చలి పంజా..45మంది మృతి | Sakshi
Sakshi News home page

చలి పంజా..45మంది మృతి

Published Wed, Dec 19 2018 7:07 AM

ప్రస్తుతం అంతటా ఒకటే ‘కూల్‌’ టాపిక్‌.. ఈ చలేంట్రా బాబూ అన్నదే..  పెథాయ్‌ తుపాన్‌ దెబ్బకు రాత్రి, పగటి ఉష్ణోగ్రతలకు తేడా లేకుండా పోయింది. ఉదయం, మిట్టమధ్యాహ్నం అన్న తేడా లేకుండా చలి వణికించేసింది. అనేకచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలే పగలూ నమోదు కావడం గమనార్హం. గత 24 గంటల్లో భద్రాచలంలో రాత్రి ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా, పగటి ఉష్ణోగ్రత 20 డిగ్రీలు నమోదైంది. అక్కడ సాధారణంగా పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా, 10 డిగ్రీలు తక్కువగా నమోదు కావడం గమనార్హం. మహబూబ్‌నగర్‌లో రాత్రి ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్‌ కాగా, హన్మకొండలో పగటి ఉష్ణోగ్రత కూడా 18 డిగ్రీలే నమోదైంది. వాస్తవంగా హన్మకొండలో సాధారణంగా 30 డిగ్రీలు పగటి ఉష్ణో గ్రత నమోదు కావాలి.