నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం సాయంత్రం భేటీ కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు.ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్ట సవరణతో పాటు, మైనారిటీ, గిరిజన రిజర్వేషన్ల బిల్లు, సెంట్రల్‌ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ (రిజిస్ట్రేషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌)ను రాష్ట్రానికి అన్వయించుకునే బిల్లు, రాష్ట్ర మార్కెటింగ్‌ చట్టానికి సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి.

Back to Top