Sakshi News home page

ఇంటిదొంగల పనే!

Published Wed, Oct 29 2014 1:18 AM

ఇంటిదొంగల పనే! - Sakshi

పెబ్బేరు: మండలంలోని శ్రీరంగాపూర్ రంగనాయకస్వామి ఆలయంలో అపహరణకు గురైన 50కిలోల రామానుజాచార్యుల పంచలోహ విగ్రహ అపహరణ కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. చోరీ వెనుక ఇంటిదొంగల హస్తం ఉందనితేల్చారు.ఈ ఘటనకుపాల్పడిన పదిమంది నిందితు లను అరెస్ట్‌చేశారు. ఈ మేరకు మంగళవారం పెబ్బేరు పో లీస్‌స్టేషన్‌లో అదనపు ఎస్పీ మల్లారెడ్డి, వనపర్తి డీఎస్పీ చెన్నయ్య, కొత్తకోట సీఐ రమేష్‌బాబు వివరాలను వెల్లడిం చారు.

పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్‌లోని రంగనాయకస్వామి ఆలయంలో ఉన్న విలువైన పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లాలని వీపనగండ్లకు చెందిన హవల్దార్ నరేందర్ ప థకం రచించారు. దీంతో తన అత్త మంగమ్మతో పాటు స్నే హితులు, ఆలయసిబ్బంది సహకారం తీసుకున్నారు.

ముందుగా మంగమ్మ ఆలయ పూజారి అద్దంకి రామాచార్యులతో సన్నిహితంగా ఉండే శ్రీరంగాపూర్ వాసి కమ్మరి భారతిని కలిసింది. ఆలయంలోని రామానుజాచార్యుల పంచలోహవిగ్రహానికి సంబంధించిన వివరాలు సేకరించాలని పూజారిని కోరింది. అనంతరం రామాచార్యులు, ఆలయ సూపర్‌వైజర్ గోపాల్‌రెడ్డికి పెద్దమొత్తంలో డబ్బులు అందజేశారు.

 చోరీ జరిగిందిలా..
 పథకంలో భాగంగా ఈనెల 15న నరేందర్, రవికుమార్, మజర్‌అలీ, హసన్‌పీర్, మంగమ్మ, భారతి మూడు బైక్‌లపై ఆలయం వద్దకు చేరుకున్నారు. అదేరోజు సాయంత్రం ఏడుగంటలకు సాధారణ భక్తుల మాదిరిగా పూజ సామగ్రి తీసుకుని రామాచార్యులు, గోపాల్‌రెడ్డికి ముందుగానే విషయం చెప్పి లోపలికి వెళ్లారు. వ్యూహంలో భాగంగానే పూజారి గుడికి తాళం వేసి బయటికొచ్చాడు.   

కాసేపటి తర్వాత లోపలికి వెళ్లినవారు సీసీటీవీ ఫుటేజీ రికార్డర్‌ను తీసుకుని పంచలోహ విగ్రహాన్ని దొంగిలించి తమ ఆనవాళ్లు తెలియకుండా కారంపొడి చల్లి ఉత్తరద్వారం గుండా బయటికి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తుచేపట్టారు. దీంతో ఇంటిదొంగల పనిపై  ప్రత్యేకంగా విచారణ జరపడంతో వివరాలు ఆలస్యంగా వెలుగుచూశాయి.

చివరకు మంగళవారం నిందితులు నరేందర్, రవికుమార్, మజర్‌అలీ, హసన్‌పీర్, శ్రావణ్‌కుమార్, సంతోష్, అద్దంకి రామాచార్యులు, గోపాల్‌రెడ్డి, మంగమ్మ, కమ్మరి భారతిని అరెస్ట్‌చేసి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన కొత్తకోట సీఐ రమేష్‌బాబు, పెబ్బేరు ఎస్‌ఐ జితేందర్‌రెడ్డి, ఇతర సిబ్బం దిని ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పంచలోహ విగ్రహం మార్కెట్ విలువను ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు పంపించి తెలుసుకుంటామన్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement