తుంగభద్ర ఐఏబీ సమావేశం రసాభాస | Sakshi
Sakshi News home page

తుంగభద్ర ఐఏబీ సమావేశం రసాభాస

Published Sun, Aug 5 2018 8:08 AM

మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మధ్య వాగ్వాదంతో ఐఏబీ(సాగునీటి సలహా మండలి సమావేశం) సమావేశం రసాభాసగా మారింది. ఏడాదికి ఒక్కసారి నిర్వహించే సమావేశానికి సగం మంది ఎమ్మెల్యేలు కూడా హాజరుకాని పరిస్థితి. వచ్చిన వారి అభిప్రాయాలను కూడా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఓపిగ్గా వినకపోవడం గమనార్హం. పక్ష ఎమ్మెల్యేలతో పాటు స్వపక్ష ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు చెబుతుండగా మంత్రి జోక్యం చేసుకుని ‘ఓకే.. ఓకే.. అన్ని సమస్యలూ పరిష్కరిస్తాం. వీలైనంత త్వరలో నీళ్లిస్తాం’ అని అడ్డుపడ్డారు. స్వపక్షపార్టీ నేత కావడంతో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఏమనలేక మౌనంగా ఉండిపోయారు. అప్పటికీ ఎమ్మెల్యేలు హనుమంతరాయచౌదరి, జితేంద్రగౌడ్, ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడేది పూర్తిగా వినాలని మంత్రికి చెప్పారు. ఇంత తతంగం జరుగుతున్నా ఐఏబీ చైర్మన్‌ జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ కనీసం పెదవి విప్పలేదు. ప్రేక్షకపాత్ర వహించారు. చివరకు నీటి కేటాయింపుల గురించి కూడా మాట్లాడలేకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement