పెళ్లి వార్తలపై మౌనం వీడిన ప్రియాంక | Sakshi
Sakshi News home page

పెళ్లి వార్తలపై మౌనం వీడిన ప్రియాంక

Published Tue, Aug 7 2018 10:20 AM

Priyanka Chopra Reacts To Rumours About Her Engagement - Sakshi

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా పెళ్లి ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. వయసులో తన కంటే పదేళ్లు చిన్నవాడైన హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌తో ప్రేమలో ఉన్న ప్రియాంక.. త్వరలోనే అతడిని పెళ్లాడనుందని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇప్పటికే ప్రియాంక, నిక్‌ల నిశ్చితార్థం జరిగినట్టు అమెరికన్‌ మీడియా వెల్లడించగా సెప్టెంబర్‌ 16న నిక్‌ బర్త్‌డే సందర్భంగా వీరి వివాహానికీ అదే రోజు ముహుర్తం ఖరారైందని చెబుతున్నారు. అయితే ఇన్నాళ్లుగా ఈ విషయంపై నోరు మెదపని ప్రియాంక ఎట్టకేలకు మౌనం వీడారు.

సోమవారం సింగపూర్‌లో జరిగిన నిక్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్‌కు హాజరైన ప్రియాంక, ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పిగ్గీ చాప్స్‌ను చుట్టుముట్టిన మీడియా.. నిక్‌తో ఆమెకు ఉన్న బంధం గురించి క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరారు. ‘నా మొత్తం జీవితంలో తొంభై శాతం తెరచిన పుస్తకమే. కానీ ఒక్క పది శాతం మాత్రమైనా ప్రైవసీగా ఉండాలని కోరుకుంటా. ముఖ్యంగా వ్యక్తిగత జీవితం గురించి ఓ సాధారణ అమ్మాయిలాగే ఆలోచిస్తా. కొన్ని విషయాలు నాకు మాత్రమే సొంతం కావాలని ఆశించే హక్కు నాకు ఉంది కదా’  అంటూ తన ప్రేమ, పెళ్లి గురించి హింట్‌ ఇచ్చేశారు ఈ 36 ఏళ్ల బ్యూటీ.

Advertisement
Advertisement