తప్పు చేస్తే ‘హీరో ఆఫ్ ది డే’ అనేవారు.. | Sakshi
Sakshi News home page

తప్పు చేస్తే ‘హీరో ఆఫ్ ది డే’ అనేవారు..

Published Mon, Jul 27 2015 11:31 PM

abdul kalam admired me, when i was mistaken, says tv reddy

హైదరాబాద్:మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అధ్వర్యంలో జరిగిన అగ్ని, పృథ్వి మిస్సైల్ ప్రాజెక్టులో ఐదేళ్ల పాటు పనిచేసే భాగ్యం నాకు దక్కింది. విధి నిర్వహణలో చిన్నచిన్న పొరపాట్లు చేస్తే ఆయన కోపగించుకునేవారు కాదు. ఈ రోజు హీరో ఆఫ్ ది డే నువ్వే’ అనేవారు. జరిగిన లోపాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆయన నిరంతరం మాకు సూచించేవారు. అర్ధరాత్రి, అపరాత్రి పరిశోధనలే ఆయన ప్రపంచం. ఆర్‌సీఐలో పనిచేస్తున్న సమయంలోనే పద్మవిభూషణ్ అవార్డు కలాంను వరించింది.

 

విధుల్లో ఎలాంటి సందేహాలు తలెత్తినా ఆయనను అడిగితే ఓర్పుతో సమాధానం ఇచ్చేవారు. తన కింద పనిచేస్తున్న ఉద్యోగులతో మిత్రుడిగా, సహచరుడిగా మెలిగేవారు. కష్టపడి పనిచేసేవారిని ఎప్పుడూ మెచ్చుకునేవారు.

- టి.వి.రెడ్డి, ఆర్‌సీఐ రిటైర్డ్ టెక్నికల్ అధికారి

 

Advertisement
Advertisement