నష్టాలకు చెక్‌: లాభాల్లో మార్కెట్లు | Sakshi
Sakshi News home page

నష్టాలకు చెక్‌: లాభాల్లో మార్కెట్లు

Published Thu, Nov 9 2017 9:34 AM

stockmarkets opens with gains - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభయ్యాయి. ఆసియా మార్కెట్ల జోష్‌తో  గతరెండు రోజుల నష్టాలకు చెక్‌  చెప్పాయి.  సెన్సెక్స్‌ 176 పాయింట్ల  లాభంతో 33, 395 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు ఎగిసి 10,360వద్ద  ట్రేడ్‌ అవుతున్నాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌ జోరు పీఎస్‌యూ బ్యాంక్స్‌ జోరుతోపాటుఅన్ని రంగాలూ లాభపడుతున్నాయి. అలాగే ఫార్మా, రియల్టీ, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆటో  సెక్టార్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
టాటా మోటార్స్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌పీసీఎల్‌, హిందాల్కో, సన్‌ ఫార్మా, టాటా స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, స్టేట్‌బ్యాంక్‌, అంబుజా, ఆర్‌ఐఎల్‌  లాభాల్లోనూ,  హెచ్‌డీఎఫ్‌సీ, కోల్‌ ఇండియా  స్వల్ప నష్టాల్లోఉన్నాయి.  

ఆసియా మార్కెట్లు భారీలా లాభాలతో కొనసాగుతున్నాయి. దాదాపు పదేళ్ల గరిష్టస్తాయిలో పరుగులుపెడుతున్నాయి. అటు వాల్‌స్ట్రీట్‌లో  వరుసగా రెండో రోజు కూడా రికార్డ్‌ స్థాయిలు కొనసాగుతున్నాయి.  జపాన్‌ నిక్కీ కూడా 1.4 శాతం లాభపడింది. దీంతో 1992 జనవరి నాటి స్థాయికి చేరింది.  సౌత్‌ కొరియా  కోస్పి, షాంఘై , హాంగ్‌సెంగ్‌ మార్కెట్లు కూడా పుంజుకున్నాయి.  న్యూజిలాండ్‌ డాలర్‌  భారీ లాభాలతో ర్యాలీ  అవుతోంది. 1శాతానికి పైగా లాభపడి రెండు వారాల గరిష్టాన్ని తాకింది. 

 

Advertisement
Advertisement