-
చంద్రబాబు పచ్చి మోసగాడు..
సాక్షి, హైదరాబాద్: ‘తెలుగుదేశం అధినేత చంద్రబాబు పచ్చి మోసగాడు.. రాజకీయ లబ్ధికోసం యూటర్న్ తీసుకోవడంలో మొనగాడు. 1994లో నేను ఎమ్యెల్యేగా పనిచేసినప్పటి నుంచి చూస్తున్నా.. స్థిరత్వంలేని ఆయన పదవి కోసం ఎంతకైనా బరితెగిస్తాడు. అప్పట్లో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఎలా మోసం చేశాడో చూశా. అతనికి పదవులే ముఖ్యం. అభివృద్ధి, ప్రజల సంక్షేమం చంద్రబాబుకు అస్సలు పట్టదు’.. అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. ‘సాక్షి’తో శనివారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..అధికారమే బాబు లక్ష్యం..చంద్రబాబు కేవలం అధికారం చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తాడు. రాజకీయ లబ్ధికోసం 1996లో వాజ్‌పేయితో జతకట్టాడు. ఆ తర్వాత బయటకొచ్చాడు. 2014లో మోదీతో కలిసి పనిచేశాడు. మళ్లీ విడిపోయాడు. మోదీని అనరాని మాటలు అన్నాడు. ఇది అందరికీ తెలుసు.. మళ్లీ మోదీతో కలిసి పనిచేస్తున్నాడు. కానీ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అలా కాదు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తుంటాడు. దివంగత నేత వైఎస్సార్ ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్లను జగన్ అమలుచేస్తున్నారు. తిరిగి అధికారంలోకొచ్చి వాటిని కొనసాగించడం ఖాయం. జగన్ అంటే ఒక విశ్వాసం. అదే చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వగలడు? ముస్లిం రిజరేషన్లపై చిత్తశుద్ధి ఉంటే.. మోదీ, అమిత్ షాతో చెప్పించగలడా? అతను మోదీ చేతిలో కీలుబొమ్మ. చంద్రబాబును నమ్మలేం. కాబట్టి భవిష్యత్తులో ముస్లిం రిజర్వేషన్లకు ముప్పు కలగకుండా చంద్రబాబు, ఆయన కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పాలి. మరోవైపు.. ప్రధాని మోదీ గ్యారంటీలంటే రాజ్యాంగంలో మార్పులు చేయడం, రిజర్వేషన్లను రద్దుచేయడం, మైనారిటీలకు వ్యతిరేకంగా విషం చిమ్మడమే. బీజేపీది హిందూత్వమే ఏకైక ఎజెండా. భారత్‌ను హిందూత్వ దేశంగా మార్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. వెనుకబాటుతనంపైనేముస్లింలకు రిజర్వేషన్లు..అసలు ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించింది మతప్రాతిపదికన కాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ రిజర్వేషన్లను సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు కారణంగా అందిస్తున్నారు. ముస్లింలలో అనేక వెనుకబడిన కులాలున్నాయి. వారికి ప్రభుత్వ మద్దతు అవసరం. కానీ, బీజేపీకి వీరి అభివృద్ధి గిట్టడంలేదు. అందుకే.. ముస్లిం రిజర్వేషన్ల రద్దుచేస్తామంటున్నారు.అభివృద్ధికి సహకరిస్తాంతెలంగాణలో అభివృద్ధికి సహకారం అందిస్తామని అసద్ పునరుద్ఘాటించారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్దే తమ లక్ష్యమన్నారు. తమ పనితీరే తమకు గుర్తింపని చెప్పారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో గవర్నర్‌గా రాజ్యాంగబద్ధ్ద బాధ్యతలు నిర్వహించి రాజీనామా చేసిన తమిళిసై తిరిగి ఎన్నికల ప్రచారానికి రావడం రాజకీయంగా అనైతికమన్నారు. -
మా మద్దతు సీఎం జగన్ కే
-
ఏపీలో జగన్‌తోనే ముస్లిం రిజర్వేషన్లు: అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలిస్తేనే ముస్లిం రిజర్వేషన్ల అమలు కొనసాగుతుందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తేల్చి చెప్పారు. జగన్ రిజర్వేషన్లకే కాదు.. రాజ్యాంగ పరిరక్షణ కోసం కూడా పాటుపడతారన్న నమ్మకం తనకుందని చెప్పారు. బుధవారం రాత్రి హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీ మాట వినను.. ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తానని నిలబడి చెప్పే దమ్ము టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఉందా? ఏపీలో చంద్రబాబు గెలిస్తే ప్రధాని మోదీకి కీలుబొమ్మగా మారుతారు’’అని స్పష్టం చేశారు. బీజేపీతో చేతులు కలిపిన చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. బాబు కూటమిలోని పవన్ కల్యాణ్ ఒక నటుడని, మోదీ మహా నటుడని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు. మోదీ సినీ ప్రపంచంలో ఉండి ఉంటే సినిమా రంగాన్ని కూడా భ్రష్టు పట్టించేవారని విమర్శించారు. వైఎస్సార్ సీపీకే మా సంపూర్ణ మద్దతు ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ మళ్లీ గెలుస్తారని, ముస్లిం రిజర్వేషన్లను ఆయనే పరిరక్షిస్తారని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి దమ్మున్న నాయకుడని కొనియాడారు. ప్రధాని మోదీని ప్రశ్నించే సత్తా ఆయనకే ఉందన్నారు. వైఎస్సార్ సీపీకే తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కలసికట్టుగా జగన్‌ను మరోసారి గెలిపించి, ముఖ్యమంత్రిని చేయాలని అసదుద్దీన్ పిలుపునిచ్చారు. -
మోదీని ఢీకొట్టే సత్తా సీఎం జగన్ కే ఉంది
-
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
గోల్కొండ: ప్రపంచంలోనే అత్యుత్తమమైన భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని మజ్లిస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ చేతుల్లో కీలు»ొమ్మ అయిన బీజేపీ దళితులు, ముస్లింలకు పక్కా వ్యతిరేకి అని విమర్శించారు. మంగళవారం గోల్కొండ ఎండిలైన్స్ చౌరస్తా వద్ద జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్‌భగవత్ ఒకొక్కటిగా తమ ఎజెండాను అమలు చేస్తూ దేశ విచ్చిన్నానికి కుట్రలు చేస్తున్నారని నిందించారు. గత పదేళ్ల పాలనలో దళితులు, ముస్లింల సంక్షేమానికి ఏమీ చేయని పీఎం మోదీ ఇప్పుడు వారి రిజర్వేషన్లను సైతం రద్దు చేసేందుకు పక్కాగా ప్లాన్ చేశారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం నాయకుల హత్యాకాండ నేరుగా అక్కడి ప్రభుత్వాల కనుసన్నల్లోనే కొనసాగుతోందని ఒవైసీ ధ్వజమెత్తారు. ముస్లిం నేతలు అరెస్టయి జైలుకు వెళ్లే వారు సజీవంగా తిరిగిరావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం నేతలను పోలీసులే చంపారని ఆయన గుర్తు చేశారు. నన్ను ఓడించేందుకు మోదీ, అమిత్ షా పాట్లు హైదరాబాద్‌లో అరాచక వాతావరణం నెలకొల్పేందుకు బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఒవైసీ ఆరోపించారు. హైదరాబాద్ స్థానం నుంచి తనను ఓడించేందుకు మోదీ, అమిత్ షాలు పడరాని పాట్లు పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మతసామరస్యానికి పెట్టిన పేరైన హైదరాబాద్ ఓటర్లు ఎంతో వివేకవంతులనీ, శాంతిభద్రతలు నగర అభివృద్ధి కోరుకుని తనను గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్దీన్, కార్పొరేటర్ నసీరుద్దీన్, మహ్మద్ గౌస్ తదితరులున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్‌టీని ఢీ కొట్టిన లారీ
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement