'వర్సిటీల ప్రతిష్టను టీఆర్ఎస్ దిగజార్చుతోంది' | Sakshi
Sakshi News home page

'వర్సిటీల ప్రతిష్టను టీఆర్ఎస్ దిగజార్చుతోంది'

Published Thu, Jul 28 2016 4:26 PM

'వర్సిటీల ప్రతిష్టను టీఆర్ఎస్ దిగజార్చుతోంది' - Sakshi

హైదరాబాద్‌: యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేయడం ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటిదని మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేసీఆర్ సర్కార్ విద్యావ్యవస్థను శవపేటికలో పెట్టిందని దుయ్యబట్టారు. కోర్టులు ఇలా ప్రభుత్వాన్ని తప్పు పట్టడం ఇది 15సారి అన్నారు. యూనివర్సిటీల గౌరవాన్ని పెంచేలా కాంగ్రెస్ వ్యవహరిస్తే టీఆర్‌ఎస్ రెండేళ్లలో తప్పుడు విధానాలతో వర్సిటీల ప్రతిష్టను దిగజార్చిందని అన్నారు. వీసీల నియామకాన్ని కోర్టు రద్దు చేసినందున నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మత్తులో ఉండి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని, కాబట్టే కోర్టులు తప్పుబడుతున్నాయన్నారు. కాంగ్రెస్ పదేళ్ల పాలన చూసైనా కేసీఆర్ నేర్చుకోవాలని హితవు పలికారు.
 

Advertisement
Advertisement