కూతుళ్లంటే టెన్షన్ కాదు...టెన్ సన్స్‌కి సమానం! | Sakshi
Sakshi News home page

కూతుళ్లంటే టెన్షన్ కాదు...టెన్ సన్స్‌కి సమానం!

Published Sun, Aug 9 2015 10:32 PM

కూతుళ్లంటే టెన్షన్ కాదు...టెన్ సన్స్‌కి సమానం!

‘మీ కూతుర్ని మీరు ‘బేటా’ (కొడుకు) అని పిలవొచ్చు. కానీ, మీ కొడుకుని మాత్రం ‘బేటీ’ (కూతురు) అని పిలవలేరు. అందుకే కూతుళ్లెప్పుడూ స్పెషల్’’ అని అమితాబ్ బచ్చన్ అన్నారు. ‘డాటర్స్ వీక్’ సందర్భంగా ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. అమితాబ్‌కి ఓ కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఆమె పేరు శ్వేతానంద. కొడుకుని, కూతుర్నీ సమానంగా పెంచారు అమితాబ్. ఇక, డాటర్స్ వీక్ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ - ‘‘కూతుళ్లంటే టెన్షన్‌కి సమా నం కాదు. నేటి ప్రపంచంలో టెన్ సన్స్‌కి సమానం. కూతుళ్లెప్పుడూ ప్రత్యేకమే. నా కూతురు నాకు చాలా చాలా అపురూపం’’ అన్నారు.
 

Advertisement
Advertisement