కళ్లతో కోట్ల సంపాదన..!

కళ్లతో కోట్ల సంపాదన..!


నార్త్‌ కరోలినా : అతనో దొంగ. ఓ రేపిస్ట్‌. ఐదు నేరారోపణలతో జైలు జీవితం గడుపుతున్నాడు. అలాంటి వ్యక్తి జీవితం ఒక్కసారి టర్న్‌ అవుతుందని, అతని కోటీశ్వరుడు అవుతాడని ఎవరైనా అనుకుంటారా?. మేఖీ జీవితంలో అలాంటి సంచలనం జరిగింది. ఓ మోడలింగ్‌ కంపెనీ కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌ ఇచ్చి బెయిల్‌పై అతన్ని విడిపించుకుంది.అందుకు ఓ కారణం ఉంది. మేఖీ హెటెరోక్రోమియా అని కంటి జబ్బుతో బాధపడుతున్నాడు. కానీ ఆ జబ్బే అతని పాలిట వరంగా మారింది. హెటెరోక్రోమియా జబ్బు వల్ల కళ్లు రెండూ వేర్వేరు రంగుల్లోకి మారుతాయి. ఫొటోలో మేఖీ కళ్లు ఎలా మారయో చూడండి. మేఖీ ఫొటోను చూసిన మోడలింగ్‌ కంపెనీ అతని గురించి వివరాలు కనుక్కుని మోడలింగ్‌ చేయాలని కోరింది.మోడలింగ్‌ ఏజెన్సీ ఆఫర్‌తో మేఖీ ఎగిరి గంతేశాడు. మోడల్‌గా మారిన అనంతరం మేఖీ తన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. ఇన్‌స్టాలో మేఖీకి 20 వేల ఫాలోవర్స్‌ ఉన్నారు.


Back to Top