మానవతకు ప్రతీకగా నిలిచిన ఓ చిన్నోడు.. | Sakshi
Sakshi News home page

మానవతకు ప్రతీకగా నిలిచిన ఓ చిన్నోడు..

Published Wed, Nov 7 2018 7:48 AM

దేశమంతా దీపావళి సంబరాల్లో మునిగి తేలుతోంది.  జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా,  జగతిని జాగృతం చేసేలా జరుపుకునే  వెలుగు దివ్వెల పండుగ  దీపావళి. చెడుపై సాధించిన మంచి విజయానికి గుర్తుగావెలుగుల దివ్య దిపావళి. అయితే ఈ దీపావళి రోజు చిన్నా పెద్దా అందరినీ  ఆలోచింప చేసే వీడియో ఒకటి నెట్‌లో చక్కర్లు కొడుతోంది. మంచికీ, మానవతకు ప్రతీకగా నిలిచిన ఓ చిన్నోడు నెటిజనులను విపరీతంగా ఆకర్షిస్తున్నాడు. తన పరిధిలో, బుజ్జి మెదడుకు పదును పెట్టి మరీ సాయం చేసిన వైనం ఆలోచింప చేస్తోంది.  తన మంచి మనసుకు ఆధునిక టెక్నాలజీని జోడించి స్మార్ట్‌గా  బిజినెస్‌ మంత్రను ప్రయోగించి సక్సెస్‌ సాధించడమే ఇందులోని రహస్యం. ఈ   వివరాలు చెప్పేకన్నా.. స్వయంగా  ఈ వీడియోను  చూసి ఆనందిస్తేనే బావుంటుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement