ఏపిఎన్జిఓల సమ్మెపై జడ్జిల భిన్నాభిప్రాయాలు | Sakshi
Sakshi News home page

ఏపిఎన్జిఓల సమ్మెపై జడ్జిల భిన్నాభిప్రాయాలు

Published Wed, Nov 20 2013 3:36 PM

ఏపిఎన్జిఓల సమ్మెపై జడ్జిల భిన్నాభిప్రాయాలు - Sakshi

హైదరాబాద్: ఏపిఎన్జిఓల సమ్మె చట్టవిరుద్దమంటూ దాఖలైన పిటిషన్ విషయంలో హైకోర్టు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పిటిషన్ విచారణార్హమైనదిగా హైకోర్టు ప్రధాన న్యాయూర్తి పేర్కొన్నారు. పిటిషన్ దాఖలులో రాజకీయ ప్రేరేపితం ఏమీ లేదని న్యాయమూర్తి సిజె గుప్త అభిప్రాయపడ్దారు. సమ్మె చేసినవారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

జస్టిస్ కెసి భాను ఆ అభిప్రాయంతో విభేదించారు. పిటిషన్లో రాజకీయ ప్రేరేపితం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దాంతో మూడవ న్యాయమూర్తి అభిప్రాయానికి నివేదించారు.

Advertisement
Advertisement