♦ కన్వర్టర్–బి లో రికార్డు హీట్ల ఉత్పత్తి
♦ రోజులో 24 హీట్లు; ఇది జాతీయ రికార్డు!
ఉక్కునగరం (గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్... రికార్డు ఉత్పత్తిని సాధించింది. స్టీల్‌ప్లాంట్ స్టీల్‌మెల్ట్‌షాప్ (ఎస్ఎంఎస్–1)లో ఆధునికీకరించిన కన్వర్టర్–బి రికార్డు హీట్లను ఉత్పత్తి చేసింది. ప్రారంభించిన 24 గంటల్లో 24 హీట్లు (ఒక హీట్ సుమారు 150 టన్నులకు సమానం) సాధించి మరో జాతీయ రికార్డును నమోదు చేసింది. స్టీల్‌ప్లాంట్ 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం పెంపులో భాగంగా సుమారు రూ.400 కోట్ల వ్యయంతో ఎస్ఎంఎస్–1లోని 3 కన్వర్టర్ల ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. కన్వర్టర్–ఎ ఆధునికీకరణ పనులు గతేడాది మార్చిలో పూర్తయి ఉత్పత్తి మొదలయింది.
అప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేమి వల్ల, సాంకేతిక పరిజ్ఞానంలో సమస్యల వల్ల మొదటి 24 గంటల్లో 4 హీట్లే సాధించగలిగారు. గతేడాది జూన్‌లో ప్రారంభించిన కన్వర్టర్–సి ఆధునికీకరణ పనులు అక్టోబర్‌లో పూర్తయి ఉత్పత్తి ఆరంభించారు. అది మొదటి 24 గంటల్లో 19 హీట్లు ఉత్పత్తి చేసి జాతీయ రికార్డుగా రూర్కెలా ఉత్పత్తి 11 హీట్లను అధిగమించింది. ఈ జనవరిలో మొదలుపెట్టిన కన్వర్టర్–బి ఆధునికీకరణ పనులు 145 రోజులు నిర్దేశించగా 127 రోజులకే పూర్తి చేశారు. దీన్ని ప్రారంభించిన 24 గంటల్లో 24 హీట్లు సాధించి మరో జాతీయ రికార్డును నమోదు చేసింది. ఇది అంతర్జాతీయ రికార్డుగా కూడా అధికారులు భావిస్తున్నారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రికార్డు ఉత్పత్తి
Published Thu, May 25 2017 12:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement