ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నాటక రంగం నిర్వీర్యం | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నాటక రంగం నిర్వీర్యం

Published Sun, Jan 5 2014 1:29 AM

Because the government to weaken the theater

మునగపాక, న్యూస్‌లైన్: ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ప్రస్తుతం నాటక రంగం నిర్వీర్యమవుతోందని వైఎస్సార్ సీపీ పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త గండి బాబ్జి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ  జన్మదినం సందర్భంగా నందీశ్వర ప్రాంగణం వద్ద నిర్వహించిన రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు ముగిశాయి.

ఈ సందర్భంగా విజేతలకు ఆయన శనివారం రాత్రి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గాజువాక వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి, ఆర్‌ఈసీఎస్ మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ ప్రసంగించారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మళ్ల సంజీవరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యలమంచిలి, రాంబిల్లి మండలాల వైఎస్సార్ సీపీ నేతలు బోదెపు గోవింద. పిన్నమరాజు వెంకటపతిరాజు (చంటిరాజు), శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం ఆచార్యుడు ముత్యాలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
 
ఉత్తమ ప్రదర్శన గా ‘సంచలనం’
 
కొణతాల జన్మదినం సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి నాటిక పోటీల్లో కాకినాడ కళాకారులు ప్రదర్శిం చిన‘సంచలనం’ ఉత్తమంగా ఎంపికైంది. ద్వితీయ ఉత్త మ ప్రదర్శనగా తెనాలికి చెందిన ‘ఒక్కమాటే చాలు’ నిలి చింది. ఉత్తమ నటునిగా ప్రసాద్ (సంచలనం), ఉత్తమ నటిగా సురభి ప్రభావతి (ఒక్క క్షణం), ఉత్తమ విలన్‌గా సత్యప్రసాద్ (పితృవనం), హాస్యనటునిగా ఉదయభాగవతులు (బొమ్మ సముద్రం), క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆది నారాయణ (పితృవనం), ఉత్తమ రచయితగా భవాని ప్రసాద్ (ఒక్క క్షణం), ఉత్తమ దర్శకునిగా ప్రసాద్ (సంచలనం), ప్రత్యేక బహుమతిని నారాయణమూర్తి (పితృవనం)లు కైవసం చేసుకున్నారు. విజేతలకు బాబ్జి, నాగిరెడ్డి, ప్రసాద్ బహుమతులు అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా మొతికా సాంబశివరావు, దొడ్డి అప్పలనాయుడు మాస్టారు, కాశీ విశ్వేశ్వరరావు వ్యవ హరించారు.
 

Advertisement
Advertisement