150వ సినిమా కోసం చిరంజీవి ఫొటో షూట్!

ఫొటో షూట్ లో పాల్గొన్న చిరంజీవి


హైదరాబాద్: అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ చిత్రం కోసం చిరంజీవి ఫొటో షూట్లో పాల్గొన్నారు. ఈ ఫొటోలు చూస్తుంటే చిరంజీవి పది సంవత్సరాలు వెనుకకు వెళ్లినట్లుగా ఉన్నారు. చాలా స్లిమ్గా తయారయ్యారు. ఈ సినిమా అనుకున్న తరువాత ఆయన ప్రతిరోజూ దాదాపు మూడు గంటలపాటు జిమ్లోనే గడుపుతున్నారు.చిరంజీవి గతంలో నటించిన సినిమాలకు భిన్నంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. రాజకీయాలు ఏమీ లేకుండా పూర్తి హాస్యభరితంగా చిత్రం రూపొందించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కృష్ణ వంశీ, శ్రీను వైట్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో తండ్రితోపాటు రామ్ చరణ్ తేజ కూడా నటించే అవకాశం ఉంది.  పరుచూరి సోదరులు కథ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.


మరిన్ని చిత్రాలకు క్లిక్ చేయండి

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top