ప్రధాన వార్తలు
అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
వేముల: వైఎస్సార్సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ ప్రజలను కోరారు. వైఎస్సార్ జిల్లా వేములలో ఆదివారం ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వైఎస్ జగన్, వైఎస్ అవినాశ్‌రెడ్డిలను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్ భారతమ్మ, ఆమె సోదరుడు, ప్రముఖ వైద్యుడు ఈసీ దినేశ్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి భారతమ్మపై అభిమానం చూపారు. ఆమెను చూడగానే చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ, తమ ఇంటిలోకి ఆహ్వానించి అభిమానాన్ని చాటుకున్నారు. చాలా రోజుల తర్వాత ఆమెను చూడటంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు. వేముల మెయిన్ రోడ్డు, ఎస్సీ కాలనీ, శేషన్నగారిపల్లె, బచ్చయ్యగారిపల్లెల్లో భారతమ్మ, ఈసీ దినేశ్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి సోదరి శ్వేతారెడ్డి.. జెడ్పీటీసీ వెంకట బయపురెడ్డి, ఎంపీపీ చల్లా గంగాదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ లింగాల ఉషారాణి, వైఎస్సార్సీపీ మండల ఇన్చార్జి నాగెళ్ల సాంబశివారెడ్డి, మండల పరిశీలకులు లింగాల రామలింగారెడ్డి, పీసీబీ డైరెక్టర్ మరక శివకృష్ణారెడ్డిలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక టీసీసీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రచారంలో అవ్వాతాతలను, మహిళలు, పెద్దలను ‘అన్న బాగున్నారా.. అవ్వా బాగున్నారా’ అంటూ భారతమ్మ ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఇంటి వద్ద వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులను ఆప్యాయంగా ఎత్తుకున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. పేదల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని భారతమ్మ చెప్పారు. పేదలు ఉన్నత చదువులు చదివితే ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతాయని నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చివేశారన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనను గ్రామీణ విద్యార్థులకు చేరువ చేశారని తెలిపారు. పేదల సంక్షేమ పథకాలు కొనసాగడానికి మరోసారి వైఎస్ జగన్‌ను సీఎంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. సీఎం జగన్‌కు మెండుగా ప్రజల ఆశీస్సులు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాలపై దృష్టి సారించిందని భారతమ్మ తెలిపారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పాలనను ప్రజల వద్దకే తీసుకొచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేశారన్నారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ జగన్‌ను ప్రజలు మళ్లీ సీఎంగా కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగన్ విజయాన్ని ఆపలేరన్నారు. ఎన్నికల ప్రచారంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
పిఠాపురం: గోకులం గ్రాండ్ హోటల్లో ఏం జరిగింది?. అక్కడి నుంచి డబ్బుల బ్యాగులు ఎక్కడికి వెళ్లాయి? పిఠాపురంలో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్. జనసేన నేతలు బస చేసిన హోటల్ నుంచి భారీ మొత్తంలో డబ్బును సేఫ్‌గా ఎలా తరలించారో ఇక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం రాత్రి సినీ ఫక్కీలో జరిగిన సీన్లో అసలు కథ ఏంటంటే.. ఇక్కడ ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఎవ్వరూ ఆపకుండానే ఓ కారు వచ్చి ఆగింది.రోడ్డుకు అడ్డంగా పెట్టి ట్రాఫిక్ స్తంభించేలా చేశాడు ఆ కారు డ్రైవర్. ట్రాఫిక్ ఆగిపోవడంతో చెక్‌పోస్టు సిబ్బంది వెంటనే అప్రమత్తమై, వాహనాలను క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఇదే సమయంలో అడ్డంగా పెట్టిన కారులో నుంచి కనిపిస్తున్న పెద్ద అట్టపెట్టెలపై తనిఖీ సిబ్బంది దృష్టి పడింది. అనుమానం వచ్చి సోదా చేయగా.. అందులో 17 అట్టపెట్టెల్లో జనసేన గుర్తుతో ఉన్న గాజు గ్లాసులు కనిపించాయి. వెంటనే వాటిని స్వా«దీనం చేసుకున్న అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది తెలిసి మీడియా అంతా అటు దృష్టి పెట్టింది. పోలీసులు కారును, గాజు గ్లాసులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పక్కదోవ పట్టించేలా పక్కా వ్యూహం తనిఖీ అధికారులు, పోలీసులు కారులోని గాజు గ్లాసులకు ఎటువంటి బిల్లులూ లేకపోవడంతో స్వా«దీనం చేసుకుంటున్న సమయంలో ముందస్తు పథకం ప్రకారం.. కారును తనిఖీ చేస్తున్న ప్రదేశానికి కొందరు జనసేన నేతలు వచ్చి, అధికారులతో వాగ్వాదానికి దిగారు. సరిగ్గా అదే సమయంలో అక్కడకు కిలోమీటర్ దూరంలో ఉన్న గోకులం హోటల్లో ప్రత్యేక బృందాలు తనిఖీ చేపట్టాయి. అక్కడ క్లీన్ చిట్ ఇచ్చేంత వరకూ జనసేన నేతలు వాగ్వాదం కొనసాగించారు.అధికారులు కారులో గ్లాసులు స్వా«దీనం చేసుకున్నప్పుడు ఎటువంటి బిల్లులూ లేవని చెప్పిన జనసేన నేతలు.. హోటల్లో తనిఖీలు పూర్తి కాగానే ఆ గ్లాసులకు బిల్లులు తీసుకువచ్చి పోలీసులకు చూపించడం పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని అర్థమవుతోంది. సినీ నటులు, సహాయ నటులు ఉన్న జనసేనకు ఇలాంటి సీన్లు క్రియేట్ చేయడం పెద్ద పనేమీ కాదని, భవిష్యత్‌లో ఇలాంటివి ఇంకెన్ని చూడాలో అని స్థానికులు చర్చించుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో గోకులం గ్రాండ్ అనే హోటల్‌ను నెల క్రితం జనసేన అగ్ర నేతలు అద్దెకు తీసుకుని ఇక్కడి నుంచి నియోజకవర్గం పార్టీ ఎన్నికల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే భారీ నగదు ఉంది అనే సమాచారంతో స్పెషల్ పార్టీ ఎన్నికల తనిఖీ అధికారులు శనివారం రాత్రి హఠాత్తుగా ఈ హోటల్ వద్దకు వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు అధికారులు తనిఖీలు చేసి అక్కడ ఏమీ లేవని తేల్చేశారు. జనసేన నేతలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఈ హోటల్‌పై ఎన్నికల అధికారులు దాడులకు వస్తున్నారనే సమాచారం జనసేన అగ్ర నేతలకు ముందే తెలిసింది.వెంటనే కారు డ్రామాకు ప్లాన్ చేశారు. చెక్‌పోస్టు వద్దకు పంపి ట్రాఫిక్‌ను ఆపి హైడ్రామా క్రియేట్ చేశారు. దీంతో మీడియా ఫోకస్ అటు మళ్లింది. ఈలోపు భారీ మొత్తంలో ఉన్న డబ్బును బ్యాగుల్లో నింపి కిటీకీల్లో నుంచి కిందకు పడేసి అక్కడి నుంచి వాటిని తరలించారని విశ్వసనీయంగా తెలిసింది. స్థానికులు, మీడియా, పోలీసుల దృష్టి ట్రాఫిక్‌కు అడ్డంగా పెట్టిన కారుపైకి మళ్లించి.. డబ్బును రహస్య ప్రాంతానికి మళ్లించారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
సీను సీతారైంది సాంబడా
ఎంతమంది రౌడీలను పెట్టినా హీరో లొంగడం లేదు.. పైగా ఎగిరెగిరి తంతున్నాడు. వచ్చినవాళ్లు వచ్చినట్లే నేలకు కరుచుకుపోతున్నారు.. ఇక ఇలాక్కాదని రావుగోపాలరావుకు కోపం వచ్చింది. బొంబాయి నుంచి జిముంబా అనే పెద్ద దాదాను తీసుకొచ్చాడు. వాడు మామూలు మనిషి కాదు.. పూటకు రెండు గొర్రెలు వంద గుడ్లు తింటాడు. వాణ్ని ఎవరూ ఎదుర్కోలేరు. అలాంటివాణ్ణి హీరోమీదకు ఉసిగొల్పాడు.. మొదటి రెండు షాట్లు తిన్న హీరో ఇక లేచాడు. కళ్ళలో పడిన దుమ్మును దులిపేసి.. నడుముకు తువాలు చుట్టి జై భజరంగి భళి అంటూ గర్జించాడు.. ఎగిరెగిరి తన్నాడు.. దెబ్బకు జిముంబా కూడా నేల కరిచేసాడు.ఆంధ్ర పాలిటిక్స్ కూడా ఇలాగే ఉన్నాయ్.. రావుగోపాలరావు పాత్రలో ఉన్న చంద్రబాబు కూడా ఇలాగే హీరో జగన్ మీద రకరకాల వాళ్ళను ప్రయోగిస్తున్నారు... వలంటీర్ల మీద దుమ్ము రేపబోయాడు... అది ఎదురుతన్నింది... వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను ఆపించాలని చూసాడు... వృద్ధులతో తిట్లు కాసాడు.. ఇంగ్లిష్ మీడియం వద్దన్నాడు.. పేరెంట్స్ తో చీవాట్లు కాసాడు... ఇక ఇలా కాదని ఎక్కడా లేని ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని బయటకు తెచ్చి ఇది వచ్చిందంటే ఇక మీ భూములన్నీ ఉఫ్... జగన్ ఎత్తుకుపోతాడు.. అంటూ తన బ్యాచ్ తో కలిసి తెగ ప్రచారం చేసాడు... పత్రికలూ...మీడియా..చానెళ్లు ఇవన్నీ నాలుగురోజులపాటు ఇదే పనిమీద ఉన్నాయ్.. పూనకం వచ్చినట్లు ఊగిపోయారు... ఎల్లో మీడియా సంస్థలన్నీ ఒళ్ళంతా సూదులతో గుచ్చుకుని కొరడాలతో కొట్టుకున్నారు... జనాన్ని భయపెట్టేసి కంగారు పెట్టేసి.. వామ్మో వాయ్యో అనేలా చేసి....సంబరపడుతున్న తరుణంలో మెల్లగా సీఎం వైయస్ జగన్ మైక్ అందుకున్నారు. చదవండి: కొత్త పగటివేషగాడు వచ్చాడుఅసలు ఆ చట్టం ఆంటే ఏమిటి... దానిలోని లోటుపాట్లు...అంతా చిన్నపిల్లలకు వివరించినట్లు చెప్పారు... లక్షల ఎకరాల చుక్కల భూములను పేదలకు పంచింది మీ జగన్.... లక్షల ఎకరాల పోడు భూముల మీద గిరిజనులకు హక్కులిచ్చాము... ఇంకా చంద్రబాబు గ్యాంగ్ అడ్డుకున్నా.. కోర్టుల్లో కేసులు వేసినా లక్షలమందికి వేలాది ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చాము...ఇదీ మీ జగన్ నిజాయితీ...ఇదీ మీ జగన్ కు మీ పట్ల ఉన్న ప్రేమ... అలాంటి జగన్ మీ భూములు లాక్కుంటాడా ? ఈ ఐదేళ్ల పాలనలో మీరు జగన్‌ను ఇదేనా అర్థం చేసుకున్నది... అంటూ వివరించారు. దీంతో జనానికి విషయం అర్థం ఐంది.అంటే పెన్షన్ల విషయంలో కుట్రపన్నినట్లే ఈ ల్యాండ్ టైట్లింగ్ చట్టం విషయంలోనూ చంద్రబాబు కావాలనే ప్రజలను తప్పుదోవపడుతున్నట్లు జనానికి అర్థం ఐంది... దీంతోబాటు అలంటి తప్పుడు ప్రకటనలు..ప్రసంగాలు చేస్తున్నందుకు ఎన్నికల సంఘం ఆదేశాలతో చంద్రబాబు, లోకేష్ సీఐడీ కేసు నమోదు చేసింది.దీంతో ప్రజలకు విషయం అర్థమైంది...అంతేకాకుండా ఆ అంశం ప్రజల మనస్సుల్లోంచి తొలగిపోతూ... జై జగన్ అనే నినాదం వచ్చి చేరుతోంది... దీంతో ఎల్లో మీడియా... చంద్రబాబు క్యాంప్ తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ అయిపోయారు.. ఎంతో ప్లాన్ చేసి ఈ టైట్లింగ్ చట్టం మీద గాయిగాత్తర చేయబోతే ఇలాగయ్యిందేంటిరా సాంబడా అంటూ తండ్రీకొడుకులు నెత్తి నోరు బాదుకుంటున్నారు.. మనం ఎంత పెద్ద కుట్రపన్నినా అటు జగన్ ఒక్క బాణంతో దాన్ని ఎఱుర్కొంటూనే తిరిగి ఆ వ్యూహం మనకు తగిలేలా చేస్తున్నాడు..ఇలాగైతే ఎలారా సాంబా అని తండ్రీకొడుకులు కొత్త కుట్రలకు సిద్ధమవుతున్నారు... ఈసారి ఢిల్లీ కాకుండా బీహార్ నుంచి భిక్షు యాదవ్ ను తెచ్చేపనిలో ఉన్నారేమో... చూడాలి.:::: సిమ్మదిరప్పన్న
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఎప్పుడో మూలబడిపోయి, నట్లు ఊడిపోయిన అంబాసిడర్ కారుకు కలర్ వేసి తీసుకొస్తే అది ఆడి కార్ అయిపోతుందా...ముసలమ్మకు మేకప్ వేసి చూపిస్తే ముద్దుగుమ్మ అయిపోతుందా..సంస్థను మోసం చేసి...చెక్కుబుక్కులు ఎత్తుకుపోయి వ్యవస్థనే మోసం చేసి కేసులపాలై ఏళ్లపాటు సమాజానికి మొహం చూపించలేక ఎక్కడో దూరంగా బతుకుతున్న వ్యక్తిని తీసుకొచ్చి రాత్రికిరాత్రి సర్వేలు అంటూ అవాస్తవాలు. చెప్పిస్తే ప్రజలు నమ్ముతారా ? అసలు ఈ కాలం జనం అలా ఉన్నారా? ఎవరో ఏదో చూపిస్తే అబ్బో...బ్రహ్మాండం అని నమ్మే తీరులో ఉన్నారా? అసలు ఇప్పుడు ఎక్కడో మారుమూల పల్లెల్లోని జనం కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతూ సోషల్ మీడియాలో అన్నీ చూస్తూ ఏ ఛానెల్..ఏ పత్రిక ఎవరిపక్షమో చెప్పగలుగుతున్నపుడు ఈ మాయమాటలు ఎవరు నమ్ముతారు.వాస్తవానికి చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ఊత కర్ర లేకపోయింది. అంటే ఏ అంశాన్ని పట్టుకుని ప్రజల్లోకి వెళ్లి నమ్మిస్తారు..ఆకట్టుకుంటారు..ప్రస్తుత వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వం అన్నివర్గాలనూ ఆకట్టుకుంటూ అవినీతి రహిత పాలనా అందిస్తోంది. దానికితోడు చంద్రబాబు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయి గౌరవాన్ని కోల్పోయి ఏదో అలా బతుకుతున్నారు తప్ప ఆయన రాజకీయనాయకుడు స్టేచర్ ఏనాడో కోల్పోయారు. దీంతో ఈ ఎన్నికలవేళ తెలుగుదేశానికి కాళ్ళు చేతులు కట్టేసినట్లయింది. ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక కారణం..ఒక అంశం లేకుండా పోయింది.ఇక జగన్ ఐతే చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు. మాయలు ఉండవు...చేయలేనిది చేయలేను ఆయనే ఒప్పేసుకుంటాడు.. అలాంటపుడు మోసానికి కేరాఫ్ అయిన చంద్రబాబు నమ్మాల్సిన అవసరం ఏముందన్న ట్రెండ్ ప్రజల్లో నడిచింది . సినిమా ఫ్లాప్ అయిపోయి..జనాదరణ కోల్పోయి, ఇది చెత్త అని జనాల్లో టాక్ వచ్చినపుడు కొత్త మసాలా పాట కలిపి మళ్ళీ రిలీజ్ చేస్తుంటారు. అంతే ఆ పాట సినిమాను నిలబడుతుందన్న భ్రమ ఆ నిర్మాతలది. మొత్తం సినిమా దరిద్రం అయిపోయాక ఆ ఒక్క పాట సినిమాను నిలబెట్టలేదు. ఇప్పుడు చంద్రబాబు కూడా తన పార్టీ మీదా ఆశ కోల్పోయి బిక్కుబిక్కుమంటున్న పరిస్థితుల్లో రవి ప్రకాష్ అనే అవుట్ డేటెడ్ జర్నలిస్టును తీసుకొచ్చి నోటికొచ్చిన అంకెలు వేసి సర్వే అని విడుదల చేాశారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎవరికీ ఎక్కువ సీట్లు వస్తాయన్నది. ఎవరిపాలన బాగుందన్నది జనానికి తెలుసు. అలాంటిది ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చుని ఇష్టానుసారం అంకెలు వేసేసి ఇదే సర్వే అని జనాల్లోకి వదిలితే నమ్మే కాలం కాదని ఇలాంటి కుట్రదారులు తెలుసుకోవాలి. --సిమ్మాదిరప్పన్న--
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్‌లైట్స్
కాంగ్రెస్‌కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్‌కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్‌గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్‌రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
వీడియోలు
మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ
భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు
అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...
వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..
రైల్వే జోన్ పై కొత్త రాజకీయం
షర్మిల నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు: పొన్నవోలు
ఈరోజే వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో
కేంద్ర మంత్రికి బొత్స స్ట్రాంగ్ కౌంటర్
కేంద్ర మంత్రికి బొత్స స్ట్రాంగ్ కౌంటర్
ఎక్కడ మద్యం దొరికినా సోమిరెడ్డి నాపై బురద జల్లుతున్నాడు