ఈనాటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్’పథకాన్ని మంగళవారం నెల్లూరు సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మికులతో తక్షణమే చర్చలు జరపాల్సిందిగా హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విని చౌబేకు పరాభవం ఎదురయ్యింది. భారత్ సహా ఇతర ప్రపంచ దేశాలతో తాము మైత్రిని మాత్రమే కోరుకుంటున్నట్లు తాలిబన్ గ్రూప్ అధికార ప్రతినిధి మహ్మద్ సుహైల్ షాహీన్ పేర్కొన్నాడు. పోలీసులపై ఉన్న అపోహలు తొలగిపోవడానికే ‘విజిట్ పోలీస్ స్టేషన్’ అనే కార్యక్రమం మొదలుపెడుతున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి