-
కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని, ఎన్నికల ముందు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో విద్యుత్ రంగం కోలుకోలేని నష్టాల్లోకి వెళ్లిందని దుయ్యబట్టారు. 2014 జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ సమయానికి డిస్కంల నష్టాలు రూ.12,186 కోట్లు కాగా బీఆర్ఎస్ పదేళ్ల పాలన పూర్తయ్యేసరికి ఆ నష్టాల భారం రూ.62 ,461 కోట్లకు చేరిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్య లపై ఆ శాఖ మంత్రిగా తాను చర్చకు సిద్ధమని భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్ రంగాన్ని సంస్కరిస్తూ కరెంటు సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తు న్నామని ఆయన గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. దీర్ఘకాలిక అవసరాల కోసమే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు చేశామనే కేసీఆర్ మాటల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. తాము రూ.13 పెట్టి విద్యుత్ కొనుగోలు చేసినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, యూనిట్‌ను కేవలం రూ.3.90కు కొంటున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. బీఆర్ఎస్ హయంలో రూ.20లకు కూడా విద్యుత్ కొన్నట్టు రికార్డుల్లో నమోదైందని తెలిపారు. ఎన్టీపీసీ నుంచి తాము ఒక యూనిట్‌ను రూ. 5.60లకు కొనుగోలు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కేసీఆర్ హయంలో థర్మల్ విద్యుత్ కొత్త కేంద్రం భద్రాద్రి నుంచి 1080 మెగావాట్లు మాత్రమే వచ్చిందని, ఛత్తీస్‌గఢ్ నుంచి తీసుకున్న 1000 మెగావాట్లను కలిపితే 2080 మెగావాట్లని వివరించారు. 2022లోనే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఆగిపోయిందని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాతే అత్యధిక విద్యుత్ సరఫరా చేశామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌ను పవర్ ఐల్యాండ్‌గా మార్చిన ఘనత కాంగ్రెస్‌దే 2012లో గ్రిడ్ కుప్పకూలిన తరువాత హైదరాబాద్‌ను పవర్ ఐల్యాండ్‌గా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని భట్టి స్పష్టం చేశారు. ’’దేశంలోని 20 కంటే ఎక్కువ ప్రధాన నగరాల్లో ఇలాంటి పవర్ ఐలాండ్ కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 24 గంటల కరెంటు ఇచ్చాం’అని వివరించారు. ఫిబ్రవరి నాటికి యాదాద్రి ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి యాదాద్రి విద్యుత్ ప్లాంట్ నుంచి 2025 ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధ్యం అవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు రావడానికి సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 4000 మెగావాట్ల ఈ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని గురువారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేవనెత్తిన అభ్యంతరాలకు పరిష్కారం చూపి కేవలం రెండు నెలల వ్యవధిలోనే యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకువచ్చామని భట్టి తెలిపారు. -
ఎమ్మెల్సీ లేదా చైర్మన్ పోస్టులిస్తాం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పారీ్టకి మద్దతిస్తే సీపీఎంకి ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీనిచ్చారు. ఈ మేరకు భట్టి శుక్రవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి వచ్చి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యు లు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య, జూలకంటి రంగారెడ్డితో భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాలకు పైగా పలు అంశాలపై చర్చించిన మీదట ఎట్టకేలకు పార్లమెంటు ఎన్నికల్లో కలిసి ప్రయాణించాలని ఆ రెండు పారీ్టలు అంగీకారానికి వచ్చాయి. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించి పార్టీ ఆదేశాల మేరకు సీపీఎం కార్యాలయానికి వచ్చానని, ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేద్దామని కోరానని చెప్పారు. ఇరు పారీ్టల పరంగా అభిప్రాయాలు పంచుకున్నామని చెప్పారు. ఇరు వురి అభిప్రాయాలపై సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి శనివారం ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సాధారణ ఎన్నికల్లో కలిసి ప్రయాణించాలని ఇరు పార్టీలు సుహృద్భావ వాతావరణంలో ఓ అంగీకారానికి వచ్చామని అన్నారు. భువనగిరి స్థానంలో మద్దతు ఇమ్మన్న సీపీఎం భువనగిరి స్థానానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని సీపీఎం నాయకులు భట్టిని కోరారు. మిగిలిన 16 స్థానాల్లో తాము మద్దతిస్తామని తెలిపారు. అయితే భువనగిరి స్థానంలో కూడా తమకే మద్దతు ఇవ్వాలని భట్టి కోరారు. అందుకు తాము ఎమ్మెల్సీ లేదా చైర్మన్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. భట్టి రావడం హ్యాపీ.. కానీ రేవంత్ అలా మాట్లాడకూడదు: తమ్మినేని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమ పార్టీ కార్యాలయానికి రావడం, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలంటూ కోరడం సంతోషకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఇది తమ ఆలోచనలకు అనుగుణంగానే ఉందన్నారు. సీట్లు, మద్దతు విషయంలో భట్టితో మాట్లాడామని చెప్పారు. భువనగిరి మినహా మిగతా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి చర్చించినపుడు తుది నిర్ణయానికి వస్తామన్నారు. కేరళలో సీఎం రేవంత్ రెడ్డి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని తమ్మినేని వ్యాఖ్యానించారు. -
మీ తప్పుల వల్లే కరువు తిప్పలు
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలపై బతకాలని తాము అనుకోవడం లేదని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ‘బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయం పెరిగిందని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు పెరిగాయన్న విషయాన్ని మరుగున పెట్టారు. సింగరేణిలో రూ.30 వేల కోట్ల ఆదాయం వచ్చే బొగ్గు గనులకు సంబంధించిన పెండింగ్ అంశాలను పదేళ్లయినా తేల్చలేదు. వర్షాలు వాళ్లున్నప్పుడే పడలేదు. వచ్చిన వర్షాన్ని ఒడి సి పట్టుకోవడంలో విఫలమయ్యారు. కాళేశ్వ రం ప్రాజెక్టు కుంగిపోయినట్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెపితే గోదావరి నీటిని అవసరం లేకపోయినా కిందకు వదిలేశారు. కృష్ణాలో నీటి నిల్వల సంగతి తెలిసి కూడా కేవలం ఓట్ల కోసం, కాల్వల్లో నీటిని చూసి జనం ఓట్లేస్తారనే ఉద్దేశంతో పంటలు లేకపోయినా నీటిని సముద్రంలోకి వదిలేశారు. ఇప్పుడు కరువొచ్చిందని అంటున్నారు. రూ. 43 వేల కోట్లు పెట్టి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ వ్యవస్థ ఈ కరువులో ఏం చేస్తున్న ట్టు? ఇవన్నీ ఎవరి తప్పులు? తప్పులన్నీ మీవైపే ఉన్నాయి..’అంటూ భట్టి ధ్వజమెత్తా రు. శుక్రవారం హైదరాబాద్‌లోని దేశోద్ధారక భవన్లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ‘విద్యుత్–తాగునీరు–ఆర్థికం’అంశాలపై నిర్వ హించిన మీడియాతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అప్పులు, వడ్డీల కింద రూ.26,374 కోట్లు చెల్లించాం ‘రైతుబంధు కింద గత ప్రభుత్వం రూ.7 వేల కోట్లు దాచిపెడితే మేమేదో ఖర్చు పెట్టినట్టు గా ప్రచారం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో మేము అధికారం చేపట్టేనాటికి రూ.3,960 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. ఆ పరిస్థితి నుంచి ప్రతి రూపాయి పోగేస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నం చేస్తు న్నాం. సీఎం రేవంత్‌రెడ్డితో సహా మంత్రులందరం 24 గంటలూ కష్టపడుతూ ఓ తపస్సు లా పనిచేస్తున్నాం. రాష్ట్రంలో సంపదను సృష్టించి పేదలందరికీ పంచాలన్నదే మా ఆలోచన. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పుల అసలు, వడ్డీల కింద రూ.26,374 కోట్లు తిరిగి చెల్లించాం. రైతుబంధు కింద రూ.5,575 కోట్లు, ఆరీ్టసీకి రూ.1,120 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీల కోసం రూ.3,924 కోట్లు, గృహజ్యోతి కోసం రూ.200 కోట్లు, గ్యాస్ సబ్సిడీ కోసం రూ.80 కోట్లు, బియ్యం సబ్సిడీల కింద రూ.1,147 కోట్లు, రైతు బీమా ప్రీమియం కోసం రూ.734 కోట్లు చెల్లించాం. ఉద్యోగుల వేతనాలు, విద్యార్థులకు డైట్ చార్జీలు, మధ్యాహ్న భోజన పథకం అమలు, అంగన్వాడీలు, హోంగార్డులకు వేతనాలు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు... ఇలా మొత్తం రూ.66,507 కోట్లు ఖర్చు పెట్టాం. దీనిపై ఎవరితోనైనా, ఎక్కడైనా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం..’అని భట్టి సవాల్ చేశారు. విద్యుత్‌కు అంతరాయమే తప్ప కోతల్లేవు ‘విద్యుత్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించి పనిచేస్తున్నాం. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా 15,673 మెగావాట్ల పీక్ డిమాండ్ వచ్చినా చిన్న కోత లేకుండా నిరంతర విద్యుత్ ఇస్తున్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా కరెంటు పోతే అది అంతరాయం మాత్రమే. నిర్వహణ పనుల కోసం ఆపేస్తున్నదే తప్ప కోత కాదు. 2031–32 సంవత్సరం వరకు 29 వేల నుంచి 30వేల మెగావాట్ల వరకు పీక్ డిమాండ్ వచ్చినా అందుకు తగిన కార్యాచరణ మా వద్ద ఉంది..’అని డిప్యూటీ సీఎం తెలిపారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు ‘గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నా తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. రాష్ట్రంలో ఎ క్కడా నీటి సమస్య రానివ్వబోం. త్వరితగతి న పూర్తయ్యే సాగునీటి ప్రాజెక్టులకు నిధు లు కేటాయిస్తాం. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజె క్టు నిర్మిస్తాం. రైతు రుణమాఫీ తప్పకుండా చేస్తాం. ఎన్నికల తర్వాత దీనిపై స్పష్టమైన ప్ర కటన ఉంటుంది..’అని భట్టి తెలిపారు. 10 లక్షల కోట్లు ప్రభుత్వ అకౌంట్లలోకి రాలేదు గత పదేళ్లలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల కోట్లు వచ్చాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను భట్టి ఖండించారు. ‘కేంద్రం నుంచి రూ.10 లక్షల కోట్లు వచ్చాయని ఒక పెద్దమనిషి చెపుతున్నాడు. రూ.10 లక్షల కోట్ల మాట అటుంచితే తెలంగాణపై బీజేపీకి కనీస ప్రేమ ఉన్నా లక్ష కోట్ల రూపాయల నష్టం జరిగేది కాదు. నాడు చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర కోల్పోయే 3 వేల ఎకరాల భూమి విషయంలో వారిని ఒప్పించి పరిహారం ఇచ్చి ఉంటే నేడు కాళేశ్వరం ప్రాజెక్టే వచ్చేది కాదు. కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా కింద వచ్చింది రూ.3,70,235 కోట్లు మాత్రమే. మరి ఆయన చెపుతున్నట్టు మిగిలినవి ఎక్కడ ఇచ్చారో తెలియదు. ప్రభుత్వ అకౌంట్లలోకి అయితే రాలేదు. బీజేపీ ఇచ్చిన రూ.10 లక్షల కోట్లు, బీఆర్ఎస్ చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పు ఏమయ్యాయో, ఆ రెండు పారీ్టలు ఏం సాధించాయో?’వారే సమాధానం చెప్పాలి..’అని భట్టి వ్యాఖ్యానించారు. మా ప్రభుత్వం ఐదేళ్లూ ఉంటుంది మాజీ సీఎం కేసీఆర్ గురువారం చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ..‘ప్రభుత్వాన్ని అస్థిరత పాలు చేసే ప్రయత్నాలు తెలంగాణ సమాజానికే నష్టం కలిగిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా ఉంది. తలకిందులుగా తపస్సు చేసినా, ఎన్ని పిల్లేరు గంతులు వేసినా మా ప్రభుత్వానికి వచ్చే ఢోకా లేదు. ఐదేళ్ల పాటు నిశి్చంతగా ఉంటుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది..’అని డిప్యూటీ సీఎం చెప్పారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్ అలీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది
ఖమ్మంవన్‌టౌన్/సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా పాలన అందిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అసమానతలు, అంతరాలు లేకుండా రాజ్యాంగం అనే గ్రంథాన్ని దేశానికి అందించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ పాలకులు యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల వ్యయాన్ని అపరిమితంగా పెంచారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను పెంచి రాష్ట్రంలో విపరీతమైన ఆర్థిక దోపిడీకి కల్వకుంట్ల కుటుంబం తెరలేపిందని ఆరోపించారు. రూ.లక్ష కోట్లతో అనాలోచితంగా నిర్మించిన కాళేశ్వరం ఇప్పుడు నిరుపయోగంగా మారిందన్నారు. అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని తమ చేతిలో పెడితే, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ ఒక్కొక్కటిగా సంక్షేమ ఫలాలను పేదలకు అందిస్తున్నామని వివరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకపాలనను అందించిన పార్టీలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో ‘గ్రీవెన్స్’ తమ పార్టీ కార్యకర్తల సదుపాయంకోసం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రతి ఆదివారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కాంగ్రెస్ కార్యకర్తల నుంచి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సమయంలో తన దృష్టికి తెచ్చే సమస్యలను నోట్ చేయించను న్నట్లు చెప్పారు. పార్టీ శ్రేణుల సమస్యలు ఏమి ఉన్నా స్వయంగా వినేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తారా?: ఉప ముఖ్యమంత్రి భట్టి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘‘తీవ్రవాదుల గుర్తింపు, దేశ భద్రత కోసం ఏర్పాటు చేసి న చట్టాలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టింది. ఇది ఎంత వరకు కరెక్ట్? ప్రతిపక్షాలు, పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు. భార్యాభర్తలు, వ్యాపారులు, అధికారులు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశారు. ఇంతా చేసి తీరా ఫోన్ ట్యాపింగ్‌తో మాకేం సంబంధం అని తప్పించుకుంటారా? వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఎవరూ క్షమించరు’’అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీఆర్ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘వ్యక్తిగత సమాచారం ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. పాలించమని అధికారాన్ని అప్పజెప్పితే ప్రజల ధన, మాన, ప్రాణాలను హరించే విధంగా వ్యవహరిస్తారా? ఇంతకంటే అన్యాయం, ద్రోహం ఇంకేముంది. పదేళ్లు తెలంగాణలో వ్యక్తిగతమైన స్వేచ్ఛ లేకుండా చేశారు. స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించే హక్కును ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తోంది.’’అని ఆయన పేర్కొన్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర మహా సభ ఏర్పాట్లను గురువారం పరిశీలించిన అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు ’’రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీఆర్ఎస్ హయాంలో అతాలాకుతలమైంది. ప్రజలపై భారం మోపే విధంగా యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. జెన్కోను, ట్రాన్స్‌కోను సర్వనాశనం చేశారు. ఇప్పుడు వ్యవస్థలన్నింటినీ చక్కబెడుతున్నాం. రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా చూస్తున్నాం. చేసిందంతా చేసి ప్రస్తుతం అడ్డగోలుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతున్నారు. మూడు నెలలు ఫాంహౌస్‌లో పడుకుని.. తీరా ఎన్నికల ముందు బయటికొచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అవాస్తవాలు మాట్లాడే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా కూడా పనికిరాదు’’అని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుక్కుగూడలోనే కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటన ‘దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యం. తుక్కుగూడ జనగర్జన సభ ఈ దేశానికి దిశా నిర్దేశం చేయనుంది. దేశంలోనే ఈ సభ చారిత్రాత్మకం కానుంది. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను తుక్కుగూడ సభనుంచే ఏఐసీసీ నాయకత్వం ప్రకటించనుంది’’అని ఆయన వివరించారు. భట్టి వెంట మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మా రెడ్డి, మహేశ్వరం సీనియర్ నేత దేప భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement