్వ వర్గాలతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో చైనా కస్టమర్లకు సంబంధించిన డేటాను దేశం వెలుపలికి తీసుకెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో చైనా వెలుపలికి డేటాను బదిలీ చేసే అంశంపై కూడా మస్క్ ప్రభుత్వంతో చర్చించారు. -
భారత పర్యటన రద్దు.. అకస్మాత్తుగా చైనాలో ప్రత్యక్షమైన మస్క్
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ చైనాలో ప్రత్యక్షమయ్యారు. గత కొంత కాలంగా మస్క్ సారథ్యంలోని టెస్లా భారత్‌లో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుందని, ఇందుకోసం మస్క్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.కేంద్రం సైతం మస్క్ ఏప్రిల్ నెల 21, 22 తేదీలలో వస్తున్నారంటూ సూచనప్రాయంగా తెలిపింది. కానీ పలు అన్వేక కారణాల వల్ల భేటీ రద్దయింది. అయితే ఈ నేపథ్యంలో టెస్లా సీఈఓ తన ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (ఎఫ్ఎస్డీ)కార్లలోని సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేసేందుకు,ఎఫ్ఎస్డీ అల్గారిథమ్‌లకు శిక్షణ ఇవ్వడానికి దేశంలో సేకరించిన డేటాను విదేశాలకు బదిలీ చేసేందుకు కావాల్సిన అనుమతులను పొందేందుకు బీజింగ్‌లోని చైనా అధికారులతో భేటీ కానున్నారు.మరోవైపు ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై ఎక్స్‌లో చర్చ మొదలైంది.దీనిపై మస్క్ స్పందిస్తూ అతి త్వరలో డ్రాగన్ కంట్రీలో ఎఫ్ఎస్డీ కార్లు అందుబాటులోకి రానుందని తెలిపారు. -
ఒకసారి ఛార్జ్‌చేస్తే 516 కి.మీ వెళ్లేలా కొత్త ఈవీ
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత విపణిలో కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ సెడాన్ ఐ5 మోడల్‌ను తాజాగా తన వినియోగదారులకు పరిచయం చేసింది. సెడాన్ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన కార్లలో తొలి ఎలక్ట్రిక్ మోడల్ ఇదేనని కంపెనీ వర్గాలు తెలిపాయి.సింగిల్ ఛార్జింగ్‌తో 516 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారు ధర రూ.1.20 కోట్లుగా నిర్ణయించినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. కేవలం 3.8 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెప్పింది. ఇది గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని తెలిసింది. 83.9కిలోవాల్ హవర్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ కారు కేవలం అరగంటలోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ అవనుంది. -
ఈవీ రూ.10 లక్షల లోపయితే ఓకే
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న వాయు కాలుష్యం..మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ 2023లో రూ.16,675 కోట్లు ఉండగా..2025 నాటికి రూ. 62,532 కోట్లకు చేరే అవకాశముంది. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ప్రోత్సహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్ల విషయంలో వాహనదారులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నట్టు లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న వారి అభిప్రాయాల్లో మెజారిటీ వ్యక్తులు రూ.8 నుంచి రూ.10 లక్షలలోపు ధర ఉంటే ఎలక్ట్రిక్ కారు కొనుగోలు సులువు అవుతుందనే అభిప్రాయపడ్డారు. ► పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తాము ఎలక్ట్రిక్ కారు కొనాలని భావిస్తున్నట్టు 44 శాతం మంది చెప్పారు. ►పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకు 31% మంది ఎలక్ట్రిక్ వాహనాలకు మారేందుకు ప్రయతి్నస్తున్నట్టు తెలిపారు. ►2023లో మనదేశంలో 72,321 ఎలక్ట్రిక్ కార్లు రిజిస్టర్ అయ్యాయి. లోకల్ సర్కిల్స్ సర్వేలో పాల్గొన్న వారిలో 5 శాతం మంది ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ఆసక్తి చూపారు. ఈ లెక్క ప్రకారం 2024లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ 2,00,000కు చేరే అవకాశముంది. ►ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు సంబంధించి దేశవ్యాప్తంగా 319 జిల్లాల్లో లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో 40 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ►తెలంగాణలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలపైనే ప్రస్తుతం రిజి్రస్టేషన్ జీవితకాలపు ఫీజు రాయితీ ఉండగా, ఏపీలో కార్లు, జీపులపై కూడా రిజి్రస్టేషన్ ఫీజు పూర్తిగా రాయితీ ఇస్తున్నట్టు అధికారవర్గాల సమాచారం. ఎలక్ట్రిక్ కారు కొనాలనుకోవడానికి కారణం? ► పర్యావరణ హితంగా ఉండాలని.. 44% ►పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను తట్టుకునేందుకు 31% ►తక్కువ ధరలు 15% ►ఇతర కారణాలు 5% ►చెప్పలేం 5% ఎలక్ట్రిక్ కారు కొనకపోవడానికి కారణాలు ? ►సాధారణ కార్లతో పోలిస్తే అధిక ధర 21 శాతం ►మా ప్రాంతంలో సరిపడా చార్జింగ్ స్టేషన్లు లేకపోవడం 21 శాతం ►ఎలక్ట్రిక్ కార్ల గురించి అవగాహన లేదు 12 శాతం ►ఈ సమయంలో కారు కొనాలనుకోవడం లేదు 26 శాతం ►నా బడ్జెట్‌కు తగిన మోడల్స్ ఈవీలో లేవు 7 శాతం ►ఇతర కారణాలు, కొనేంత డబ్బు లేదు 8 శాతం ►ఇది నాకు వర్తించదు 5 శాతం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
ఆ హీరోయిన్ నన్ను మునిగిపోకుండా కాపాడింది: టాలీవుడ్ హీరో
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- రాయ్‌బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
- పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన నటి
- Hassan sex scandal: రాజుకుంటున్న పెన్‌డ్రైవ్
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ..!
- స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్‌తో భార్య సర్ప్రైజ్
- కార్మిక సోదరులకు సీఎం జగన్ మే డే శుభాకాంక్షలు
- టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్
Advertisement