-
అగ్నిపథ్‌పై రాహుల్ గాంధీ విమర్శలు..
ఆర్మీ రిక్రూట్ మెంట్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పథకం పీఎంఓ కార్యాలయంలో రూపొందించారని ఆరోపించారు. కేంద్రంలో భారత కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, అగ్నిపథ్ సైనిక పథకాన్ని రద్దు చేసి, పాత శాశ్వత నియామక ప్రక్రియను తిరిగి తీసుకువస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. అగ్నిపథ్ పథకంపై ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అగ్నిపథ్ పథకం భారత సైన్యాన్ని, దేశాన్ని రక్షించాలని కలలు కంటున్న వీర యువతను అవమానించడమేనని అన్నారు. ఈ పథకం భారత సైన్యం కాదు. నరేంద్ర మోదీ రూపొందించిన పథకం. అమరవీరులను వేర్వేరుగా చూడలేమని, దేశం కోసం అత్యున్నత త్యాగం చేసే ప్రతి ఒక్కరికీ అమరవీరుడి హోదా కల్పించాలని అన్నారు. ఇండియా కూటమి వెంటనే ఈ పథకాన్ని రద్దు చేస్తాము.పాత శాశ్వత నియామక ప్రక్రియను తిరిగి తీసుకువస్తాము అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. -
Nyay Patra-2024: ఐదు న్యాయాలు.. 25 గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలతో కూడిన ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో)ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. యువతకు ఉద్యోగాల కల్పన, నిమ్నవర్గాల సంక్షేమం, సంపద సృష్టి వంటి కీలక హామీలను ప్రకటించింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఆపన్న హస్తం అందిస్తామని వాగ్దానం చేసింది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, అగ్నిపథ్ పథకం రద్దు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేత, దేశవ్యాప్తంగా కుల గణన వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాందీ, రాహుల్ గాందీ, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ‘న్యాయ్ పత్ర–2024’ పేరిట 45 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా వివిధ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు న్యాయాలను ప్రకటించారు. ఒక్కో న్యాయం కింద ఐదు గ్యారంటీల చొప్పున మొత్తం 25 గ్యారంటీలు ఇచ్చారు. ఐదు న్యాయాలు ఏమిటంటే.. నారీ న్యాయ్ ► మహాలక్ష్మీ పథకం కింద దేశవ్యాప్తంగా పేద కుటుంబాల్లోని మహిళకు ఏడాదికి రూ.లక్ష నగదు బదిలీ ► కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ► ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు రెట్టింపు వేతనం ► మహిళ హక్కుల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘మైత్రి’ అధికారి నియామకం ► మహిళా ఉద్యోగుల కోసం సావిత్రిబాయి పూలే పేరుతో వసతి గృహాలు కిసాన్ న్యాయ్ ► స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస గిట్టుబాటు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత ► రుణమాఫీ కమిషన్ ఏర్పాటు ► పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు ► రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి, దిగుమతి విధానం ► వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు యువ న్యాయ్ ► కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 30 లక్షల ఉద్యోగాల భర్తీ ► యువత కోసం ‘అప్రెంటీస్íÙప్ హక్కు చట్టం’. డిప్లొమా చదివినవారికి లేదా 25 ఏళ్లలోపు ఉన్న గ్రాడ్యుయేట్‌కు ఏడాదిపాటు అప్రెంటీస్íÙప్ చేసే అవకాశం. వారికి సంవత్సరానికి రూ.లక్ష సాయం. ► ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టం ► గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు ► స్టార్టప్ కంపెనీలు ప్రారంభించే యువత కోసం రూ.5,000 కోట్ల నిధి శ్రామిక్ న్యాయ్ ► కార్మికుల కోసం ఆరోగ్య హక్కు చట్టం ► కనీస వేతనం రోజుకు రూ.400. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సైతం వర్తింపు ► పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు ► అసంఘటిత రంగాల్లోని కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా వర్తింపు ► ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు రద్దు హిస్సేదారీ న్యాయ్ ► అధికారంలోకి రాగానే సామాజిక, ఆర్థిక కుల గణన ► ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల విషయంలో 50 శాతం సీలింగ్(పరిమితి) తొలగింపు ► ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు ► జల్, జంగల్, జమీన్‌పై చట్టబద్ధమైన హక్కులు ► గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలకు షెడ్యూల్డ్ ఏరియాలుగా గుర్తింపు న్యాయ్ పత్రలోని కీలక హామీలు ► సీనియర్ సిటిజన్లు, వితంతువులకు నెలకు రూ.1,000 చొప్పున పెన్షన్ ► రైల్వే ప్రయాణాల్లో వృద్ధులకు రాయితీ ► ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ ఆలోచనకు చెల్లుచీటి.. ► పదో షెడ్యూల్ సవరణ. పార్టీ ఫిరాయించిన నేతల లోక్‌సభ, అసెంబ్లీ సభ్యత్వాలు రద్దు ► సైన్యంలో నియామకాలకు ఉద్దేశించిన అగ్నిపథ్ పథకం రద్దు ► అన్ని కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం కోటా అమలు. ► జమ్మూకశ్మీర్‌కు, పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ► ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థి: రాహుల్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఎన్డీయేకు పరాభవం తప్పదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. 2004లో ‘భారత్ వెలిగిపోతోంది’ అంటూ ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే బోల్తా పడిందని, ఈసారి కూడా అదే పునరావృతం కాబోతోందని జోస్యం చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి విజయం ఖాయమని అన్నారు. ఎన్నికల్లో నెగ్గిన తర్వాత తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ఉమ్మడిగా నిర్ణయిస్తామని తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టోను ప్రజలే రూపొందించారని, ఇందులో అక్షరాలను మాత్రమే తాము ముద్రించామని వివరించారు. 99 శాతం మంది ప్రజలు కోరుకున్న అంశాలు మేనిఫెస్టోలో ఉన్నాయని తెలిపారు. అదానీ లాంటి కేవలం ఒకటి, రెండు శాతం మంది బడాబాబులు కోరుకున్న అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో ఉంటాయని ఎద్దేవా చేశారు. -
మేమొస్తే ‘అగ్నిపథ్’ రద్దు: ఖర్గే
న్యూఢిల్లీ: తాత్కాలిక ప్రాతిపాదికన యువతను సైన్యంలో చేర్చుకునే ‘అగ్నిపథ్’ పథకాన్ని తాము అధికారంలోకి వస్తే రద్దుచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈ పథకాన్ని ప్రకటించేనాటికే భర్తీ ప్రక్రియలో ఉత్తీర్ణులై నియామక పత్రాల కోసం ఎదురుచూసిన రెండు లక్షల మందికి తక్షణం ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన లేఖ రాశారు. ‘సాయుధదళాల్లోకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు ఆగిపోవడంతో లక్షలాది మంది యువత భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. అగ్నివీర్లు నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాలు కోల్పోయి నడి రోడ్డుపై నిల్చుంటారు. సామాజికంగానూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటారు’’ పేర్కొన్నారు. సైనిక అభ్యర్థుల పోరాటానికి మద్దతుగా ఉంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ అన్నారు. సైన్యంలో చేరేందుకు యువత కన్న కలలను అగ్నివీర్ పథకంతో బీజేపీ చిదిమేసిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ‘‘కేంద్రానికి కొంత జీతభత్యాల చెల్లింపులు ఆదా అవుతాయి తప్పితే ఈ పథకంతో ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలెట్ అభిప్రాయపడ్డారు. అగ్నివీర్ కింద సైన్యంలోకి తీసుకునే యువతలో నాలుగేళ్ల తర్వాత అత్యంత ప్రతిభ కనబరిచిన 25 శాతం మందినే 15 ఏళ్ల శాశ్వత కమిషన్‌లోకి తీసుకుంటామని కేంద్రం ప్రకటించడం తెలిసిందే. -
కొండంత సమస్యలు.. గోరంత హామీలు
హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాలు చిన్నవి. సమస్యలు మాత్రం చాలా పెద్దవి. అధికార బీజేపీకి ఈ సమస్యలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా అయిదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న హిమాచల్ ప్రదేశ్ ఓటరు ఈ సారి ఎటువైపు మొగ్గు చూపుతారా అన్న ఆందోళన నెలకొంది. అయిదు అంశాలు ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా ప్రభావాన్ని చూపించబోతున్నాయి. సమస్యలివీ... నిరుద్యోగం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య దారుణంగా ఉంది. జాతీయ స్థాయిలో నిరుద్యోగం రేటు 7.6% ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లో 8.6 నుంచి 9.2 శాతం వరకు ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువత 15 లక్షల మంది వరకు ఉంటే, వారిలో 8.77 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లో పేర్లు నమోదు చేసుకున్నారు. యాపిల్ రైతుల దుస్థితి దేశంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక యాపిల్ ఉత్పత్తిలో 26% వాటా హిమాచల్‌దే. గిట్టుబాటు ధర లేక రైతులు నిరసన బాట పట్టారు. సాగు ఖర్చు పెరగడం, వాతావరణ మార్పులు కుంగదీస్తున్నాయి. దీనికి తోడు యాపిల్స్‌ను రవాణ కోసం వాడే కార్టన్లపై జీఎస్టీని 12 నుంచి 18 శాతానికి పెంచడం రైతుపై మరింత భారాన్ని పెంచింది రోడ్డు కనెక్టివిటీ కొండ ప్రాంతం కావడంతో రాష్ట్రంలో ఏకంగా 39% గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ లేదు! ఇవన్నీ అటవీ ప్రాంతంలోని గ్రామాలు కావడంతో రోడ్లు నిర్మించాలంటే సుప్రీంకోర్టు అనుమతి తప్పనిసరి. ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేక వీరంతా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,125 కి.మీ. రోడ్ల పునరుద్ధరణకు బీజేపీ ప్రభుత్వం పనులు మొదలు పెట్టింది. అగ్నిపథ్ త్రివిధ బలగాల్లో కాంట్రాక్ట్ నియామకానికి కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకం మంచుకొండల్లో మంటలు రాజేసింది. 70 లక్షల హిమాచల్ జనాభాలో ఏకంగా 10 శాతం పని చేస్తున్న, లేదా రిటైర్డ్ సైనికులే ఉన్నారు. ఎందరో యువకులు సైన్యంలో చేరాలని ఆశతో శిక్షణ పొందుతున్న సమయంలో బీజేపీ తెచ్చిన పథకం వారిని నిరాశలో ముంచింది. ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా ఎన్నికల్లో అత్యంత ప్రభావిత అంశంగా మారింది. 2004లో నాటి బీజేపీ ప్రభుత్వం దీన్ని నిలిపివేసింది. పాత పెన్షన్ పథకం ప్రకారం ఉద్యోగులు ఆఖరిగా తీసుకున్న జీతంలో 50 శాతం పెన్షన్‌గా ఇస్తారు. కొత్త స్కీమ్‌లో ఉద్యోగుల జీతం నుంచి 10%, ప్రభుత్వ వాటాగా 14% ఇస్తారు. కాంగ్రెస్, ఆప్ పాత పథకం తెస్తామంటున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘డబుల్ ఇంజన్’కు అగ్నిపరీక్ష
సాధారణంగా ప్రశాంతంగా సాగే హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి మాత్రం అక్షరాలా యుద్ధాన్నే తలపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార బీజేపీ ‘డబుల్ ఇంజన్’ నినాదానికి అగ్నిపరీక్షగా మారాయి. అంతేగాక బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌లోని ముఖ్య నేతల ప్రతిష్టకూ సవాలుగా పరిణమించాయి. మోదీ కరిష్మాతో అధికారం నిలబెట్టుకుంటామని కమలనాథులు ఆశిస్తుండగా ప్రభుత్వ వ్యతిరేకతే గట్టెక్కిస్తుందని కాంగ్రెస్ నమ్ముతోంది. 1985 నుంచి రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకీ వరుసగా రెండోసారి అధికారం కట్టబెట్టని రివాజు ఈసారీ కొనసాగుతుందని ఆశిస్తోంది. మూడో పార్టీగా ఆప్ ఉనికి పోటీని మరింత సంక్లిష్టంగా మార్చేసింది. అన్ని పార్టీలూ హోరాహోరీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ రెండుసార్లే ప్రచారం చేసినా రాష్ట్రమంతా కలియదిరిగారు. రాహుల్‌గాంధీ కూడా భారత్ జోడో యాత్రకు బ్రేకి చ్చి ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక బీజేపీ నుంచి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఉద్యోగుల్లోనూ అసంతృప్తి మోదీ వ్యక్తిగత ఆకర్షణకు తిరుగు లేకపోయినా కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వముంటే డబుల్ ఇంజన్ ప్రగతి సాధ్యమన్న బీజేపీ మాటలను హిమాచల్ జనాలు ఎంతవరకు నమ్ముతున్నారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీన్ని రాష్ట్ర ప్రజలు పెద్దగా నమ్మడం లేదని హిమాచల్‌కు చెందిన శశికుమార్ అనే రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడుతున్నారు. ధరల పెరుగుదల మొదలుకుని ఏ సమస్యకూ గత ఐదేళ్లలో పరిష్కారం దొరికింది లేదన్నది వారి ఆరోపణగా ఉంది. దీనికి తోడు పాత పెన్షన్ స్కీం కోసం రెండు లక్షలకు పైగా ప్రభుత్వోద్యోగులు చేస్తున్న డిమాండ్ కూడా బీజేపీకి కాస్త ప్రతికూలమేనంటున్నారు. దీన్ని తనకు అనువుగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రెబెల్స్‌ను కట్టడి చేయడంలో కమలనాథులు విఫలమవుతున్న తీరు విశ్లేషకులనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏకంగా 24కు పైగా సీట్లలో వాళ్లు స్వతంత్రులుగా బరిలో దిగుతున్నారు. ఇది కూడా బీజేపీ విజయావకాశాలను బాగా దెబ్బ కొడుతుందన్నది కాంగ్రెస్ ఆశ. తమకు రెబెల్స్ బెడద మరీ అంతగా లేకపోవడం మరింత కలిసొచ్చే అంశమని పార్టీ నమ్ముతోంది. కాకలు తీరిన నాయకుడు వీరభద్రసింగ్ గత ఏడాది మరణించాక రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కాస్త బలహీనంగానే మారింది. సీఎం పోస్టుకు కనీసం అర డజను మంది పోటీదారులు ఉండటంతో ఇంటి పోరు నానాటికీ పెరిగిపోతోంది. ఆప్ కూడా రంగంలో ఉన్నా ప్రధానంగా రాష్ట్రంలో ఉనికి చాటుకునేందుకే పరిమితమయ్యేలా కన్పిస్తోంది. అయితే గత ఎన్నికల్లో నోటాకు గణనీయంగా ఓట్లు పడ్డాయి. ఏకంగా 12 స్థానాల్లో నోటాదే మూడో స్థానం! ఈ ఓట్లన్నీ ఈసారి ఆప్ ఖాతాలోకి వెళ్లే అవకాశం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్ పోటీ బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశం. కింగ్‌మేకర్ కాంగ్రా: కాంగ్రా జిల్లా మరోసారి కింగ్‌మేకర్‌గా అవతరించే అవకాశం కన్పిస్తోంది. 1993 నుంచి ఈ జిల్లాలో అత్యధిక సీట్లు గెలుచుకునే పార్టీయే అధికారం చేజిక్కించుకుంటూ వస్తోంది. జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లలో 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ 10 సీట్లు, 2017 ఎన్నికల్లో బీజేపీ 11 గెలిచి ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. ‘‘రెండు పార్టీలకూ ఇక్కడ అటూ ఇటుగా 40 శాతం చొప్పున ఓటు బ్యాంకుంది. 3 నుంచి 5 శాతం ఓట్లరు మాత్రమే ఒక్కోసారి ఒక్కో పార్టీకి ఓటేస్తూ కీలకంగా మారుతున్నారు’’ అని హిమాచల్ వర్సిటీలో పొలిటికల్ ప్రొఫెసర్ హరీశ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. కాంగ్రాలో కులం చాలా ప్రభావం చూపుతుందన్నారాయన. మిగతా రాష్ట్రంలో మాదిరిగా ఇక్కడా రాజ్‌పుత్‌లదే ప్రాబల్యం. జిల్లా జనాభాలో వారు 34 శాతముంటారు. 32 శాతమున్న ఓబీసీలు, 20 శాతమున్న బ్రాహ్మణులు కూడా ప్రభావం చూపుతారు. గద్దీ తదితర పర్వత ప్రాంతీయులది 14 శాతం వాటా. దాంతో బీజేపీ, కాంగ్రెస్ రెండూ రాజ్‌పుత్, గద్దీ నేతలకు ఎక్కువ టికెట్లిచ్చాయి. బీజేపీ ప్రభుత్వ పనితీరుపై మెజారిటీ ప్రజలు పెదవి విరుస్తుండటం కలవరపెడుతోంది. ధరల పెరుగుదలపై జనంలో ఆగ్రహం ఉంది. అందుకే అభ్యర్థిని కాకుండా తనను చూసి ఓటేయాలని ప్రధాని ప్రచార సభల్లోనూ విజ్ఞప్తి చేస్తున్నారు. స్వతంత్రులే కీలకం? ఈసారి 20కి పైగా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆరుగురు స్వతంత్రులు నెగ్గారు. ఈసారి ఈ సంఖ్య బాగా పెరిగేలా కన్పిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే చివరికి స్వతంత్రులే ప్రభుత్వ ఏర్పాటును శాసించే శక్తిగా అవతరించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం విన్పిస్తోంది. ఎన్నికల అంశంగా అగ్నిపథ్ రాష్ట్రంలో సగం అసెంబ్లీ సీట్లున్న కాంగ్రా, హమీర్పూర్, ఉనా, మండీ జిల్లాల్లో అగ్నిపథ్ పథకం పెద్ద ఎన్నికల అంశంగా మారింది. ఎందుకంటే ఈ నాలుగు జిల్లాల్లో ఏకంగా 1.3 లక్షల మంది మాజీ, 40 వేల మంది సర్వీసులో ఉన్న సైనికులున్నారు! అంటే ప్రతి మూడిళ్లకు ఒకరన్నమాట!! ఈ జిల్లాలకు ప్రధాన ఉపాధి వనరు సైన్యమే. ఈ నాలుగు జిల్లాల నుంచి ఏటా కనీసం 4 వేల మంది యువకులు సైన్యంలో చేరుతుంటారు. అగ్నిపథ్ రాకతో రెజిమెంట్‌వారీ భర్తీ విధానం రద్దవడంతో రాష్ట్రం నుంచి నియామకాలు మూడో వంతు తగ్గనున్నాయి. ఇది కచ్చితంగా బీజేపీకి వ్యతిరేకమవుతుందని కాంగ్రాకు చెందిన మేజర్ జనరల్ (రిటైర్డ్) రాణా అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement