జూడాలపై పోలీసుల దాడి సరికాదు: సుచరిత | Sakshi
Sakshi News home page

జూడాలపై పోలీసుల దాడి సరికాదు: సుచరిత

Published Thu, Aug 8 2019 4:07 PM

Investigation to Police Attack On Junior Doctors - Sakshi

సాక్షి, విశాఖపట్నం: జూనియర్‌ వైద్యులపై పోలీసుల దాడి సరికాదని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంఘటనపై శాఖా పరమైన దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపారు. జూనియర్‌ డాక్టర్లు తమ హక్కుల కోసం ధర్నాలు చేసుకోవడంలో తప్పు లేదని.. కానీ పోలీసులకు సమాచారం అందించాలన్నారు. రాష్ట్ర్రంలో అన్ని పోలీసు స్టేషన్లను వుమెన్‌ ఫ్రెండ్లీగా మారుస్తామని వెల్లడించారు. తమ ప్రభుత్వంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.

ఏవోబీలో పరిస్థితి అదుపులో ఉంది: డీజీపీ
ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లో పరిస్థితి అదుపులో వుందని డీజీపీ గౌతం సవాంగ్‌ అన్నారు. మావోయిస్టులు ఉనికి కోసం పాకులాడుతున్నారని.. అందుకే హింసకు మార్గాలు వెతుకుతున్నారన్నారు. మావోయిస్టులకు జన ప్రాబల్యం తగ్గిందని తెలిపారు. కళాశాలల్లో విద్యార్థునుల రక్షణ కోసం వర్చువల్ పోలీస్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో జూనియర్‌ డాక్టర్లపై పోలీసుల దాడి.. అనుకోకుండా జరిగిన సంఘటనగా పేర్కొన్నారు. సంఘటన దృశ్యాలు చూస్తుంటే పొరపాటు జరిగిందనే అనిపిస్తోందన్నారు. 
 

Advertisement
Advertisement