-
Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు!
నమితా దుబే.. చాలామంది నటీమణుల్లాగానే ఆమే మోడలింగ్ నుంచి నటనవైపు మళ్లింది. స్మాల్ అండ్ సిల్వర్ స్క్రీన్స్ మీద వచ్చిన గుర్తింపుతో ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీద అవకాశాలను అందుకుంటోంది. తన హావభావాలతో వీక్షకులను అలరిస్తోంది.నమితా పుట్టిపెరిగింది లక్నోలో. వాళ్ల నాన్న వినయ్ప్రియ్ దుబే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. నమితా.. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో బిఏ ఇంగ్లిష్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. తర్వాత ముంబై వెళ్లి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో సోషల్ వర్క్‌లో పీజీ చేసింది.చదువైపోయాక ‘వరల్డ్ వెల్ఫేర్ చిల్డ్రన్ ట్రస్ట్’లో కొన్నాళ్లు, ‘సలామ్ బాలక్ ట్రస్ట్’లో కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. ఆ సమయంలోనే మోడలింగ్ చాన్స్ వచ్చింది. ఒక యాడ్‌లో అయిదు నిమిషాలు నటించినందుకు 20 వేల పారితోషికం అందుకుంది. అది ఆమెకు తన కెరీర్‌నే యాక్టింగ్ ఫీల్డ్కి షిఫ్ట్ చేసుకునేంత ఉత్సాహాన్నిచ్చింది.నటనారంగంలో కొనసాగేముందు తన అభినయ కళకు మెరుగులు దిద్దుకోవాలనుకుని ‘జెఫ్ గోల్డెన్‌బర్గ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్’లో చేరింది. ట్రైన్డ్ యాక్ట్రెస్‌గా బిందాస్ చానెల్ సీరియల్ ‘యే హై ఆషిరీ’తో స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. అందులోని ‘రాధిక’రోల్‌తో ఆమె పాపులర్ అయింది. అది ఆమెకు సోనీ, కలర్స్ లాంటి ఇతర టాప్ చానెల్స్‌లో అవకాశాలను తెచ్చిపెట్టింది.టీవీ గుర్తింపు నమితాకు సినిమా చాన్స్‌నూ ఇచ్చింది.. ‘మై తేరా హీరో’లో. అందులో ఆమె చేసింది చిన్న పాత్రే అయినా బాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టిలో పడేలా చేసింది. తత్ఫలితం.. అలంకృత శ్రీవాస్తవ దర్శకత్వం వహించిన లేడీ ఓరియెంటెండ్ మూవీ ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’లో మంచి పాత్ర దక్కడం. ఇలా టీవీ సీరియల్స్, సినిమాలతో బిజీగా ఉంటున్న సమయంలోనే ‘యాస్పిరెంట్స్’ అనే సిరీస్‌తో ఓటీటీలోనూ నటించే ఆపర్చునిటీ వచ్చింది. ఆ వెబ్ సిరీస్ ఎంత ఫేమస్ అయిందో.. అందులోని ‘ధైర్య’ భూమికతో ఆమే అంతే ఫేమస్ అయ్యి ఓటీటీ వీక్షకుల అభిమాన నటిగా మారిపోయింది. "ఇంపార్టెంట్ రోల్ దొరికితే చాలు.. అది సీరియలా.. సిరీసా.. సినిమానా అని చూడను. నాకు తెలిసి నిజమైన యాక్టర్స్ ఎవరైనా తమ పాత్ర గురించి ఆలోచిస్తారు తప్ప దాన్ని ప్రదర్శించే వేదిక గురించి కాదు!" – నమితా దుబే -
Nidhi Bhist: మెయిన్ రోల్స్.. ప్చ్.. కష్టమే..! కానీ ఇప్పుడు నిధి ద బెస్ట్!!
‘జాబ్ కన్నా యాక్టింగ్ మీద ప్యాషన్ ఉన్నట్టుంది. షారూఖ్ ఖాన్‌తో కలసి స్క్రీన్ మీద కనిపిస్తావన్నమాట’ అంటూ బాస్ ఎగతాళి చేశాడు. ‘గుండ్రటి మొహం.. అక్క, వదిన, పిన్ని పాత్రలకైతే పనికొస్తావ్. మెయిన్ రోల్స్.. ప్చ్.. కష్టమే!’ అని బాలీవుడ్ రిజెక్ట్ చేసింది. ఆమె ఇప్పుడు వండర్ఫుల్ యాక్ట్రెస్, రైటర్ అండ్ డైరెక్టర్‌గా సినిమా ప్రేక్షకుల, వెబ్ వీక్షకుల మన్ననలందుకుంటోంది. అన్నట్టు షారూఖ్ ఖాన్‌తోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ బహుముఖ ప్రజ్ఞ పేరు.. నిధి బిష్ట్! ► ఢిల్లీలో పుట్టి, పెరిగింది. అమ్మ.. టీచర్. నాన్న.. ఐపీఎస్ ఆఫీసర్. ఆ ఇద్దరూ తమ కూతురు డాక్టర్ కావాలని కలలు కన్నారు. వాళ్ల కోరిక మేరకు ఇంటర్లో బైపీసీలో జాయిన్ అయింది నిధి. కానీ రెండు రోజులకే అది తన నోట్స్ ఆఫ్ స్టడీ కాదనుకుంది. దాంతో కామర్స్ గ్రూప్‌కి మారింది. అదీ తనకు సరిపడదని గ్రహించి ఆ వెంటనే హ్యుమానిటీస్లోకి వెళ్లి సెట్ అయింది.► ఇంటర్ తర్వాత .. జామియా మిలియా యూనివర్సిటీలో లా చేసింది. అక్కడ థియేటర్ వింగ్ ఇప్టా (ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్) చాలా యాక్టివ్. చిన్నప్పటి నుంచీ నిధికి నటనంటే ప్రాణం. అందుకే ‘లా’ కోసం ఆ యూనివర్సిటీని ఎంచుకుంది. తన అయిదేళ్ల లా కోర్స్‌లో ఇప్టాతోనే ఎక్కువ గడపింది నాటకాలు రాస్తూ.. వేస్తూ! ఆ ఆసక్తి, ఉత్సాహంతోనే లా అయిపోగానే పుణె వెళ్లింది అక్కడి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవడానికి. కానీ అందులో సీట్ రాలేదు. నిరాశతో మళ్లీ ఢిల్లీకి వచ్చేసి ఒక లా ఫర్మ్‌లో చేరింది.► ఉద్యోగం చేస్తున్నప్పుడే ఒక నాటకంలో నటించే అవకాశం వచ్చింది నిధికి. ఉదయం 9 కల్లా ఆఫీస్‌కి చేరి.. అక్కడి నుంచి కోర్ట్.. మళ్లీ ఆఫీస్ అలా రాత్రి 9 వరకు పని చూసుకుని.. అక్కడి నుంచి నేరుగా థియేటర్ రిహార్సల్స్‌కి వెళ్లేదట. ఉదయం మూడు గంటల వరకు రిహార్సల్స్ చూసుకుని ఇల్లు చేరేది. అలా కొన్ని నెలల శ్రమానంతరం స్టేజ్ మీద నాటకం ప్రదర్శించే రోజు రానేవచ్చింది. నిధి తన బాస్‌నూ ఆహ్వానించింది. అతను ఆ రోజు చప్పట్లతో ఆమె ప్రతిభను ప్రశంసించాడు. కానీ మరుసటి రోజు ఆఫీస్‌లో పది పనులు చెప్పి .. సాయంకాలానికి డెడ్‌లైన్ ఇచ్చాడు. చేయలేకపోయింది నిధి. అప్పుడే ‘షారూఖ్ ఖాన్‌తో కలసి కనిపిస్తావన్నమాట’ అంటూ ఆ బాస్ కామెంట్ చేశాడు. ‘తప్పకుండా కనిపిస్తాను చూడండీ..’ అంటూ ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చింది నిధి.► యాక్టింగ్ మీదే పూర్తి దృష్టి పెట్టాలని ముంబై చేరింది. కనీస అవసరాల కోసం p్చnజ్ఛ్చ3 అనే లీగల్ ఔట్సోర్సింగ్ సంస్థలో చేరింది. జాబ్.. ఆడిషన్సే లోకమయ్యాయి ఆమెకు. అయితే ఎక్కడికి వెళ్లినా రిజెక్షనే ఎదురైంది. అయినా అధైర్యపడలేదు. తన ఫిక్స్డ్ డిపాజిట్‌ని బ్రేక్ చేసి ‘న్యూ బ్రెయిన్ థియేటర్ వోక్స్’ అనే బ్యానర్‌ని స్థాపించి ‘హూ లెట్ ద డాగ్స్ అవుట్’ అనే నాటకాన్ని డైరెక్ట్ చేసింది. అది చూసి యూట్యూబ్ చానెల్ ‘టీవీఎఫ్ (ద వైరల్ ఫీవర్ ) వీడియోస్’ ఫౌండర్ అరునాబ్ కుమార్ టీవీఎఫ్‌లో అవకాశం ఇచ్చాడు. అందులో ఆమె స్క్రిప్ట్ రైటర్‌గా, యాక్టర్‌గా, కాస్టింగ్ డైరెక్టర్‌గా మల్టిపుల్ రోల్స్‌ని పోషించింది. ఆ టాలెంట్ ఆమెకు ఇటు ఓటీటీ.. అటు సినిమాల్లో ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టింది. దేశమంతటా అభిమానాన్ని సంపాదించిపెట్టింది.► క్రియెటివిటీకి బెంచ్ మార్క్ ఉండదనే కాన్ఫిడెన్స్ నాది. కాబట్టే ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా లైట్ తీసుకున్నా. వచ్చిన అవకాశంతో నేనేంటో నిరూపించుకున్నా! అందుకే ఆ రోజు రిజెక్ట్ చేసినవాళ్లే ఈ రోజు నాతో పనిచేయడానికి డేట్స్ అడుగుతున్నారు!‘తుప్పాకీ’, ‘చాయ్ సుట్టా క్రానికల్స్’, ‘పర్మినెంట్ రూమ్మేట్స్’, ‘టీవీఎఫ్ పిచర్స్’, ‘ఉమ్రీకా’, ‘టీవీఎఫ్ ట్రిప్లింగ్’, ‘ఫిల్లోరి’, ‘బిష్ట్.. ప్లీజ్’, ‘పిఏ గాళ్స్’, ‘డ్రీమ్ గర్ల్’, ‘క్యూబికల్స్’, ‘మిస్టర్ అండ్ మిసెస్’, ç‘ßోమ్ శాంతి’, ‘ఫోన్ బూత్’. ‘మామ్లా లీగల్ హై’ వంటి షోస్, సినిమాస్, సిరీస్‌కి కాస్టింగ్ డైరెక్టర్, రైటర్, డెరెక్టర్, యాక్టర్‌గా పనిచేసింది. టీవీఎఫ్లోనే.. షారూఖ్ ఖాన్ పాల్గొన్న ‘బేర్లీ స్పీకింగ్ విత్ అర్నబ్’ అనే షోకి నిధి మోడరేటర్‌గా వ్యవహరించి.. తన బాస్‌కి చెప్పినట్టు షారూఖ్ ఖాన్‌తో స్క్రీన్ కూడా షేర్ చేసుకుంది. – నిధి బిష్ట్.ఇవి చదవండి: Cover Story: 'స్వేదవేదం'! చెమటచుక్కకు దక్కుతున్నదెంత? -
Ashish Chanchlani: టాలెంట్‌తో.. బిలియన్ల వ్యూస్.. మిలియన్ల సబ్స్క్రైబర్స్..
'Ashish Chanchlani Vines అనే యూట్యూబ్ చానెల్‌తో clout అయ్యాడు. కామెడీ వీడియోస్‌కి వెల్‌నోన్. అమ్మాయిగా.. తండ్రిగా.. కొడుకుగా.. ఇలా డిఫరెంట్ రోల్స్ వేయడంలో ఆశీష్ని మించిన క్రియేటర్ లేడు. సోషల్ మీడియాలో, స్టూడెంట్ లైఫ్, ఎగ్జామ్స్, ఆఫీస్ డ్రామా, ఫ్యామిలీ ఇష్యూస్.. ఇలా ఈ కుర్రాడు ఫోకస్ చేయని టాపిక్ లేదు.' సబ్జెక్ట్ ఏదైనా హిలేరియస్ ట్విస్ట్స్ కడుపుబ్బా నవ్వించే కంటెంట్‌ని చూపిస్తాడు. ఆశీష్ పుట్టి, పెరిగింది మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్లో. ఇంజినీరింగ్ చదువు కోసం నవీ ముంబై చేరాడు. ఫ్రమ్ ద చైల్డ్ హుడ్ అతనిలో యాక్టింగ్ ఇన్స్టింక్ట్ ఉండటంతో టీన్స్‌లో అది డామినేట్ చేసింది. దాంతో మధ్యలోనే ఇంజినీరింగ్‌కి గుడ్ బై చెప్పేశాడు. ఆ గట్స్ అండ్ గట్ ఫీలింగ్‌తో సోషల్ మీడియాలో జర్నీ స్టార్ట్ చేశాడు. యూట్యూబ్ చానెల్ పెట్టి.. చదువు మధ్యలోనే వదిలేసినందుకు రిగ్రెట్ ఫీలయ్యే చాన్స్ ఆశీష్కివ్వలేదు డెస్టినీ! ఫన్నీ వీడియోస్‌తో వితిన్ ద షార్ట్ టైమ్ వెరీ పాపులర్ అయిపోయాడు. ఎంతలా అంటే బాలీవుడ్ బిగ్గీస్ తమ మూవీస్‌కి అతనితో ప్రమోషనల్ వీడియోస్ చేయించుకునేంతలా! అంతేకాదు షాహిద్ కపూర్, కార్తిక్ ఆర్యన్, సారా అలీఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్‌తో కలసి యాడ్స్ చేశాడు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్.. 'మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్' అనే హాలీవుడ్ మూవీలో కూడా యాక్ట్ చేశాడు. 'ఆఫ్రీ సఫర్' అనే షార్ట్ హారర్ ఫిల్మ్ తీసి తనలోని డైరెక్షన్ చూపించాడు. ఆశీష్ యూట్యూబ్ చానెల్, ఇన్‌స్టా హ్యాండిల్ వంటి వేరియస్ సోషల్ మీడియా అకౌంట్స్‌కి బిలియన్ల వ్యూస్.. రెండు అంకెల మిలియన్ల ఫాలోవర్స్.. అంతకన్నా ఎక్కువ రేంజ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెలకు లక్షల్లో ఆమ్దనీ వస్తోంది. అవార్డులు కూడా బాగానే గెలుచుకున్నాడు. 'బెస్ట్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్' కేటగిరీలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ అందుకున్నాడు. వరల్డ్ బ్లాగర్స్ అవార్డ్స్ ప్రారంభించిన ఏడాదే (2019) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'బెస్ట్ కామెడీ ఇన్ఫ్లుయెన్సర్' అవార్డును సాధించాడు. ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లోనూ లిస్ట్ అయ్యాడు. కాన్ఫిడెన్స్ ఉంటే కేన్స్ దాకా వెళ్లొచ్చని భలే ప్రూవ్ చేశాడు కదా! ఇవి చదవండి: అక్షయ్ కుమార్ నుంచి కత్రినా వరకు .. డైట్ సీక్రెట్స్ ఇవే.. -
Hrithik Roshan: ఈ బాలీవుడ్ యాక్టర్ ముద్దు పేరు వింటే షాకే..!
ఒక్కొక్కరికి ఒక్కో ముద్దుపేరు ఉండటం సహజం. వారి ప్రవర్తనతో గానీ, అలవాట్లు.. ఇష్టాలతోగానీ, కనిపించే తీరుతోగానీ.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. చాలా రకాలుగా మారుపేర్లు, ముద్దుపేర్లు వస్తూంటాయి. కొన్ని ముద్దు పేర్లు మాత్రం స్థిరపడిపోతాయి కూడా. ఇలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు అయినటువంటి హృతిక్ రోషన్‌కి కూడా ఓ చిన్న కథ ఉంది. అదేంటో చూద్దామా! బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ పెట్ నేమ్ దుగ్గూ. ఈ ముద్దు పేరుకీ.. హృతిక్ వాళ్ల నాన్న.. బాలీవుడ్ ఒకప్పటి అందాల హీరో రాకేశ్ రోషన్ పెట్ నేమ్కీ ఏదో కనెక్షన్ ఉండే ఉంటదని బాలీవుడ్ వర్గాలు.. తన పేరునే కాస్త తిరగేసే కొడుకును పిలుచుకుంటున్నాడా ఏంటీ అని హృతిక్ ఫ్యాన్స్ డౌట్ పడతారట. ఇంతకీ రాకేశ్ రోషన్ ముద్దు పేరేంటంటే.. గుడ్డూ! ఇవి చదవండి: ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు! -
Darshana Banik: తను ఒక 'దర్శనా'త్మకం..
‘సేవ్ ద టైగర్స్’.. సింప్లీ సూపర్బ్ అనిపించుకుంటున్న వెబ్ సిరీస్! అందులో ‘హారిక’ రోల్లో కనిపించిన నటి.. దర్శనా బనిక్. కూల్ లుక్స్.. గుడ్ యాక్టింగ్ స్కిల్స్‌తో ఆమె కూడా సింప్లీ సూపర్బ్ అని వీక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌తో లైమ్‌లైట్‌లో ఉన్న దర్శనా గురించి క్లుప్తంగా.. పుట్టి, పెరిగింది కోల్‌కత్తాలో. రబీంద్ర భారతి యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. డిగ్రీ ఫైనలియర్లో ఉన్నప్పుడే అందాల పోటీల్లో పాల్గొంది. అందాల పోటీల్లో పార్టిసిపేషన్ ఆమెకు మోడలింగ్ అవకాశాలను తెచ్చిపెట్టింది. ఒకవైపు చదువు కొనసాగిస్తూనే బొరోలిన్, వొడాఫోన్, కలర్స్, పీసీ చంద్ర జ్యూలర్స్ వంటివాటికి మోడల్‌గా పనిచేసింది. మోడలింగ్‌లో ఉన్న చాలామందిని వరించినట్టే.. దర్శనా దరికీ సినిమా చాన్స్‌లు వరుస కట్టాయి. అలా 2018లో ‘అశ్చే అబర్ షబోర్’తో బెంగాలీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. దర్శనా.. బెంగాలీ సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే టాలీవుడ్ దృష్టిలో పడింది. ‘ఆటగాళ్లు’తో తెలుగు ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకుంది. ‘బ్లాక్’ అనే మరో సినిమాలోనూ కనిపించింది. బాలీవుడ్, కోలీవుడ్‌లలోనూ నటనావకాశాలు క్యూకట్టాయి. ‘ఎజ్రా’ అనే హిందీ మూవీలో, ‘యారుక్కుమ్ అంజేల్’ అనే తమిళ చిత్రంలో నటించింది. వెబ్‌స్క్రీన్ కూడా దర్శనాకు వెల్కమ్ చెప్పింది. ఆమె నటించిన ‘సేవ్ ద టైగర్స్’ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీతో ఏమాత్రం సంబంధంలేని వాళ్లు ఈ ఫీల్డ్‌లో నిలదొక్కుకోవడం అంత ఈజీకాదు. అందులోనూ ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లడాలు, పార్టీలకు అటెండ్ అవడాలు వంటి సోషల్ మూవింగ్ లక్షణాలేవీ లేని నాలాంటి వాళ్లకు మరీ కష్టం. అయినా ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చానంటే నేను చేసిన.. చేస్తున్న పనే కారణం. అందుకే మన పనే మనకు అవకాశాలను తెచ్చిపెడుతుందని నమ్ముతాను! – దర్శనా బనిక్ ఇవి చదవండి: ఎందెందు వెదికినా కరివేపాక్ కలదు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్‌లైట్స్
కాంగ్రెస్‌కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్‌కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్‌గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్‌రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement