బలపడిన రూపాయి | Sakshi
Sakshi News home page

బలపడిన రూపాయి

Published Wed, Feb 7 2018 10:04 AM

Rupee surges 20 paise against dollar in early trade  - Sakshi

సాక్షి, ముంబై: డాలర్‌ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి బలపడింది. 20 పైసలు పెరిగి 64.04 వద్ద ప్రారంభమైంది. విదేశీ కరెన్సీలతో డాలర్ బలహీనపడటంతోపాటు,  దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ప్రారంభ లాభాలు రూపాయికి మద్దతునిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో రూపాయి మరింతగా లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.  మరోవైపు ఆర్‌బీఐ వడ్డీరేట్లపై అంచనాల నేపథ్యంలో  బ్యాంకింగ్‌  సెక్టార్‌లోని లాభాలు   కూడా  రూపాయి విలువకు మద్దతునిస్తున్నాయి. అటు  అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు  200 పాయింట్లకు పైగా ఎగిశాయి. అయితే  ఇవాల్టి ఆర్‌బీఐ పాలసీ రివ్యూ ఈక్విటీ మార్కెట్లకు, రూపాయికి కీలకం కానుంది.

శుక్రవారం  రూపాయి 17 పైసలు    నష్టపోయి  64.24 వద్ద ఏడు వారాల కనిష్ఠ స్థాయిని నమోదుచేసింది.  అమెరికా మార్కెట్లు.. డాలర్ డిమాండ్ కారణంగా నిన్న రూపాయి మారకం భారీగా నష్టాలకు గురైన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement