మిశ్రమంగా ముగిసిన స్టాక్‌మార్కెట్లు | Sakshi
Sakshi News home page

 మిశ్రమంగా ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Published Mon, Nov 6 2017 3:55 PM

Sensex rises 45.63 pts to end at new peak - Sakshi

సాక్షి, ముంబై:   దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. మిడ్ సెషన్‌  కొనుగోళ్లతో  పుంజుకున్నా చివరి అర్థగంటలో అమ్మకాల ఒత్తడి కొనసాగింది.  చివరికి సెన్సెక్స్‌ 46 పాయింట్లతో  33,732ముగియగా, నిఫ్టీ 0.70 నష్టంతో 10,451 వద్ద  స్థిరపడింది.     సెన్సెక్స్‌ రికార్డ్‌ స్థాయికిపైన  ముగియగా,నిఫ్టీ రికార్డ్‌ స్థాయినుంచి దిగజారి మిశ్రమంగా ముగిశాయి. 
 ఆటో ఐటీ, రియల్టీ స్వల్ప లాభాలకు పరిమితమవగా,  పీఎస్‌యూ బ్యాంక్స్‌ ప్రయివేట్‌ బ్యాంక్స్‌  షేర్లు నష్టపోయాయి.  ఆభరణాల షేరు టైటన్‌ ఫలితాల జోష్‌తో భారీగా లాభపడింది. ఇన్ఫీబీమ్‌ టాప్‌ విన్నర్‌గా నిలిచింది. ఇండియన్‌ బ్యాంక్‌, పీసీ జ్యువెలర్స్‌, అదానీ ఎంటర్‌, వొకార్డ్‌, టాటా మోటార్స్‌, టాటా గ్లోబల్‌, హెచ్‌డీఐఎల్‌ లాభాల్లోనూ,  ఆర్‌ఈసీ, ఆర్‌కామ్‌, రిలయన్స్‌ కేపిటల్‌, ఐడియా, రిలయన్స్‌ నావల్‌, పీఎఫ్‌సీ, దివాన్‌ హౌసింగ్‌, సెంచురీ టెక్స్‌, సెయిల్‌, పీఎన్‌బీ తదితరాలు నష్టాల్లోనూ ముగిశాయి. 
 

Advertisement
Advertisement