నా అన్వేషణ ఆగదు! | Sakshi
Sakshi News home page

నా అన్వేషణ ఆగదు!

Published Sat, Mar 12 2016 11:35 PM

నా అన్వేషణ ఆగదు! - Sakshi

 సినిమాల్లో నటించామా? అభినందనలు అందుకున్నామా? వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించామా? అన్నట్లుగా ఉండరు శ్రీయ. నాలుగు ప్రదేశాలకు వెళ్లి, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం ఆమె అలవాటు. ఆ విషయం గురించి శ్రీయ చెబుతూ - ‘‘ప్రపంచం చాలా పెద్దది. అందులో జీవితం ఓ ప్రయాణంలాంటిది. ఈ ప్రయాణంలో వీలైనన్ని విషయాలు తెలుసుకోవాలని ఆరాటపడుతుంటాను. నేను నిరంతర అన్వేషిని.
 
  కొత్త కొత్త విషయాలను అన్వేషించినప్పుడు నాకు లభించే ఆనందాన్ని దేనితోనూ వెలకట్టలేను. జీవితంలో జయాపజయాలు వస్తుంటాయ్.. పోతుంటాయ్. ఏదీ మన ప్రయాణానికి ఆటంటకం కలిగించకూడదు. నా మటుకు నేను వీలు కుదిరినప్పుడల్లా దేశాలు చుట్టి వస్తాను. అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుంటాను. నేనెప్పుడూ ఆనందంగా ఉంటాను. ఇతరులను ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. జీవితం నన్ను ఎటువైపు తీసుకెళితే అటు వైపు వెళ్లిపోతాను. ఏదీ ప్లాన్ చేయను’’ అన్నారు.
 

Advertisement
Advertisement