లాభాల్లోంచి.. ఫ్లాట్‌గా మార్కెట్లు | Sakshi
Sakshi News home page

లాభాల్లోంచి.. ఫ్లాట్‌గా మార్కెట్లు

Published Mon, Dec 4 2017 2:25 PM

stoclmaekrts trading flat  - Sakshi

సాక్షి,ముంబై: ప్రధాన స్టాక్‌ సూచీలు సోమవారం రేంజ్‌ బౌండ్‌లో కొనసాగుతున్నాయి.  ముఖ్యంగా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన భారీ కోతలతో కూడిన పన్ను సంస్కరణలకు అమెరికా సెనేట్‌ ఆమోదముద్ర నేపథ్యంలో నాలుగు రోజుల నష్టాలకు చెక్‌ పెట్టిన మార్కెట్లు ఫ్లాట్‌గా మారాయి. 100కుపైగా లాభాలతో ప్రారంభమైనా సెన్సెక్స్‌ 18 పాయింట్ల లాభంతో 32,850 వద్ద, నిఫ్టీ కేవలం 4 పాయింట్లు బలపడి 10,125 వద్ద ట్రేడవుతోంది. ఐటీ, మెటల్‌,మీడియా పాజిటివ్‌గా ట్రేడ్‌ అవుతుంగా, ఫార్మా వెనకడుగు వేసింది.

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో మెటల్‌ రంగ షేర్లకు సూచీగా ఉన్న నిఫ్టీ మెటల్‌ మాత్రం మెరుపులు పుట్టిస్తోంది. ఎన్‌ఎండీసీ జిందాల్ స్టెయిన్‌లెస్‌ (హిసార్) లిమిటెడ్, హిందాల్కో , వేదాంత , జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సెయిల్‌, టాటా స్టీల్‌, జిందాల్‌ స్టీల్‌, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌తోపాటు, బయోకాన్‌ 10 శాతంపైగా దూసుకెళ్లింది. ఆర్‌కాం, గ్లెన్‌మార్క్‌, శ్రీరామ​ ట్రాన్స్‌పోర్ట్‌, నిట్‌ టెక్‌, బెర్జర్‌ పెయింట్స్‌, టీవీ18, బీఈఎల్‌, పిడిలైట్‌ నష్టపోతున్నాయి. అలాగే జస్ట్‌డయల్‌, రిలయన్స్‌ నావల్‌, ఎస్కార్ట్స్‌ తదితర షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Advertisement
Advertisement