పుష్కర యాత్రికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు | Sakshi
Sakshi News home page

పుష్కర యాత్రికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

Published Fri, Jul 29 2016 11:34 PM

పుష్కర యాత్రికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

పెద్దదోర్నాల : 
కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తరలి వచ్చే యాత్రికులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కర్నూలు రేంజ్‌ డీఐజీ రమణకుమార్‌ పేర్కొన్నారు. పుష్కరాల సందర్భంగా ట్రాఫిక్‌ తదితర అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం స్థానిక పోలీసు అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పుష్కరాల అనంతరం యాత్రికుల ర ద్దీ తగ్గేంత వరకూ సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. లక్షలాది మంది భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి  వస్తుంనందున జేబుదొంగలు, చైన్‌స్నాచర్లు సంచరించే ప్రమాదం ఉందని, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రకాశం, కర్నూలు జిల్లాల పోలీసులు సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్పారు. యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్ట భద్రత ఏర్పాట్లను చేపట్టినట్లు తెలిపారు. శ్రీశైలం వచ్చి, పోయే వాహనాల సంఖ్య అధికంగా ఉండటంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, దీన్ని నివారించేందుకు గట్టి చర్యలు చేపడతామన్నారు. నిరంతరం ప్రత్యేక వాహనాలతో మొబైల్‌ పార్టీలు, మోటార్‌బైక్‌ పార్టీలతో  పెట్రోలింగ్‌ నిర్వíß స్తామన్నారు. ఒక డీఎస్పీని మండల కేంద్రంలో ఉంచి ఎప్పడికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఘాట్‌ రూట్లలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ఉండేందుకు రెండు రికవరీ వ్యాన్లను ఏర్పాటు చేయనున్నట్లు డీఐజీ రమణకుమార్‌ తెలిపారు. యర్రగొండపాలెం సీఐ మల్లికార్జునరావు, ఏపీఎస్పీ–2 బెటాలియన్‌ ఆర్‌ఐ మహబూబ్‌బాషా ఉన్నారు. 

Advertisement
Advertisement