Sakshi News home page

మరో రెండు రోజులు భారీ వర్షాలు

Published Tue, Jun 28 2016 8:05 PM

Heavy rain to continue for two more days

- బలం పుంజుకున్న నైరుతి రుతు పవనాలు
- కోస్తాకు వాతావరణశాఖ హెచ్చరిక

హైదరాబాద్
: వచ్చే రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయి. బుధ, గురువారాల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో నైరుతి రుతుపవనాలు మరింత పుంజుకున్నాయి. వీటి ప్రభావంవల్ల కోస్తాంధ్రతోపాటు రాయలసీమ జిల్లాల్లోనూ గత రెండు రోజులుగా ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

కోస్తా జిల్లాలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ మంగళవారం రాత్రి వెబ్‌సైట్‌లో ప్రకటించింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం ఉదయానికి (గత 24 గంటల్లో) విశాఖపట్నంలో అత్యధికంగా 51 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయానికి గత 24 గంటల్లో తిరుపతిలో 27, విజయవాడలో 23, మచిలీపట్నంలో 21, కళింగపట్నంలో 21, కడపలో 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement