-
స్టార్ హీరో ఇంటికెళ్లిన సీఎం.. !
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కలిశారు. కాల్పుల ఘటనపై ఆయనను కలిసి ఆరా తీశారు. సల్మాన్ ఖాన్ ఇంటికెళ్లిన ముఖ్యమంత్రి భద్రతా గురించి అడిగి తెలుసుకున్నారు. ఫైరింగ్ ఘటనపై పోలీసుల తీసుకున్న చర్యలపై సల్మాన్‌తో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈనెల 14న కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ముంబైలోని సల్మాన్ గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కాల్పుల ఘటనలో విక్కీ గుప్తా(24), సాగర్ పాల్ (21) నిందితులుగా గుర్తించిన ముంబై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌లోని భుజ్‌లో వారిద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ కాల్పులు జరిపింది తామేనని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. #WATCH | Mumbai: Maharashtra CM Eknath Shinde arrived at the residence of actor Salman Khan. pic.twitter.com/ncJUz4n6C9 — ANI (@ANI) April 16, 2024 #WATCH | Mumbai | Maharashtra CM Eknath Shinde met actor Salman Khan at his residence. Inside visuals from the residence. (Source: Eknath Shinde office) pic.twitter.com/lbMmfCOBNm — ANI (@ANI) April 16, 2024 -
బీజేపీ కూటమి.. ఆ ఆరు స్థానాల్లో ఎవరు?
లోక్‌సభ ఎన్నికల మొదటిదశ పోలింగ్ మరో నాలుగు రోజులున్నా.. ఇంకా మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో మరో ఆరు సీట్ల అభ్యర్థుల కేటాయింపు పెండింగ్‌లో ఉంది. ఆ ఆరు కీలక స్థానాల్లో మహాయుతి కూటమి పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఏ సీట్లు ఇవ్వాలో నిర్ణయం తీసుకోలేకపోతోందని పార్టీల్లో తీవ్ర చర్చ జరగుతోంది. ఇవే ఆ ఆరు స్థానాలు.. దక్షిణ ముంబై, థానే, పాల్ఘర్, రత్నగిరి-సింధుదుర్గ్ సీటు, నాసిక్ ఔరంగాబాద్. నాసిక్ సీటులో ఎన్సీపీ( అజిత్ పవార్) పార్టీ తరఫున మాజీ మంత్రి ఛగన్ భుజబల్‌ను ప్రతిపాధించగా.. సీఎం ఏక్నాథ్ షిండే(శివసేన) ఆ స్థానాన్ని వదులకోవడానికి సిద్ధం లేనట్టు తెలుస్తోంది. నాసిక్ స్థానం శిశసేన సిట్టంగ్ స్థానం. అక్కడ ఎంపీగా హేమంత్ గాడ్సే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఔరంగాబాద్ నుంచి బీజేపీ ఎంపీ పార్లమెంట్లో అడుగుపెడతారని ఇటీవల కేంద్రహోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం పార్టీ కార్యకర్తల మీటింగ్ మాట్లాడుతూ.. ఔరంగాబాద్ నుంచి శివసేన అభ్యర్థి బరిలోకి దిగుతారని వ్యాఖ్యానించటం గమనార్హం. థానే, రత్నగిరి-సింద్‌దుర్గ్ రెండు స్థానాల్లో బీజేపీనే పోటీ చేయాలని భావించినప్పటికీ.. తర్వాత తన ఆలోచనను విరమించుకొని థానే సీటును శివసేన( షిండే)కు కేటాయించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉమ్మడి శివసేన అభ్యర్థిగా 2019లో రాజన్ విచారే గెలుపొందారు. శివసేన పార్టీ చీలిన తర్వాత ఆయన ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో ఉన్నారు. అయితే శివసేనకు కంచుకోట అయిన థానే స్థానాన్ని షిండే వదలుకుకోవడాని సిద్ధంగా లేరని సమాచారం. అయితే థానేకు బదులు రత్నగిరి-సింద్దుర్గ్ను శివసేన బీజేపీకి ఇవ్వడానికి ఆసక్తి చూపుతోంది. ఇక ఈ స్థానంలో బీజేపీ నారాయణ రాణేను బరిలోకి దించాలని యోచిస్తోంది. పాల్ఘర్ స్థానం బీజేపీ దక్కే అవకాశం ఉంది. 2019లో శివసేన గెలిచే వరకు పాల్ఘర్ బీజేపీ పట్టున్న స్థానం. ఇప్పటికే పలు స్థానాలను వదులుకున్న శవసేన.. సౌత్ ముంబై స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధం లేదు. సీఎం షిండే శివసేన మొదట్లో ముంబైలో మొత్తం 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ అందులో ఇద్దరిని మార్పు చేశారు. నాలుగురికి టికెట్ తిరస్కరించింది. సీట్ల విషయంలో శివసేన ఒత్తిడిలో ఉన్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శివసేనకు బలం ఉన్న ముంబై, ఇతర సీట్లను వదులుకోవడాని సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈసారి సౌత్ ముంబై, థానే, రత్నగిరి సింద్‌దుర్గ్, నాసిక్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు బీజేపీ భావిస్తోంది. అయితే శివసేన ఈ సీట్లను వదులుపోవడానికి సిద్ధంగా లేదు. ఒకట్రెండు రోజుల్లో ఈ సిట్లలో ఎవరికి దక్కుతాయో కొలిక్కి రానుంది. ఇక.. అజిత్ పవార్ ఎన్సీపీ ఆశిస్తున్న నాసిక్ సీటు సైతం షిండే(శివసేన) దక్కించుకోనున్నట్లు సమాచారం.థానే సీటును ఏక్నాథ్ షిండే దక్కించుకునే అవకాశం ఉందని.. రత్నగిరి-సింధుదుర్గ్ సీటు బీజేపీకి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. -
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్.. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ అవుట్
ముంబై: హారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను లోక్‌సభ ఎన్నికలకు తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి బీజేపీ తొలగించింది. తమ పార్టీకి చెందిన నేతలు మాత్రమే స్టార్ క్యాంపెయినర్లుగా ఉండాలని, ఇతర పార్టీ నేతలు అవకాశం లేదంటూ మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాసిన లేఖ కారణంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. శివసేన, మహారాష్ట్ర బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఇతర పార్టీల నేతలు ఉన్నారు. శివసేన లిస్ట్‌లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు స్టార్ క్యాంపెయినర్లుగా ఉండగా.. రాష్ట్ర బీజేపీ జాబితాలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఉన్నారు. అయితే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు సీఈసీ లేఖ రాశారు. అదే పార్టీకి చెందిన వాళ్లే స్టార్ క్యాంపెయినర్లుగా ఉండాలని చెబుతూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950ని ఉదహరించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 40 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా పేర్కొంటూ సవరించిన జాబితాను బీజేపీ భారత ఎన్నికల సంఘానికి సమర్పించింది. చదవండి: దేశ రాజకీయాల్లో సంచలనం.. ఈ 26 ఏళ్ల కుర్రాడు! -
అందుకే ఉద్ధవ్‌కు రెబల్‌గా మారా: సీఎం ఏక్నాథ్ షిండే
నాగ్‌పూర్: బాలా సాహేబ్ ఠాక్రే స్థాపించిన శివసేనలో ఏక్నాథ్ షిండే రెబల్ నేతగా మారి.. బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. తాను ఉద్ధవ్ ఠాక్రేకు రెబల్ నేతగా మారడానికి గల కారణాన్ని సీఎం ఏక్నాథ్ షిండే వివరించారు. ఆదివారం పార్టీ కార్యకర్తల మీటింగ్‌లో సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదు. కానీ, శివసేన పార్టీలో బాలా సాహేబ్ ఠాక్రే సిద్ధాంతాలకు రాజీపడటం వల్లే ఉద్ధవ్ ఠాక్రేకు రెబల్‌గా మారాను. బాల సాహేబ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలను ఎప్పుడూ స్నేహితుల్లా భావించేవారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే మాత్రం పార్టీ కార్యకర్తలను పని మనుషులుగా చూశారు’ అని సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. బలమైన నేతగా ఎదగాలంటే క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలతో కలిసి పని చేయాలన్నారు. ఇంట్లో కూర్చుంటే గొప్ప నేతగా ఎదగలేమని ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యేందుకు అధికారంలో ఉన్న పార్టీకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. అదేవిధంగా ప్రతిపక్ష మహావికాస్ ఆఘాఢీకి అభివృద్ది చేయాలనే అజెండా లేదని అన్నారు. అధికార కూటమిలోని ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం రెండు, మూడు రోజుల్లో కొలిక్కి వస్తుందన్నారు. అలాగే విదర్భలోని అన్ని సీట్లను అధికార కూటమి కైవసం చేసుకుంటుందని సీఎం షిండే తెలిపారు. ఇక.. 2022 జూన్‌లో పలువురు రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే శివసేనలో చీలిక తెచ్చి బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. అసలు శివసేన పార్టీ ఎవరిదని శివసేన చీలిక వర్గాలు పిటిషన్లు వేయగా.. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
‘కళ్యాణ్’ స్థానంలో మళ్లీ సీఎం కుమారుడే పోటీ
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో కళ్యాణ్ నియోజకవర్గంలో ఎట్టకేలకు సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు సిట్టింగ్ ఎంపీ శ్రీకాంత్ షిండే మరోసారి బరిలో దిగనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ శనివారం ప్రకటించారు. కళ్యాణ్ పార్లమెంట్ స్థానంలో శ్రీకాంత్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ నేతలు వ్యతిరేకించారు. అయితే ఇవాళ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్వయంగా కళ్యాణ్ స్థానంలో శ్రీకాంత్ షిండే పోటీ చేస్తారని ప్రకటించటం ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో శ్రీకాంత్ షిండే గెలుపు కోసం బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. నాగ్‌పూల్‌లో బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సం సందర్భంగా ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడారు. ‘కళ్యాణ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మళ్లీ శ్రీకాంత్ షిండే బరిలో దిగుతున్నారు. ఆయన్ను ఓడించేందుకు తమకూటమకి ప్రతిపక్షమే లేదు. కళ్యాణ్ స్థానంలో శవసేన (ఏక్నాథ్ షిండే) పార్టీ బరిలోకి దిగుతుంది. అభ్యర్థిగా ఏక్నాథ్ షిండే కుమారుడు సిట్టింగ్ ఎంపీ శ్రీకాంత్ షిండే పోటీ చేస్తారు’ అని దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. శ్రీకాంత్ షిండే.. ఇప్పటికే కళ్యాణ్ పార్లమెంట్ స్థానంలో రెండుసార్లు (2014, 2019) పోటిచేసి విజయం సాధించారు. ఇక.. ఇప్పటికే ‘జ్వలించే టార్చ్’ గుర్తును సొంతం చేసుకున్న శివసేన (యూబీటీ) ఇప్పటికే 21 స్థానాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అదే వింధంగా షిండే వర్గం 9 స్థానాలు, బీజేపీ 24 స్థానాలు, ఎన్సీపీ( అజిత్ పవార్)- 4, రాష్ట్రీయా సమాజ్ పక్షా-1 ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కూటమి మరో 10 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి మే 20 పోలింగ్ జరిగి.. జూన్ 4ను ఫలితాలు విడుదల కాన్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
Lok sabha elections 2024: లాలూ వర్సెస్ రోహిణి!
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక
వేడుకునేది ఓటర్ని కాదు! సూర్యుడ్ని!!
సాంఘిక విప్లవ నాయకుడు
Association for Democratic Reforms: మూడో విడతలో... మహిళలు 9 శాతమే
ఆనందంతో డైరెక్టర్ని హత్తుకున్నాను: సుహాస్
జాలీ రైడ్
జయరాం.. రాం!
ఆ ఒక్కటీ అడక్కు చూసి నవ్వుకుందాం: అడివి శేష్
Lok sabha elections 2024: మూడో దశలో మహా ఫైట్
తప్పక చదవండి
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్‌గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్‌కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్‌కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
Advertisement