10శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం | Sakshi
Sakshi News home page

10శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం

Published Wed, Jul 27 2016 10:34 PM

fight for 10percent reservation

జడ్చర్ల టౌన్‌: గిరిజనులకు 10శాతం రిజర్వేషన్‌ కోసం పోరాటం చేస్తామని ఎల్‌హె^Œ పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దాస్‌రాంనాయక్‌ స్పష్టంచేశారు. బుధవారం పట్టణంలోని టీఎన్‌జీఓ భవనంలో జరిగిన గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ల శాతం పెంచితేనే గిరిజనులకు మేలు జరుగుతుందన్నారు. తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాలని డిమాండ్‌చేశారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను కేవలం తండాల్లో మాత్రమే వెచ్చించాలని ప్రభుత్వాన్ని కోరారు.
  గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాథోడ్‌ మాట్లాడుతూ రిజర్వేషన్ల పెంపుకోసం విద్యార్థులు ఆందోళనలకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. అనంతరం గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిగా రమేష్‌నాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో  సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకేష్‌నాయక్, ఉపాధ్యక్షులు సంతోష్‌నాయక్, జిల్లా కార్యదర్శి రమేష్‌నాయక్, శాంతి, సుజాత, శారద పాల్గొన్నారు. 
 
 

Advertisement
Advertisement