జుట్టు పట్టుకుని.. కొట్టేసుకున్న అమ్మాయిలు | Sakshi
Sakshi News home page

జుట్టు పట్టుకుని.. కొట్టేసుకున్న అమ్మాయిలు

Published Sat, Oct 29 2016 5:21 PM

జుట్టు పట్టుకుని.. కొట్టేసుకున్న అమ్మాయిలు - Sakshi

వాళ్లిద్దరి మధ్య అంతకుముందు ఏం గొడవలు ఉన్నాయో తెలియదు. కానీ అమెరికాలోని ఫ్లోరిడాలో తన అపార్టుమెంటు ముందు నిలబడి ఉన్న యువతి వద్దకు మరో అమ్మాయి వచ్చింది. వచ్చీ రావడంతోనే మీద పడి కొట్టడం మొదలుపెట్టింది. నిలబడి ఉన్న అమ్మాయి నల్ల టీ షర్టు, కొట్టడానికి వచ్చిన అమ్మాయి ఎర్ర టీషర్టు వేసుకున్నారు. కాసేపటి వరకు ఎర్ర టీషర్టు అమ్మాయిదే పైచేయి అయినా.. ఆ తర్వాత మాత్రం నల్ల టీషర్టు అమ్మాయి పట్టు చిక్కించుకుంది. 
 
అదాటున జుట్టు పట్టేసుకుని.. అప్పటినుంచి మొదలుపెట్టి కుమ్మేసింది. చివరకు ఎర్ర టీషర్టు అమ్మాయి మెట్ల వెనక్కి వెళ్లి దాక్కునే వరకు ఆ ఫైటింగ్ కొనసాగుతూ ఉంది. అప్పటివరకు ఆమెను ముఖం మీద పిడిగుద్దులు కురిపించి, మట్టికరిపించే వరకు ఊరుకోలేదు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వాళ్లిద్దరినీ ఆపేందుకు ఒక సందర్భంలో ప్రయత్నించినా.. అతడి వల్ల కూడా ఏమీ కాలేదు.

Advertisement
Advertisement