ధనుష్‌తో సాయిపల్లవి రొమాన్స్‌

Sai Pallavi act with Dhanush

తమిళసినిమా: ప్రేమమ్‌ చిత్ర నాయకి నటుడు ధనుష్‌తో రొమాన్స్‌ చేయడానికి రెడీ అవుతోంది. ధనుష్‌ నటించిన మారి చిత్రం 2015లో తెరపైకి వచ్చి మంచి మాస్‌ ఎంటర్‌టెయినర్‌గా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. బాలాజీమోహన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి కాజల్‌అగర్వాల్‌ నాయకిగా నటించారు.  ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని అప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు రెండేళ్ల తరువాత మారి–2 చిత్ర రూపకల్పనకు రెడీ అవుతోంది. అయితే ధనుష్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌అగర్వాల్‌ నటించడం లేదు. నిజానికి తననే హీరోయిన్‌గా నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు, కాజల్‌ అధిక పారితోషికం డిమాండ్‌ చేయడంతో మరో నటి కోసం చిత్ర వర్గాలు ప్రయత్రాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అదే విధంగా మారి–2లో మలయాళ సూపర్‌హిట్‌ చిత్రం ప్రేమమ్‌ నాయకి సాయిపల్లవి ఎంపికైంది.

దీని గురించి దర్శకుడు బాలాజీమోహన్‌ వివరిస్తూ మారి–2లో హీరోయిన్‌ పాత్రకు సాయిపల్లవి లాంటి ఎనర్జిటిక్‌ నటి బాగుంటుందని ఆమెను ఎంపిక చేసినట్లు వివరించారు. సాయిపల్లవిక చిత్రం తమిళంలో రెండవ చిత్రం అవుతుంది. ఇప్పటికే విజయ్‌ దర్శకత్వంలో కరు అనే  చిత్రంలో నటిస్తోందన్నది గమనార్హం. మారి–2 చిత్ర షూటింగ్‌ నవంబర్‌లో సెట్‌పైకి వెళ్లనుందని తెలిపారు. మలయాళంలో సంచలన విజయం సాధించిన ప్రేమమ్‌ చిత్రంలో నటించిన ముగ్గురు హీరోయిన్లతో జత కట్టిన అరుదైన నటుడుగా ధనుష్‌ పేరు నమోదు కానుంది. ప్రేమమ్‌ చిత్రంలో సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరి, మడోనా సెబాస్టియన్‌ ముగ్గురు కధానాయికలు నటించిన విషయం తెలిసిందే. ఇందులో అనుపమపరమేశ్వరి ధనుష్‌తో కొడి చిత్రంలో నటించింది. అదే విధంగా మడోనా సెబాస్టియన్‌ పవర్‌ పాండి చిత్రంలో జత కట్టింది. తాజాగా సాయిపల్లవి మారి–2 చిత్రంలో రొమాన్స్‌ చేయనుంది.

  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top