-
వరుస ఓటములు ఎదుర్కొంటున్న హార్దిక్ సేనకు మరో బిగ్ షాక్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వరుస ఓటములు ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. నిన్న (ఏప్రిల్ 30) లక్నోతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఫీజ్‌లో 24 లక్షల కోత పడింది. ఇంపాక్ట్ ప్లేయర్ సహా జట్టు సభ్యులందరికి 6 లక్షల జరిమానా విధించారు. హార్దిక్ ఈ సీజన్లో రెండో సారి స్లో ఓవర్ రేట్‌కు కారుకుడు కావడంతో అతనికి భారీ జరిమానా పడింది.కాగా, లక్నో సూపర్ జెయింట్స్‌తో నిన్న జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. లక్నో బౌలర్లు రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేసింది.ఇషాన్ కిషన్ (32), నేహల్ వధేరా (46), టిమ్ డేవిడ్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్ శర్మ (4), సూర్యకుమార్ (10), తిలక్ వర్మ (7), హార్దిక్ పాండ్యా (0), మొహమ్మద్ నబీ (1) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మొహిసిన్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. ఆపసోపాలు పడి 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. స్టోయినిస్ (62) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి లక్నోను గెలిపించాడు. రాహుల్ (28), దీపక్ హూడా (18), పూరన్ (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార, గెరాల్డ్ కొయెట్జీ, నబీ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతు కాగా.. లక్నో ఈ సీజన్ ఆరో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. -
ఐపీఎల్లో నేటి (మే 1) మ్యాచ్.. చెన్నైని ఢీకొట్టనున్న పంజాబ్
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (మే 1) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. పటిష్టమైన సీఎస్కేను సంచలనాల పంజాబ్ ఢీకొట్టబోతుంది. చెన్నై హోం గ్రౌండ్లో జరుగనున్న ఈ మ్యాచ్ జరుగనుంది. చెన్నై ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. పంజాబ్ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే సీఎస్కే ఈ మ్యాచ్ అత్యంత కీలకం కాగా.. ప్లే ఆఫ్స్ ఆశలను వదులుకున్న పంజాబ్ ప్రత్యర్దులను ఇరుకున పెట్టే పనిలో ఉంది. సీఎస్కే, పంజాబ్‌లు ఈ సీజన్లో మరో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 28 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. సీఎస్కే 15, పంజాబ్ 13 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. తుది జట్లు (అంచనా)..సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ధోనీ, మొయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీష పతిరణ, ముస్తాఫిజుర్ రెహమాన్ [ఇంపాక్డ్ ప్లేయర్: శార్దూల్ ఠాకూర్/సమీర్ రిజ్వీ]పంజాబ్: ప్రభ్‌సిమ్రన్ సింగ్, జానీ బెయిర్‌స్టో, రిలీ రొస్సో, శశాంక్ సింగ్, సామ్ కర్రన్, జితేష్ శర్మ, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్ [ఇంపాక్ట్ ప్లేయర్: రాహుల్ చాహర్] -
టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొనే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇదే.. కెప్టెన్‌గా స్పిన్ మాంత్రికుడు
టీ20 వరల్డ్‌కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (మే 1) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ ఎంపికయ్యాడు. 19 ఏళ్ల యువ వికెట్‌కీపింగ్ బ్యాటర్ మొహమ్మద్ ఇషాక్, 20 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నంగ్యాల్ ఖరోటిలకు వరల్డ్‌కప్ జట్టులో అనూహ్యంగా చోటు దక్కింది. గత వరల్డ్‌కప్‌లో ఆడని కరీం జనత్, నూర్ అహ్మద్‌లకు ఈసారి అవకాశం దక్కింది. ఆఫ్ఘన్ల ప్రధాన బలమైన స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్‌తో పాటు మొహమ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్ ఉన్నారు. పేసర్ల విభాగంలో నవీన్ ఉల్ హాక్, ఫరీద్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూకీ వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికయ్యారు. వికెట్కీపర్ల కోటాలో రహ్మానుల్లా గుర్భాజ్ జట్టులోకి రాగా.. స్పెషలిస్ట్ బ్యాటర్లుగా ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్ ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్ల కోటాలో కరీం జనత్, గుల్బదిన్ నైబ్, హజ్రతుల్లా ఒమర్జాయ్ వరల్డ్‌కప్ జట్టులోకి వచ్చారు. సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీం సఫీ ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు.జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ పోరాటం జూన్ 3న మొదలవుతుంది. ఆ రోజు గయానా వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు ఉగాండతో తలపడతారు. జూన్ 7న ఇదే వేదికపై వీరు పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఢీకొంటారు. గ్రూప్-సిలో ఆఫ్ఘనిస్తాన్.. వెస్టిండీస్, న్యూజిలాండ్, ఉగాండ, పపువా న్యూ గినియా జట్లతో పోటీపడుతుంది. టీ20 వరల్డ్‌కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్ (వికెట్‌కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, రషీద్ ఖాన్ (కెప్టెన్), నంగ్యాల్ ఖరోటీ, ముజీబ్ ఉర్ రహ్మన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హాక్, ఫజల్హాక్ ఫరూకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్ట్రావెలింగ్ రిజర్వ్స్: సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీం సఫీ -
టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్
వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (మే 1) ప్రకటించారు. విధ్వంసకర వీరులతో నిండిన ఈ జట్టుకు మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. ముందుగా ప్రచారం జరిగినట్లుగా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఎలాగైనా జట్టులోకి వస్తాడనుకున్న ఐపీఎల్ విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేసర్ మెక్‌గుర్క్‌ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మాట్ షార్ట్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్ లాంటి ఆశావహులకు కూడా మొండిచెయ్యే ఎదురైంది. చివరి వరల్డ్‌కప్ అని ముందుగానే ప్రకటించిన డేవిడ్ వార్నర్‌ను సెలెక్టర్లు కరుణించారు. ఎండ్ ఓవర్స్ స్పెషలిస్ట్ నాథన్ ఎల్లిస్ ఎట్టకేలకు జట్టులోకి వచ్చాడు. దాదాపు 18 నెలలుగా టీ20 జట్టుకు దూరంగా ఉన్న ఆస్టన్ అగర్, కెమరూన్ గ్రీన్‌లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. జోష్ ఇంగ్లిస్‌కు ప్రత్యామ్నాయ వికెట్‌కీపర్‌గా మాథ్యూ వేడ్ జట్టులోకి వచ్చాడు. పేస్ బౌలింగ్ త్రయం పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ కొనసాగనున్నారు. మిచ్ మార్ష్‌తో పాటు ట్రవిస్ హెడ్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్ ఆల్రౌండర్లుగా ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటా ఆడమ్ జంపా జట్టులోకి వచ్చాడు. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ప్రయాణం జూన్ 5న మొదలవుతుంది. ఆసీస్ తమ తొలి మ్యాచ్‌లో పసికూన ఒమన్‌తో తలపడుతుంది. గ్రూప్-బిలో ఆసీస్.. ఇంగ్లండ్, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్‌లతో పోటీపడుతుంది.టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా Cricket Australia invited the World Cup 2007 winners to announce the T20I World Cup 2024 squad including the children of Andrew Symonds. 🫡- Great initiative by Australia...!!!! pic.twitter.com/l8mhzxu7ww— Johns. (@CricCrazyJohns) May 1, 2024 వరల్డ్‌కప్ విన్నర్లతో..క్రికెట్ ఆస్ట్రేలియా తమ వరల్డ్‌కప్ జట్టును వినూత్నంగా ప్రకటించింది. 2007 వన్డే వరల్డ్‌కప్ విన్నర్లు ఆసీస్ టీ20 వరల్డ్‌కప్ జట్టును అనౌన్స్ చేశారు. జట్టును ప్రకటించిన వారిలో దివంగత ఆండ్రూ సైమండ్స్ కొడుకు, కూతురు ఉండటం విశేషం. -
ప్రపంచకప్ వేటకు సిద్ధం
టి20 ప్రపంచకప్ సమరాన్ని గెలిచేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరోసారి అనుభవాన్నే నమ్ముకుంది. ఐపీఎల్లో అద్భుత బ్యాటింగ్‌తో కొందరు కుర్రాళ్లు అదరగొడుతున్నా... సీనియర్లకు ప్రాధాన్యతనిచ్చింది. దీంతో పాటు ప్రస్తుతం ఫామ్ గొప్పగా లేకున్నా... అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఇప్పటికే ఎంతో కొంత ప్రభావం చూపించిన వారిపైనే కమిటీ విశ్వాసం ఉంచింది. గత టి20 వరల్డ్ కప్‌లో ఆడిన 9 మందికి ఈసారి మళ్లీ అవకాశం కర్నీచింది. అందుకే వరల్డ్ కప్ టీమ్ సెలక్షన్ దాదాపుగా అంచనాలకు తగినట్లుగానే సాగింది. ఒకరిద్దరు ఆటగాళ్ల ఎంపిక విషయంలో కాస్త ఆశ్చర్యకర నిర్ణయాలు కనిపించినా... మొత్తంగా అర్హత కలిగిన వారికే అమెరికా–వెస్టిండీస్ వీసా లభించింది. గత వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత పూర్తిగా కుర్రాళ్లతో టి20ల్లో బోర్డు కొత్త ప్రయోగాలు చేసినా... తర్వాతి మెగా టోర్నీకి వచ్చేసరికి మళ్లీ తమ పాత ప్రణాళికకే కట్టుబడటం చెప్పుకోదగ్గ అంశం. అహ్మదాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 9వ టి20 ప్రపంచకప్ కోసం భారత సెలక్టర్లు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బోర్డు సెలక్షన్ కమిటీ మంగళవారం సమావేశమై ఆటగాళ్లను ఎంపిక చేసింది. రోహిత్ శర్మ వరుసగా రెండో టి20 ప్రపంచకప్‌లో కెప్టెన్ హోదాలో బరిలోకి దిగనుండగా... 2022లో ఆ్రస్టేలియా గడ్డపై టి20 వరల్డ్ కప్‌లో ఆడిన వారిలో 9 మంది ఈసారీ టీమిండియా చాన్స్ దక్కించుకున్నారు. గత టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరింది. సెలక్టర్లు ప్రకటించిన జట్టులో నలుగురు బ్యాటర్లు, ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లు, ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు, నలుగురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. మరో నలుగురు ఆటగాళ్లను ‘రిజర్వ్’లుగా కూడా ఎంపిక చేశారు. జూన్ 1 నుంచి 29 వరకు జరిగే వరల్డ్ కప్‌లో గ్రూప్ ‘బి’లో ఉన్న భారత్ జూన్ 5న తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడుతుంది.ఆ తర్వాత జూన్ 9, 12, 15 తేదీల్లో వరుసగా పాకిస్తాన్, అమెరికా, కెనడా జట్లను టీమిండియా ఎదుర్కొంటుంది. ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ చేరని జట్ల ఆటగాళ్లతో కూడిన మొదటి బృందం ఈ నెల 21న ముందుగా కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు అమెరికాకు బయల్దేరుతుంది. జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్ ), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సంజూ సామ్సన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, అర్‡్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్. రిజర్వ్ ఆటగాళ్లు: శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్. ఐపీఎల్ ప్రదర్శనతోనే... జట్టు ఎంపికలో తాజా ఐపీఎల్ ప్రదర్శనను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారా అంటే అవునని, కాదని కూడా సమాధానం వస్తుంది. చెన్నై తరఫున మిడిలార్డర్లో సిక్సర్లతో చెలరేగిపోతున్న శివమ్ దూబేకు ఐపీఎల్ కారణంగానే పిలుపు దక్కింది. ఈ టోర్నీలో అతను ఏకంగా 172.41 స్ట్రయిక్‌రేట్‌తో 350 పరుగులు సాధించాడు. భారత్‌కు ఆడిన 21 టి20ల్లో కూడా అతను ఆకట్టుకున్నాడు. ఇక కారు ప్రమాదం నుంచి కోలుకొని ఐపీఎల్లో రాణిస్తున్న రిషభ్ పంత్‌ను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. లీగ్‌లో అతను 158.58 స్ట్రయిక్‌రేట్‌తో 398 పరుగులు చేశాడు. అయితే పరుగులకంటే పూర్తి ఫిట్‌గా పంత్ కనిపించడం కూడా సానుకూలాంశంగా మారింది. మరోవైపు రెండో వికెట్ కీపర్‌గా కేరళకు చెందిన సంజూ సామ్సన్ కూడా ఎంపికయ్యాడు. ఐపీఎల్లో కెప్టెన్ గా రాజస్తాన్ రాయల్స్ టీమ్‌ను సమర్థంగా నడిపించడంతో పాటు 161.08 స్ట్రయిక్‌రేట్‌తో సామ్సన్ 385 పరుగులు సాధించాడు. ఎవరు... ఎందుకు... ఎలా? 2022 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన ఆడిన జట్టుతో పోలిస్తే రోహిత్, కోహ్లి, సూర్యకుమార్, పంత్, హార్దిక్, అక్షర్, అర్‡్షదీప్, చహల్, బుమ్రా (టోర్నీకి ముందు గాయంతో తప్పుకున్నాడు) తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. 2021, 2022లో వరల్డ్ కప్‌లలో ఆడిన జట్టులో దాదాపు అదే టాప్–6 ఇప్పుడు కూడా మళ్లీ ఎంపికయ్యారు. కేఎల్ రాహుల్ స్థానంలో యశస్వి రావడం మినహా ఎలాంటి మార్పూ లేదు. యశస్వి ఈ సీజన్ ఐపీఎల్లో వరుస వైఫల్యాల తర్వాత సెంచరీతో ఆకట్టుకోవడంతో అతనికి అవకాశం దక్కింది. బ్యాటింగ్‌లో ఇప్పుడు కావాల్సిన ‘ఫైర్’ లేదని ఎన్ని విమర్శలు వస్తున్నా అగ్రశ్రేణి బ్యాటర్లుగా రోహిత్, కోహ్లిల స్థానం ఎప్పుడూ ప్రశ్నార్ధకం కాదు. సూర్యకుమార్ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. రవీంద్ర జడేజా కూడా గొప్ప ప్రదర్శన చేయకపోయినా ఆల్‌రౌండ్ నైపుణ్యం అతనికి కలిసొచ్చింది. జడేజా ఉన్న తర్వాత అక్షర్ పటేల్ ఎంపిక కూడా కాస్త ఆశ్చర్యకరమే. హార్దిక్ మళ్లీ... ఇటీవల ఆటలో వైఫల్యాలతో పాటు ముంబై కెప్టెన్సీ వ్యవహారాలతో అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యాకు సెలక్టర్లు మాత్రం అండగా నిలిచారు. వన్డే వరల్డ్ కప్‌లో గాయపడి కోలుకున్న తర్వాత భారత్‌కు ఆడకపోయినా అతనిపై నమ్మకముంచారు. ఐపీఎల్‌లోనూ విఫలమైనా... అతని తరహాలో సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ స్థానం కోసం ప్రత్యామ్నాయం లేక ఎంపిక చేయక తప్పలేదు. దూబే అస్సలు బౌలింగ్ చేయకపోవడం, హార్దిక్ ఎన్నో కొన్ని ఓవర్లు వేస్తుండటం వల్ల కూడా అతని స్థానానికి ఢోకా లేకుండా పోయింది. నలుగురు స్పిన్నర్లతో... అమెరికాలో తొలిసారి వరల్డ్ కప్ జరుగుతుండంతో కొత్తగా అక్కడ తయారు చేస్తున్న పిచ్‌లు ఎలా ఉంటాయో సరిగ్గా ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి. అయితే స్పిన్‌కు అవకాశం ఉంటే తమ అన్ని అస్త్రాలను వాడుకునేందుకు భారత్ సిద్ధమైంది. జడేజా, అక్షర్‌లతో పాటు కుల్దీప్, యుజువేంద్ర చహల్‌లు జట్టులో ఉన్నారు. కుల్దీప్ చాలా కాలంగా మంచి ఫామ్‌లో ఉండగా... గత రెండు సిరీస్‌లలో భారత జట్టులో చోటు దక్కించుకోని చహల్ పునరాగమనం చేసి తొలిసారి టి20 వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మధ్య ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు వీరిని వాడుకోవచ్చు. బుమ్రాకు తోడుగా అర్‡్షదీప్, సిరాజ్‌లను ఎంపిక చేశారు. ఈ ఫార్మాట్లో గొప్ప ప్రదర్శన లేకపోయినా, ఐపీఎల్‌లోనూ పెద్దగా రాణించలేకపోతున్నా... ప్రస్తుత స్థితిలో అనుభవం ఉన్న పేసర్ అతనే కావడంతో సిరాజ్‌కు తొలిసారి టి20 ప్రపంచకప్ ఆడే చాన్స్ లభించింది. లెఫ్టార్మ్ పేసర్ కావడమే అర్‡్షదీప్ బలం. కొంత కాలంగా లయ కోల్పోయి ఇబ్బంది పడుతున్నా అర్‡్షదీప్‌ను సెలక్టర్లు మళ్లీ నమ్మారు. గత వరల్డ్ కప్‌లో సెమీస్ ఓటమి తర్వాత మళ్లీ అంతర్జాతీయ టి20 ఆడని రాహుల్‌ను తప్పించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అతని స్ట్రయిక్‌రేట్ కూడా అంతంత మాత్రమే. రాహుల్ తరహాలోనే శుబ్‌మన్ గిల్ కూడా ఈ ఫార్మాట్లో పెద్దగా ప్రభావం చూపించింది లేదు. పాపం రింకూ సింగ్... వరల్డ్ కప్ జట్టు ఎంపికలో అన్ని రకాలుగా చర్చకు దారి తీసిన విషయం రింకూ సింగ్‌ను ఎంపిక చేయకపోవడం. విధ్వంసకర బ్యాటింగ్‌తో గత ఏడాది ఐపీఎల్ నుంచి అతను తానేంటో నిరూపించుకున్నాడు. లోయర్ మిడిలార్డర్లో ఫినిషర్‌గా సత్తా చాటాడు.భారత్ తరఫున లభించిన పరిమిత అవకాశాల్లో (11 ఇన్నింగ్స్‌లు) ఏకంగా 176.23 స్ట్రయిక్ రేట్, 89 సగటుతో పరుగులు సాధించాడు. కానీ చివరకు వచ్చేసరికి అతనికి వరల్డ్ కప్ చాన్స్ లభించలేదు. ఈసారి ఐపీఎల్లో గొప్పగా ఆడకపోవడం వాస్తవమే అయినా కోల్‌కతా టాపార్డర్ రాణిస్తుండటంతో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. 9 మ్యాచ్‌లలో కేవలం 82 బంతులే ఆడే చాన్స్ దక్కింది. మిడిలార్డర్లో భారీ షాట్లు కొట్టే సామర్థ్యం ఉన్న బ్యాటర్ కోసం జరిగిన చర్చలో రింకూపై దూబేదే పైచేయి అయింది. ఒకవేళ తుది జట్టులో హార్దిక్‌ను తప్పించాల్సి వచ్చినా... దూబే బౌలింగ్ ఎంతో కొంత ఉపయోగపడగలదని సెలక్టర్లు భావించారు. రోహిత్ శర్మవయసు: 37 ఆడిన టి20లు: 151 చేసిన పరుగులు: 3974 అత్యధిక స్కోరు: 121 నాటౌట్ సెంచరీలు: 5 అర్ధ సెంచరీలు: 29 స్ట్రయిక్‌రేట్: 139.97 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 8 విరాట్ కోహ్లి వయసు: 35 ఆడిన టి20లు: 117 చేసిన పరుగులు: 4037 అత్యధిక స్కోరు: 122 నాటౌట్ సెంచరీలు: 1 అర్ధ సెంచరీలు: 37 స్ట్రయిక్‌రేట్: 138.15 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 5సూర్యకుమార్వయసు: 33 ఆడిన టి20లు: 60 చేసిన పరుగులు: 2141 అత్యధిక స్కోరు: 117 సెంచరీలు: 4 అర్ధ సెంచరీలు: 17 స్ట్రయిక్‌రేట్: 171.55 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 2 హార్దిక్ పాండ్యా వయసు: 30 ఆడిన టి20లు: 92 చేసిన పరుగులు: 1348 అత్యధిక స్కోరు: 71 నాటౌట్ అర్ధ సెంచరీలు: 3 స్ట్రయిక్‌రేట్: 139.88 తీసిన వికెట్లు: 73 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 3 రిషభ్ పంత్ వయసు: 26 ఆడిన టి20లు: 66 చేసిన పరుగులు: 987 అత్యధిక స్కోరు: 65 నాటౌట్ అర్ధ సెంచరీలు: 3 స్ట్రయిక్‌రేట్: 126.37 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 2 శివమ్ దూబే వయసు: 30 ఆడిన టి20లు: 21 చేసిన పరుగులు: 276 అత్యధిక స్కోరు: 63 నాటౌట్ అర్ధ సెంచరీలు: 3 తీసిన వికెట్లు: 8 స్ట్రయిక్‌రేట్: 145.26 ఇదే తొలి టి20 వరల్డ్‌కప్ అర్‡్షదీప్ సింగ్వయసు: 25 ఆడిన టి20లు: 44 తీసిన వికెట్లు: 62 ఉత్తమ బౌలింగ్: 4/37 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 1 యుజువేంద్ర చహల్ వయసు: 33 ఆడిన టి20లు: 80 తీసిన వికెట్లు: 96 ఉత్తమ బౌలింగ్: 6/25 ఇదే తొలి టి20 వరల్డ్‌కప్ కుల్దీప్ యాదవ్ వయసు: 29 ఆడిన టి20లు: 35 తీసిన వికెట్లు: 59 ఉత్తమ బౌలింగ్: 5/17 ఇదే తొలి టి20 వరల్డ్‌కప్ రవీంద్ర జడేజావయసు: 35 ఆడిన టి20లు: 66 చేసిన పరుగులు: 480 అత్యధిక స్కోరు: 46 నాటౌట్ స్ట్రయిక్‌రేట్: 125.32 తీసిన వికెట్లు: 53 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 5 సంజూ సామ్సన్ యశస్వి జైస్వాల్ వయసు: 22 ఆడిన టి20లు: 17 చేసిన పరుగులు: 502 అత్యధిక స్కోరు: 100 సెంచరీలు: 1 అర్ధ సెంచరీలు: 4 స్ట్రయిక్‌రేట్: 161.93 ఇదే తొలి టి20 వరల్డ్‌కప్ జస్ప్రీత్ బుమ్రావయసు: 30 ఆడిన టి20లు: 62 తీసిన వికెట్లు: 74 ఉత్తమ బౌలింగ్: 3/11 ఆడిన టి20 ప్రపంచకప్‌లు: 2 మొహమ్మద్ సిరాజ్ వయసు: 30 ఆడిన టి20లు: 10 తీసిన వికెట్లు: 12 ఉత్తమ బౌలింగ్: 4/17 ఇదే తొలి టి20 వరల్డ్‌కప్ అక్షర్ పటేల్ వయసు: 30; ఆడిన టి20లు: 52 చేసిన పరుగులు: 361 తీసిన వికెట్లు: 49ఉత్తమ బౌలింగ్: 3/9 ఇదే తొలి టి20 వరల్డ్‌కప్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
మీరెన్నయినా చెప్పండీ! కొన్ని ఫేక్ న్యూస్‌తో వచ్చే కిక్కే వేరు..!
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
- Hassan sex scandal: రాజుకుంటున్న పెన్‌డ్రైవ్
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ..!
- స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్‌తో భార్య సర్ప్రైజ్
- కార్మిక సోదరులకు సీఎం జగన్ మే డే శుభాకాంక్షలు
- ఈసారి ఓటు మార్పు కోసమే
- మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
- కృష్ణమ్మ తీరం విజయహారం
- వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
Advertisement